Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రేమికుల రోజుకు అతివలు అందాలు చిందించాలంటే... !

పెందల కడే లేవండి. పనిలేకుండా పడివున్న మీ చెప్పులు ధరించేయండి. ఆగకుండా రోజూ 30 నిమిషాలపాటు ఏకధాటిగా చెమట పట్టేలా వేగంగా నడవండి లేదా జాగ్ చేసేయండి. ప్రతి అయిదు నిమిషాలకు రెండు నిమిషాల చొప్పున పవర్ వాకింగ్ చేయండి. శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగి, చర్మం మెరిసిపోతూ వుంటుంది.
ప్రతిరోజూ కొవ్వు తక్కువగా వుండి, పలుచగా వుండే మిల్క్ షేక్ లేదా కమ్మని పెరుగు కొన్ని పండ్లు కలిపి తినేయండి. స్నాక్స్ సమయమా? కొవ్వు తక్కువగా వుండేవిగా తినండి. ఉడికించిన గుడ్డు, బాదం పప్పు మొదలైనవిగా వుండాలి. లంచ్ సమయంలో శాండ్ విచ్, చపాతి, కూరలు, పప్పు సరిపోతాయి. సాయంత్రం మరోసారి స్నాక్స్ తినాలంటే, పచ్చికూరలు, ఛీజ్ కలిపి తినండి. మరోసారి గుప్పెడు బాదం పప్పు తినండి.
శరీరం బిగువు పొందాలంటే, రెండు డంబ్ బెల్స్ కనీసం ఒక్కొక్కటి 2 నుండి 3 కేజీల బరువుండేవాటిని లేదా నీరు నింపిన బరువైన తేలికగా పట్టుకోగల రెండు సీసాలను రెండు చేతుల్లోకి తీసుకొని పైకి కిందకు ఆడిస్తూ కండలు బిగించండి. కొన్ని అరబిక్ వ్యాయామాలు చేయండి. వీటి తర్వాత అయిదునిమిషాలు జాగ్ చేసి వామ్ అప్ చేసుకోండి. వారానికి నాలుగు సార్లు అరబిక్ వ్యాయామాలు చేయండి. ఈ రకంగా చేస్తే, ప్రేమికులరోజు నాటికి మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో ఫిట్ అయిపోయి పార్టీలలో అందర్ని ఆకర్షించేయటం ఖాయంగా భావించండి.



Click it and Unblock the Notifications