Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆఫీస్ పని సమర్ధతా...? అంగాంగ ప్రదర్శనా....?

మరి ఉదాహరణగా నేటి కార్పోరేట్ కంపెనీలలో మహిళలైనా పురుషులైనా, అందంగా వుండి, మంచి దుస్తులు ధరించి, శారీరక సౌష్టవంతో వుంటే చాలు, వారు అనేక రకాలుగా వారి వర్క్ లైఫ్ లో ప్రయోజనాలు పొందుతున్నారు. దానికి తగ్గట్లు వారిలో ఆత్మ విశ్వాసం,సంభాషణా చాతుర్యం వంటివి వుంటే వారు మరింత ముందుకు పోతారనటంలోను, వారి జీతాలు తప్పక పెరుగుతాయనటంలోను సందేహం లేదు. అయితే,అందం, సామాన్య రూపం, అంద వికారం అనేవి ఏవోకొద్దిపాటి ఫ్యాషన్, గ్లామర్, లేదా హాస్పిటాలిటీ పరిశ్రమ అంటే, హోటల్స్ వంటివాటిలో ప్రధానంగా చూడబడుతాయని సాధారణంగా పనితనమే వెల్లడి అవుతుందని, ఫలితాలు పనిచేసేవారికే ప్రధానంగా వుంటాయేవారుకూడా లేకపోలేదు.
అయినప్పటికి, తెలివిగా, స్మార్ట్ గా దుస్తులు ధరించి వచ్చేవారు, సాదా సీదాగా వుండే వారిసహచరులకంటేకూడా ఒక మెట్టు పైనే వుండి తమ పదవులు లేదా ఇతర ప్రయోజనాలు సాధించుకంటారనేది వాస్తవం అయినప్పటికి, కీ రిసల్స్ ఏరియాలలో అంటే పని సామర్ధ్యం రికార్డ్ అయ్యేది బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమేనని పని సామర్ధ్యానికి పెద్దపీట వేయబడుతుందని కూడా చెపుతారు. అందంగా వుండి, తక్కువ జీతాలు పొందేవారినికూడా చూస్తూనే వుంటాం. అయితే, అన్నిటికి మించి వారు పని చేసే బాస్ ల మానసిక స్ధితి బట్టి కూడా ప్రయోజనాలు కలుగుతాయనేది మరో వాస్తవంగా సర్వే గుర్తించింది.
సశాస్త్రీయంగా రూపొందించిన ఎప్రైజల్స్ వంటి వాటిలో అందచందాలకు తావుండదు. అవి పూర్తిగా పనిసామర్ధ్యం పైనే ఆధారపడి వుంటాయి. అయితే, తాము తమ తమ సామర్ధ్యాలను ప్రదర్శించుకోవడంలో వున్న నైపుణ్యంపై కూడా ఆధారపడి వుంటాయి. కనుక ఈ అంశాలన్ని కలిపి ఒక వ్యక్తిని తన కెరీర్ లో ఉన్నత పదవులకు, అధిక జీతాలకు కృషి చేసేలాచేస్తాయి. అయితే, పరిశ్రమలు ఏదైనప్పటికి అందానికి, రూపలావణ్యాలకు వాటి ప్రదర్శనాతీరుకు, అందాలు లేని వ్యక్తుల పనిసామర్ధ్య ప్రదర్శనలకు మధ్య వత్యాసం సహజంగా ఎప్పటికి వుంటూనే వుంటుందని చెప్పాలి.



Click it and Unblock the Notifications