Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
ముచ్చటగొలిపే తండ్రి - కుమార్తెల అనురాగాలు!

1. మొదటి నిబంధన....తండ్రి తన కుమార్తెకు ఒక స్నేహితుడుగా వుండాలి. మీ ఆలోచనలు ఆమెతో పంచుకోవాలి. ఆమె ఉద్దేశ్యం తెలుపమని అడగాలి.
2. మీ కుమార్తెను మీతో సమానంగా భావించండి - ఆమెకు ఏమీ తెలియదు...అన్న ధోరణి పొందకండి. ఈ రోజులలో పిల్లలు చాలా తెలివైనవారు. వారు చేసేదేమిటో వారు బాగా గ్రహించగలరు.
3. మధ్యవర్తి అవండి - మీ కుమార్తె మీ భార్యతో సమస్యలలో వుందా? ఈ ఇద్దరి ఆడవారి మధ్య మీరు మధ్యవర్తిగా వుండండి. ఒక మగవాడు తప్పక ఇద్దరి మహిళల మధ్య సమస్య తీర్చగలడు.
4. సంభాషించండి - ప్రతిరోజూ ఆమెతో స్టడీస్ వంటివి చర్చించండి. అవసరమనుకుంటే సహాయపడండి. అపుడపుడూ షాపింగ్ వంటివి కలిసి చేయండి.
5. ఆమెను నమ్మండి- పిల్ల టీన్స్ లోకి వచ్చిందంటే తండ్రులు అధిక రక్షణ చూపాలనుకుంటారు. దీనితో తండ్రి ఆమెకు దూరం అయ్యే సమస్య వస్తుంది. కనుక ఆమె ఎక్కడుంది? వంటి విషయాలలో అధికంగా అనుమానపడకండి.
6. స్వతంత్రులుగా వ్యవహరించనీయండి - ఎదిగిని కుమార్తె ఇంకా బేబీ కాదని గ్రహించండి. ఆమె తప్పులనుండి ఆమెను నేర్చుకోనీయండి. ఆ తప్పులపై మీరు ఆమెతో చేసే చర్చలు మీకు ఆమెపట్ల గల ఆసక్తిని చూపుతాయి. బోధనలు చేయకండి.
7. షరతులులేని ప్రేమనివ్వండి - ఆమె మీ స్వంత కుమార్తె. ఆమె తప్పులు చేసినా లేక సరైన కుమార్తె కాకపోయినా సరే ఏ కండిషన్ లేకుండా ఆమెను మీరు ప్రేమించాలి. మీరు చూపే ప్రేమ ఆమె తన భవిష్యత్ జీవితంలో సరైన ఎంపికలు చేసుకునేలా గ్రహించాలి.
8. ఆమె స్నేహితులను ఆమోదించండి - టీన్స్ వచ్చిందంటే ఆమెకు ఒక సోషల్ సర్కిల్ ఏర్పడుతుంది. మరి ఆమె కలసి తిరిగే స్నేహితులు మీకు కొంత ఆశ్చర్యం కలిగిస్తారు. అయినప్పటికి సహనం వహించి, మంచి, చెడు వివరించి అవగాహన కలిగేలా చేయండి.
9. సహనం వహించండి - టీనేజ్ హార్మోన్లు ఇష్టం వచ్చేలా ప్రవర్తింపజేస్తాయి. కోపాలు, తాపాలు ఎన్నో కలిగిస్తాయి. మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఆమే తన స్వరధ్వని అధికంగా వినిపిస్తుంది. మీరు రియాక్ట్ కావటంలేదని గ్రహిస్తే తను కూడా మీ ముందు మౌనం వహిస్తుంది.
10. కలసి సమయం గడపండి - ఆమెతో గడిపే సమయం మీ బంధాన్ని పెంచుతుంది. ఆమెకిష్టమైన రీతిలో సమయం గడిపి వ్యత్యాసం గమనించండి. చివరకు మీరు కోరిన విధంగానే వారు మిమ్మల్ని ప్రేమిస్తారు.



Click it and Unblock the Notifications