Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జంటల ఆరాటం....జీవన పోరాటం!

బ్రిటన్ దేశంలో అయితే, జంటలు రాత్రివేళ కనీసం వారానికి రెండు సార్లు అయినా తగవులాడుకుంటారట. నిద్రించేటపుడు, ఏ రకమైన శబ్దం అయినా సరే జంటలో ఒకరు లేవటం, శబ్దం చేసినవారిని నిందించి వారితో తగవు పెట్టుకోవడం చేస్తారని అధ్యయనం చేసిన ప్రీమియర్ ఇన్ అనే ఒక సంస్ధ వెల్లడించింది. ప్రీమియర్ ఇన్ బ్రిటన్ లో ఖ్యాతిగాంచిన హోట్ ఛైన్ గా గుర్తించారు.
గురకలు, లైట్ స్విచ్ వేసే శబ్దాలు, కుర్చీలు జరపటం, ఇతర శబ్దాల కారణంగా 20 శాతంపైగా జంటలు ప్రతిరాత్రి కనీసం రెండు గంటల నిద్రను కోల్పోతున్నారట. వీరిలో 10 శాతం మంది తమ భాగస్వామితో విడాకులు కూడా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా కూడా అధ్యయనంలో తేలినట్లు డైలీ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రచురించింది. పురుషులు ఉదయం వేళ లేచిన వెంటనే రాత్రి సరైన నిద్ర లేని కారణంగా కోపతాపాలతో లేచి వెళ్ళి కార్యాలకు హాజరై సమస్యలు తెచ్చుకుంటున్నారు.
మరి ఈ జంటల పోట్లాటలకు ఇతర కారణాలు పరిశీలిస్తే...రాత్రివేళ అధిక వేడి లేదా అధిక చల్లదనం వుండంటం, జంటల మధ్య అనురాగం లేకపోవటం, ఏవేవో చిన్నపాటి కారణాలుగా కూడా తగవులు పెంచుకోవడం చేస్తున్నారట. ప్రత్యేకించి ఇవి వారు బెడ్ రూమ్ లో వున్నపుడే జరుగుతుండటంతో ఇతర కారణాలవలన జంటల మధ్య అనుబంధం లోపిస్తోందా? లేక అనుబంధం లోపించి కారణాలు వీరు వెతుక్కుంటున్నారా అనే అంశంపై కూడా పరిశోధకులు తలలు పట్టుకుంటున్నట్లు వెల్లడైంది.
ఈ రకమైన చిన్నపాటి కారణాలకు పరిష్కారాలు వుంటాయని, తేలికగానే పరిష్కరించుకోవచ్చని మంచి సంబంధాలు నిర్వహించుకోవచ్చని కూడా అధ్యయన సంస్ధకు నేతృత్వం వహించిన క్లెయిరీ హేగ్ తెలిపినట్లు పత్రిక ప్రచురించింది.



Click it and Unblock the Notifications