Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బాస్ సంతోషమే....మన సంతోషం!

బాస్ తో సంబంధాలు బాగుంటే ప్రమోషన్లు రావటం తేలిక. అయితే, వారి పని విధానాలు గ్రహించగలగాలి. అందుకుగాను సమయం, సహనం అవసరం. కొద్దిపాటి అధిక శ్ర పెట్టటం ఏమంత కష్టం కాకపోవచ్చు. అతనికి ఖరీదైన బహుమానాలు, లేదా ప్రశంసలు చాలామందికి ప్రయోజనం చేకూరుస్తాయి. కొంతమందికి కంపెనీలు మారటం, కొత్త బాసుల కింద పనిచేయటం కొట్టిన పిండి. అయితే, బాస్ తో బంధం సరిలేకుంటే, ఎప్పటికైనా బయటపడాల్సిందే.
అయితే, మీరు మెప్పించటానికి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికి మీ బాస్ కనుక సంతోషంగా లేకుంటే మీ ప్రయత్నాలన్ని బెడిసి కొట్టే ప్రమాదం వుంది. కనుక చేసే ప్రతి పని ఆలోచించి చేయాల్సి వస్తుంది. మీరు మీ బాస్ కనుక సరైన సంబంధం కలిగి వుండకపోతే, ఫలితాలు కష్టంగా వుంటాయి. అవి మీ నైతికతలను, విశ్వాసాన్ని ప్రశ్నిస్తూనేవుంటాయి. బాస్ మీ వెంటపడి నలుగురిలోను అవమానం చేసే పరిస్ధితి కూడా ఎదురవుతుంది. చివరకు బాస్ తో సంబంధాలు లేక సంస్ధలనుండి బయటపడినవారు కూడా లేకపోలేదు.
వర్క్ లైఫ్ లో బ్యాలన్స్ కలిగి వుండటం ఎంతో ప్రధానం. బాస్ కు మీకూ మధ్య గల భేధాభిప్రాయాలు అనేక సమస్యలకు దోవతీస్తాయి. బాస్ అనేవాడు కింది ఉద్యోగులకు ఆదర్శంగా వుండాలి. చాలామందికి వారి బాస్ లే వారికి మోడల్స్. బాస్ తో మంచి సంబంధం కలిగి వుండటం ఆఫీస్ లో అతనికి లేదా ఆమెకు మంచి వర్క్ లైఫ్ ప్రసాదిస్తుంది.



Click it and Unblock the Notifications