Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మాజీ గాల్ ఫ్రెండ్ పై మరోసారి మనసు పడితే?

మీరు కనుక మీ గాల్ ఫ్రెండ్ పై ఇంకా మనసు పడుతూనే వుంటే....ఆమె మరోమారు మీ జీవితంలోకి రావాలని అనుకుంటే, మరొకసారి నిజాయతీగా రాజీ ప్రయత్నం చేయండి. ఇది చెప్పటానికి తేలికైనప్పటికి ఆచరణలో కష్టమైనది, బహు క్లిష్టమైనదిగానే వుంటుంది. లేకపోతే, ఆమె శాశ్వతంగా దూరమైపోతుంది. కనుక మీ హృదయం చెప్పినట్లు విని ఆమెను కలవండి.
1. ఫోన్ చేయండి లేదా ఇ మెయిల్ పంపండి.
మీరు విడిపోయిన తీరును బట్టి అంటే కోపతాపాలతో తెగతెంపులు చేసుకున్నారా? లేక పరస్పర అంగీకారంతో విడిపోయారా అనే దానిని బట్టి మీరు ఆమెకు ఫోన్ చేయాలా లేక ఇ మెయిల్ చేయాలా అనేది నిర్ణయించుకోండి. మీరు ఆమెను కోల్పోయినట్లు చెప్పండి. మీరు రాజీ ప్రయత్నాననికి సిద్ధంగా వున్నట్లు తెలుపండి. చాలా సింపుల్ గా తెలుపండి ఆమె జవాబు ఏదైనప్పటికి మీ ఇ మెయిల్ లేదా ఫోన్ కాల్ కు సమాధానం ఇవ్వాలని కోరండి.
2. రిమైండర్లు పంపండి
ఫోన్ లేదా ఇ మెయిల్ చేసిన తర్వాత మరోసారి గుర్తు చేయండి. అంటే విసిగించకండి. కాని క్లుప్తంగా ఏం చేద్దామని అడగండి. బహుశ ఆమెకు కూడా ఆసక్తి వుండవచ్చు కాని కఠినంగా వుండాలనిపించవచ్చు. ఏదేమైనప్పటికి రెగ్యులర్ గా ఆమెపై మీ ఆసక్తిని తెలియపరుస్తూ వుండండి.
3. ఆమెపై శ్రధ్ధ చూపండి
మీరు ఆమె అంటే ఇష్టపడుతున్నారనిఆమెకు తెలిసేలా ప్రవర్తించండి. ఆమెకిష్టమైన పూలు, చాక్లెట్లు, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ సందేశాలు పంపండి. మీ చర్యలు ఆమెను నిజంగా ప్రేమించేవిగా వుండాలి ఆమె మరోమారు మీ జీవితంలోకి వచ్చేలా వుండాలి కనుక జాగ్రత్తగా వ్యవహరించండి.
4. ఆమె ఏం కోల్పోతోందనేది ఎత్తి చూపండి
అంతా నష్టపోయినవారుగా ప్రవర్తించకండి. మీరు ఆనందంగా వుండి, ఆ ఆనందాన్ని ఆమె ఎలా కోల్పోతోందనేది వివరించండి. కనుక, అసలు ఆమె గతంలో మిమ్మల్ని ఎందుకు ప్రేమించింది? ఎందుకు దగ్గరైంది అనేవిషయాలను మరోసారి ఆమెకు గుర్తు చేయండి. ఆ కారణాలుగానే మీరు మరోసారి ఆమెతో రాజీ పడుతున్నట్లు వివరించండి.
ఈ రాజీ ప్రయత్నాలు ఏ మద్యవర్తి సహాయం లేకుండానే మీరే నేరుగా చేసుకోవచ్చు. అయితే, మీరు నూటికి నూరు శాతం మన: పూర్వకంగా చేయాల్సివుంటుంది. అయితే, మీ ఆత్మ గౌరవంపై ఏ మాత్రం రాజీపడకండి.



Click it and Unblock the Notifications