Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
నా మొగుడ్ని ముద్దాడలేను...కంపు కొడతాడు!

డైవోర్సు కేసుల్లో వింత కారణాలు-
1. నా మొగుడు గుర్రు పెడతాడు - గతంలో భాగస్వామి ఎంత గుర్రు పెట్టినప్పటికి సర్దుకుపోయేవారు. కాని ఇపుడు దానిని సహించేవారు లేరు. ఉదయం 8 గంటల మీటింగ్ వుంటే రాత్రంతా భాగస్వామి గుర్రు కారణంగా నిద్రలేకుంటే....మీటింగ్ ముగించుకోవటం, తక్షం భాగస్వామికి విడాకులు ఇచ్చేస్తానంటూ లాయర్ ఆఫీస్ కు పరుగుపెట్టటం.
2. చెడు శ్వాస - జంటలకు ఇదో పెద్ద సమస్య. దీని కొరకు విడాకులా? ప్రాధాన్యతలు మారాయి. అదే రకంగా సహనం హద్దులు కూడాను. నా మొగుడ్ని ముద్దాడలేను...కంపు కొడతాడు! విడాకులు కోరే భాగస్వాములకు ఇదొక పెద్ద కారణం.
3. సతాయింపు - సుమారు పదేళ్ళ కిందట, ఒక విడాకుల కేసులో 12 సంవత్సరాల వైవాహిక జీవితానికి ...భార్య సతాయించేస్తోందంటూ గల కారణంచే విడాకులు ఇవ్వబడ్డాయి. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఈ కారణంగా ఎన్నో కేసులకు విడాకులు లభించాయి.
4. సిగ్గుపడే అమ్మడు - కొత్త పెళ్ళికూతురు సిగ్గుపడితే అందమే. అయితే, ఒకపురుషుడు...ఆమెకు సిగ్గు ఎక్కువ...మనిషిని చూస్తే మెలికలు తిరుగుతుంది. నోరు తెరిచి ఏనాడూ నవ్వలేదు. నేను సహించలేను అంటూ విడాకులు పొందాడు. మరి ఆమే కనుక గట్టిగా నవ్వేస్తే ఆ మహానుభావుడు ఏం చేసేవాడో మరి.
5. అత్తగారంటే అరికాల్లో మంట - అత్తగారంటే పడని అమ్మడు మొగుడుకి విడాకులిచ్చేసింది. తన వివాహ సమస్యలకు ఆమే కారణం అని చెపుతోంది. ఈ సమస్య ప్రాచీన కాలంనుండి వున్నప్పటికి నేడు అది జంటలు విడిపోవటానికి ప్రధాన కారణం కూడా అవుతోంది. పెళ్ళి కొడుకు, హనీమూన్ కు మా అమ్మ కూడా రావాల్సిందే...అంటే చాలు, అమ్మడు ఇచ్చేది విడాకుల కాగితాలే.
ఈ రకంగా విడాకులిచ్చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. తమకు వచ్చిన సమస్యలను సైతం పరిష్కరించుకునే స్ధితిలో జంటలు లేరు. విడాకులకు గల ఈ వింతకారణాలు దాన్ని రుజువు చేస్తున్నాయి.



Click it and Unblock the Notifications
