Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
టీనేజ్ పిల్లలతో అనకూడని అంశాలు!

మీ పిల్ల లేదా పిల్లవాడితో మీరు అనకూడని కొన్ని ప్రధాన విషయాలను వ్రాస్తూన్నాం. పరిశీలించండి.
1. నీ వయసులో వున్నపుడు నేను ఎంతో భాధ్యతగా వుండే వాడిని
మీ బిడ్డను మీ చిన్నతనంతో పోల్చుకోవడం పెద్ద తప్పు. చిన్న తనంలో మీరు చేసిన తప్పులు కూడా గుర్తుకు తెచ్చుకోండి. మీరు మీ తల్లితండ్రులను ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తుకు తెచ్చుకోండి. ఈ రకమైన మాటలు మీ బిడ్డల ఆత్మ విశ్వాసం సన్నగిల్ల చేస్తాయి.
2. నీవి ఎపుడూ తప్పు నిర్ణయాలే
అతనికి ఇంకా పరి పక్వత రాలేదు. ప్రతివారు తప్పులు చేస్తారు. నేర్చుకోవటంలో తప్పు చేయటం ఒక భాగం. మీకు ఇష్టం లేని పని చేసినంతలో అతనిని తప్పు పట్టరాదు. ఒక పేరెంట్ గా అతనికి మార్గదర్శకుడుగా వుండాలి. అతనిని బలవంతం చేయకండి.
3, మీ బ్రదర్ లేదా సిస్టర్ లా వుండలేవా?
ఈ పోలిక కూడా సరైనది కాదు. అది వారి మధ్య ద్వేషాన్ని రగులుస్తుంది. కనుక సోదరులతో పోల్చకండి.
4. నన్ను వంటిరిగా వుండనివ్వు
మీరు ఒక్కసారిగా అటువంటి మాటలు అతనికి చెప్పకండి. అది అతనిలో మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లు, అతనంటే మీకు ఇష్టం లేనట్లు భావింపజేస్తుంది. మనో వ్యధను కలిగిస్తుంది.
5. నీకు నీవు సిగ్గుపడాలి
ఇది చాలా కఠినమైన మాట. ఏ పిల్లాడితో ఈ మాట అన్నప్పటికి అది చెడుగా భావిస్తాడు. కనుక కొంత సరళమైన ధోరణిలో మంచి చెడు అతనికి తెలియజెప్పండి.
6. నీవు కూడా మీ అమ్మ లేదా నాన్న వలే....
ఇది మీ భాగస్వామి పట్ల మీకు గల అయిష్టతను పిల్లాడికి తెలియజేస్తుంది. అతనికి మీరంటే గౌరవం పోతుంది. కనుక ఈ మాటలు పలుకవద్దు.
7. ఎపుడూ నన్ను గాయపరచటమే నీపని
పిల్లలు చాలావరకు తమకు తెలియకుండానే పనులు చేస్తారు. మీరు ఇలా చెపితే అతను తన నిర్ణయానికి చాలా తప్పుగా భావిస్తాడు. అతను మీరు కోరినట్లే చేస్తాడు. కాని అతని సంతోషం దీర్ఘకాలంలో మీ మాటలతో మాయమవుతుంది.
8. నీలాంటి బిడ్డ వుండే కంటే అసలు లేకుంటే మేలు
బిడ్డ ఎంత తప్పు చేసినప్పటికి ఈ మాటలు పలుకరాదు. అది బిడ్డలో చాలా తీవ్ర సంచలనం కలిగిస్తుంది.
9. చెడు స్నేహాలు వదిలేయ్
స్నేహాలు మొదలు పెట్టేముందు మనం ఆలోచన చేయము. అలాగే పిల్లలు కూడాను అని గ్రహించండి. వారికి మనకి తేడా ఏమంటే మనం తెలుసుకొని చెడు స్నేహితులకు దూరంగా వుంటాము. కాని పిల్లలు అలా వుండలేరు. స్నేహితులే వారి ప్రపంచం. కనుక వారికి కొత్త స్నేహితులను పెట్టుకో అని ఆర్డర్ వేయలేము.



Click it and Unblock the Notifications