Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
పెళ్ళి పెటాకులు - పార్టనర్ పరారీలు!

1. ప్రేమ లేదనుకున్నపుడు - జంటల మధ్య ప్రేమ లేదు అని ఎక్కడా ఏ డైవోర్సులలో చెప్పరు. ఏవేవో కారణాలు చెపుతూంటారు. పని ఒత్తిడి, బోర్ కొట్టింది లేదా వాడు నపుంసకుడు, అది కాపరానికి పనికి రాదు వంటివి చెపుతారు. మరి నిజంగా ఆమె లేదా అతడు వెళ్ళిపోతుంటే, మీ మనసుకు ఏమీ అనిపించకపోతే.....వివాహం రద్దుచేయండి.
2. అభిప్రాయ భేధాలు అధికమైపోతే - ప్రతిరోజూ మాటల యుద్ధం. ఏ మాట చెప్పినా దానికి వ్యతిరేకం. అవగాహన దూరం అయిపోతుంది. ఈ రకమైన మాటలన్ని కలిపితే సంబంధ విచ్ఛిన్నం ఖాయం. ఇక అటువంటపుడు మరింత అభిప్రాయ బేధాలు రాకుండా డీసెంట్ గా....వివాహం రద్దు చేయండి.
3. నిర్లక్ష్యం చేయబడితే - ప్రేమకు వ్యతిరేకం ద్వేషం కాదు. ద్వేషం అంటేనే మోసగించబడిన ప్రేమ. ప్రేమకు వ్యతిరేకం అలక్ష్యం. లేదా నిర్లక్ష్యం. ఇక వాదనలు చేసే ఓపిక లేదు. భాగస్వామికి ప్రేమను రుజువుచేయాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యం చేయబడ్డారు. నిర్లక్ష్యం అనేది ప్రేమ శూన్యమవడమే....ఇక ఆసమయంలో...వివాహం రద్దు చేయండి.
4. మానసిక, భావోద్రేకతలు దెబ్బతిన్నాయా - వివాహ సమస్యలకు అనేక సైడ్ ఎఫెక్టులుంటాయి. అవి మీ ఉద్యోగాన్ని, మీ జీవన నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. ఆ సమస్యలు కనుక మీ మానసిక స్ధిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయనుకుంటే ....మీరు మొదటగా మీ మంచి చూసుకోవాలి. అటువంటపుడు...వివాహం రద్దు చేయండి.
5. పిల్లలు బలైపోతున్నారా? - కలసి జంతు ప్రవర్తనతో జీవించేకంటే, మానవత్వం వున్న మనుషులుగా విడిపోయి బతకటం మంచిది. మీరు క్రూరమైన పిల్లులే కావచ్చు. ఒకరినొకరు దండించుకోవచ్చు. కాని మీ పిల్లలు అందులో బాధితులు కారాదు. అందునా మీ తగవులలో పిల్లలు బలైపోతూంటే, మీరిరువురూ ఒక అంగీకారంకు వచ్చి పిల్లల భవిష్యత్తు కై విడిపోవటం మంచిదని నిర్ణయించుకుంటే...వివాహం రద్దు చేయండి.
మీరు కనుక విడాకులు పొందాలనుకున్నట్లయితే, ఈ సంబంధాల చిట్కాలు మీ వివాహ జీవితాన్ని రద్దు చేసుకోడానికి బాగా ఉపయోగించగలవు.



Click it and Unblock the Notifications