Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే
విడాకులు వద్దు - మాటలు ముద్దు!

1. అతడే లేదా ఆమె ముందు మాట్లాడాలి లేదా పిలవాలి అనే తీరు మార్చుకోండి. ఈ రకమైన పట్టుదల కారణంగా మీరు పొందేది తక్కువ. నష్టపోయేది ఎక్కువ. మాట్లాడండి, వెలిబుచ్చండి. పంచుకోండి. సంబంధం పటిష్టమవాలంటే ఇదే సూత్రం. ఒక్కసారి ఫోన్ చేయండి. ఆనందం ఫోన్ కాల్ దూరంలో వుందని గ్రహించండి.
2. ఒకరితో మరి ఒకరు పోటీ పడకండి. నేడు స్నేహితులుగా వుండాలన్న పేరుతో జంటలు పోటీ పడుతున్నారు. ఇది వారి మధ్య స్పర్ధలకు దారి తీస్తోంది. ఒకరినొకరు సవాలు విసురుకుంటూంటే, సమస్యలని గ్రహించండి. పెరుగుతున్న విడాకులకు పోటీ మనస్తత్వం అనేది గ్రహించండి.
3. సమానంగా కూడా వుండవద్దు. పురుషుడు, మహిళ అన్ని అంశాలలోను సమానం కాదని గ్రహించండి. మీ పరిధులు మీరు తెలిసికొని ప్రవర్తిస్తే సమస్యలుండవని భావించండి.
4. తల్లితండ్రులను నిందించకండి. మీ వివాహ జీవితంలో మీరు ఏర్పరచుకున్న సమస్యలకు తల్లితండ్రులను నిందించకండి. వారిని బలిపశువులు చేయకండి. మీ దిక్కుమాలిన పోట్లాటలకు గౌరవనీయులైన మీ మీ తల్లితండ్రులను దూరంగా వుంచి మీ పెంపక విలువలను కాపాడుకోండి. వారంటే కనీసం ఆమాత్రం గౌరవం మీకుండాలని గుర్తించండి.
5. మీ స్నేహితులు చెప్పే అంశాలపై వ్యధ చెందకండి. మీరిరువురూ సన్నిహితంగా వుండాలి, సంభాషించుకోవాలి. కానీ, మీ స్నేహితుల సలహాలు కావాలంటూ వారి వెంటపడి పాకులాడకండి. ఫలితాలకు ఎదురు చూడకండి.
6. అనవసరంగా అధికమైన సందేహాలు ఒకరిపై ఒకరు పడకండి. అతను కోరినట్లు పూర్తిగా మీరుండలేరు. మీరు కోరినట్లు పూర్తిగా అతనుండలేడు. కనుక అధికంగా ఆశించకండి. ఇది గుర్తిస్తే, జంటల వివాదాలు చాలా పరిష్కారమవుతాయి.
7. క్షణికావేశాలలో ప్రవర్తించకండి. ఛండాలంగా తిట్టేసుకోవడం, దుర్మార్గంగా కొట్టుకోవడం చేసి అంతా అయిపోయిందని భావిస్తారు. వివాహ జీవితంలో కనీసం ఒక వంద పెద్ద పోట్లాటలైనా వుండాలి. కనుక, మరోసారి కలిసి కాఫీ తాగేయండి. విడిపోవాలనే త్వరిత నిర్ణయాలు తీసుకోకండి.
సంబంధాల నిర్వహణలో ఈ చిట్కాలు పాటిస్తే విడాకులు ఇవ్వాలనే మీ అభిప్రాయాలు మారి ఎన్నో జంటలు మరోమారు కలసి కాపురాలు చేస్తాయి.



Click it and Unblock the Notifications
