Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పురుషులకు మహిళలు అవసరమా?

పురుషులుమహిళలను ఎందుకు కోరతారు అనే దానికి కొన్ని అంశాలు చూడండి.
1. పురుషులు తాము ప్రేమించబడాలనుకుంటారు. మరి ఒకరు వారి అధీనంలో వుండాలని భావిస్తారు. అందుకుగాను ఏదో ఒక కారణంగా మహిళను కోరతారు. అది తన తల్లి కావచ్చు, సోదరి లేదా భార్య కూడా కావచ్చు. వారి అహంకారాలను సంతృప్తి పరచుకోడానికి మహిళను ఈ రకంగా కోరతారు. వారు ఎంత సేపూ ఒకరు తమపై ఆధారపడాలనుకుంటారు. ఈ రకమైన కోర్కె తీర్చుకోవాలంటే మహిళ వారికవసరం.
2. చాలా సార్లు పురుషుడు భాధ్యతా రహితంగా ప్రవర్తిస్తాడు. అటువంటపుడు తనను చక్కదిద్దటానికి ఒక తల్లి కావాలనుకుంటాడు. అంటే తన ఉద్యోగంలో లేదా ఆర్ధికంగా తనను ఆదుకోవాలని అతను భావించడు. అయితే, వ్యక్తిగత విషయం వచ్చే సరికి నిస్సహాయతతో ఒక పసిపిల్లవాడిలా అయిపోతాడు. అపుడు అతను తన భార్య వంటి వారిపై ఆ ఆవేదన అంతా వెళ్ళగక్కుతాడు. పురుషుడుకు ఏం కావాలంటే, తన వ్యక్తిగత సమస్యలు మహిళ తనతో కలసి పంచుకోవడం కావాలి.
3. చేసిన తప్పులను ఒప్పులుగా చేసుకోడానికి లేదా సరిదిద్దటానికి కూడా పురుషుడు మహిళను ఉపయోగిస్తాడు. ఇంటిలో పనులు చక్కదిద్దటానికి, లేదా తనకు అనుకూలంగా ఇంటిని మలుచుకోటానికి పురుషుడు మహిళను కోరతాడు.
4. పిల్లల కొరకు కూడా పురుషుడు మహిళను కోరతాడు. మహిళలు పురుషులు లేకుండా పిల్లలను కనే టెక్నాలజీ వచ్చేసింది. కాని మహిళ లేకుండా పురుషుడు తన బిడ్డకు జన్మనివ్వలేడు. కనుక తన జీన్స్ ముందుకు తీసుకు వెళ్ళాలంటే, అతనికి మహిళ అవసరం.
5. పురుషులకు ఒంటిరితనం అంటే భయం. మహిళలు తరచుగా తమ ఆర్ధిక భధ్రత కొరకు పురుషుడిపై ఆధారపడతారు. కాని పురుషుడికి వివాహమనేది ఒక సాంగత్యం కొరకు. ఒక చెలిమి కొరకు. ఏం జరిగినప్పటికి భార్య అనే మహిల తనను అంటిపెట్టుకుంటుందని అతనికి ధైర్యంగా వుంటుంది. తన భావాలను జీవితంలో ఆచరించటానికి, గౌరవించటానికి ఆమెను అతను కోరతాడు. చిన్నతనంలో పురుషులు, భార్యలను వదలిపెట్టి వెళ్ళినప్పటికి వయసు పైబడ వచ్చే సరికి వారు మరల భార్య కొరకు తిరిగి వస్తారు.
పురుషులు జీవితంలో కోరుకునే అంశాలు విభిన్నంగా వుంటాయి. ప్రతి ఒక్కరికి ప్రత్యేక అవసరాలుంటాయి. కాని మహిళ యొక్క అవసరం వచ్చే సరికి పురుషులందరిది ఒకే బాటగా వుంటుంది.



Click it and Unblock the Notifications
