Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రేమ సంబంధాలలో వాస్తవం ఎంత?

1. కట్టుబడి వుండటం - నేటి యువతరానికి కట్టుబడి వుండటం అంటే చాలా వరకు అది ఫేస్ బుక్ వరకే. కాని కట్టుబాటు అనేది సమాజం కొరకు కాదు. అది మనకొరకే అని గుర్తించాలి. సమాజపరంగా మన సంబంధాలు సాధారణంగా వుండాలి. సమాజం కొరకు మన సంబంధాలు ప్రదర్శించరాదు.
2. ఒకే రూఫ్ కింద జీవించటం - కొంతమంది ఎంత దూరం లో వున్నప్పటికి చాలా ప్రేమగా వుంటారు. కాని మీరు ఒకరిపట్ల మరిఒకరికి గల సంబంధం లేదా వాస్తవ సమస్యలు తెలియాలంటే ఒకే ఇంటిలో వుండటం అవసరం. మీరు చేసుకునేది వివాహం లేదా కలసి వుండే ఏర్పాటు ఏదైనా కావచ్చు. కలసి వుంటే మీ మధ్య దూరం ఎంత దగ్గర ఎంత అనేది తెలుస్తుంది.
3. జంటలైపోవాలంటే - హృదయాలకు సంబంధించిన ప్రేమా? అదంతా కవిత్వానికి పరిమితం. మీరు స్పర్శించి దానిని భావిస్తే అదే మీకు వాస్తవం. మీ భాగస్వామికి శారీరకంగా దగ్గరగా వున్నపుడే మీ వాస్తవ ప్రేమ ఏమిటో తెలుస్తుంది.
4. సంక్షోభం - మీ సంబంధం ఏదైనా సంక్షోభంలో పడ్డప్పటికి మరోమారు కొనసాగగలదా? సంక్షోభం అంటే అది మీరు ఊహించని ప్రెగ్నెన్సీ కావచ్చు లేదా బిడ్డ చనిపోవటం లేదా తల్లి తండ్రులు ఆమోదించకపోవటం వంటివి కావచ్చు. కనుక మీది నిజమైన సంబంధమే అనుకుంటే ఇటువంటివి కూడా ఎదుర్కొని నిలబడాలి.
5. మీ భాగస్వామిని వదిలేయాలనుకుంటున్నారా? ఒక సంబంధం అనేది మీ మధ్య పోట్లాటలు, తగవులు వుంటేనే వాస్తవం అనిపిస్తుంది. మా మధ్య తగాదాలు లేవు అనే జంటలు అబద్ధమన్నా ఆడుతూండాలి లేదా వారి మధ్య నిజమైన ప్రేమ అయినా లేకపోవచ్చు. మీరిద్దరూ మేము విడిపోతున్నామని మాటమాత్రంగా పైకి చెప్పుకుంటున్నారా? అయితే, మీ మధ్య నిజంగా ప్రేమ వున్నట్లే.
ఏదీ నిజంకాని ప్రస్తుత వాస్తవిక ప్రపంచంలో మీకు ఒక వాస్తవ సంబంధం అంటూ వుంది. కనుక మీకై మీరు మీ భాగస్వామి మరి దానిని పరీక్షించుకోండి.



Click it and Unblock the Notifications