Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అనురాగ బంధం....చిరకాల సంబంధం!

రొటీన్ కు భిన్నంగా చేసే పనిని పురుషుడు ప్రశంసిస్తాడు. అందులోనూ అతనికి ఆనందం అందించే అంశం అంటే మరింత మిమ్మల్ని ఇష్టపడతాడు. నగ్నంగా నడిచొచ్చే భార్య అంటే, అయిదు సెకండ్లలో అక్కున చేర్చుకుంటాడు. పురుషులు తాము పాతకాలం పద్ధతులు పాటిస్తున్నప్పటికి ఆధునిక యువతులంటే ఇష్టపడతారు. అందులోనూ నగ్న శరీరంపై తన పేరు టాటూ రూపంలో కనపడితే అతని ఆనందానికి హద్దులుండవు.
మరి మహిళలకైతే....మహిళలకు వారి బర్త్ డేలు మరపురానివి. ఆమెకు ఎంత వయసు వచ్చినప్పటికి ఎన్ని సంవత్సరాలనుండి తన డార్లింగ్ తో గడుపుతున్నప్పటికి బర్త్ డే అనేది ఆమెకు ఒక ప్రత్యేకతే. ఆ రోజు ఒక మరచిపోలేని దినంగా వుండాలని కోరుకుంటుంది. అందులోనూ అర్ధరాత్రి లేపి ఆమెకు ఇష్టమైన బహుమానం ఇచ్చారా? అంతకంటే మరచిపోని రోజు ఆమెకుండదు. వివాహ బంధంలోని ఆనందానికి అడ్డంకులుగా ఊపిరి సలపని ఉద్యోగాలు, పిల్లలు, అత్తమామలు, ఆర్ధిక వ్యవహారాలు ...ఈ రకంగా ఎన్నో కారణాలు చెప్పవచ్చు.
మహిళ మదిలోని మాటను గ్రహించగలిగితే....అందుకు తగ్గట్లు ఆచరించగలిగితే....ఎప్పటికి మరువని బంధమే కాగలదు. రుచులనందించే డైనింగ్ టేబుల్ సైతం మరపురాని మంచంగా మార్చగలిగిన శక్తి ఆమెకుంటుంది. మహిళలు ముందుగా పురుషుడే తమకు ప్రతిపాదన ఇవ్వాలని భావిస్తూంటారని గ్రహించండి. అపుడపుడు మహిళలు, తమ ఊహల్లో సినిమా సంఘటనలు కూడా ఆశిస్తారు. మరి మీ మహిళకు ఇంతవరకు ఆమె ఊహించని విధంగా మీరేం చేశారు? మీరు చేసేది చిన్న అంశమే కావచ్చు. ఆమె దానిని ఎన్నో రెట్లు అధికంగా ఊహించుకుంటుంది.
మరి మీ పార్టనర్ తో మరింత అనురాగ బంధాన్ని ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలనేది ఒక మానసిక నిపుణుడి సలహాలు పరిశీలించండి.
1. ఒక్క పని...లేదా హాబీ జిమ్, జాగ్, డ్యాన్స్ వంటివి కలసి చేయండి.
2. యువతులు పూవులంటే ఇష్టపడతారు. సందర్భం లేకుండా బుట్టెడు మల్లెలు ఆమెకిచ్చేయండి.
3. కనీసం వారానికోసారి, ఆమె కిచెన్ ప్రవేశించకముందే, ఆశ్చర్యంగా ఆమెకిష్టమైన వంటకం చేసి రుచి చూపండి.
4. ఇరువురికి ఇష్టమైన టెలివిజన్ షో సందర్భానికి తగినట్లు కలసి ఆనందించండి. ప్రతిరోజూ కలసి చూడటం ప్రాధాన్యతగా గుర్తించండి.
5. ఎల్లపుడూ మీ మాటే సాగాలనే ధోరణి ఆమెపై రుద్దకండి. ఆమెకు కూడా కొన్ని విషయాలలో ఎంపికలు వుండేలా ఆచరించండి.
6. ఆఫీస్ కు వెళ్ళాలంటే, కలసి కారు ప్రయాణం చేయండి. ఇరువురూ కొంత ఒంటరి సమయం గడిపినట్లవుతుంది.
7. ఏ సంబంధంలో అయినా సరే శారీరక సన్నిహితం మరువలేనిదిగా వుంటుంది. ఆనందం తక్కువైన లైంగిక జీవితాన్ని తిరగ రాయండి.
8. ఆమెకు ఆసక్తికల అంశాలపై శ్రద్ధ చూపండి. మీ సమాచారంతో ఆమెను లేదా అతనిని ఆశ్చర్య పరచండి.
9. సరళంగా వుండి, ఆమె లేదా అతడు మీ భావాలను గ్రహించి ఆనందింపజేసేలా చూడండి.
10. మీ పార్టనర్ కు ఫోన్ చేయాలంటే ఏ కారణం అవసరంలేదు. ఆసమయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారనేది కూడా ఆబె చెవిలో వేయండి.
11. అతనికి ఇష్టమైన వంటకాలు చేయండి. అతని స్నేహితులను విందుకు ఆహ్వానించండి. మీరు అతని ప్రపంచంలో అడుగుపెడతానంటే అతను మరింత ఇష్టపడతాడు.



Click it and Unblock the Notifications