Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సహచర ఉద్యోగి సహకరించటంలేదా?

కబుర్లు కట్టిపెట్టండి - సాధారణంగా కార్యాలయాలలో ఉబుసుపోక కబుర్లు సహచరులతో సాగిస్తూంటారు. ఏ రోజుకారోజు ఈ పనికిరాని మాటలు లేదాకబుర్లు కొత్త కొత్తవి వస్తూనే వుంటాయి. ఈ రకంగా మాట్లాడే వారు మీ పని షేర్ చేసుకోరన్న విషయం గ్రహించండి. కనుక చాకచక్యంగా మీరు మీ పనిలో నిమగ్నమై దానిని సమయానికి పూర్తి చేసుకునేలా కృషి చేయండి.
వెబ్ సైట్లు తెరువకండి - ఆఫీస్ పని సమయంలో అవసరంలేని వెబ్ సైట్లు తెరవటం, ఇమెయిళ్ళు చెక్ చేయటం, ఇతర అంశాలు కంప్యూటర్ లో పరిశీలించడం, ఛాటింగ్ వగైరా వంటివి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయని గ్రహించండి.
పని సమయానికి చేరండి - స్వీట్ హార్ట్ ఇంటిలో లేదు. మీరే వంటలో చేయి కాల్చుకోవాలి. లేదా లేట్ నైట్ పార్టీలో డ్రింక్ అధికమై ఉదయమే హేంగోవర్. ఇటువంటి కారణాలు మీ ఆఫీస్ పనికిసహకరించవని తెలుసుకోండి. ఆలస్యంగా మొదలు పెడితే, రోజు పని ఉత్పాదకత దెబ్బతింటుంది. అంతేకాదు, మీరు కనుక సరైన సమయానికి ఆఫీస్ కు వస్తే, తప్పకుండా మీ కంపెనీ యాజమాన్యం సైతం మిమ్మల్ని ప్రశంసిస్తుంది.
పని ప్రాధాన్యత - ప్రధానమైన పనులు, కష్టమైన పనులు...రోజులో చివరి వరకు వుంచకండి. రోజు సమయం గడిచే కొద్ది మీ ఉత్పాదకత తగ్గుతుంది. కష్టమైనవి, ఛాలెంజ్ అనుకున్న పనులు తాజాగా వుండే ఉదయపు సమయంలో చేసేయండి. తేలికగా వుంటుంది.
ఫోన్ అడ్డగస్తోందా? - పని తక్కువగా వున్న రోజుల్లో మీ స్నేహితుడితో ఫోన్ ఎంత సమయం అయినా మాట్లాడవచ్చు. కాని, పని నడవటం లేదనుకున్నపుడు, ఫోన్ వంటివి మరీ అర్జంట్ అనుకుంటే క్లుప్తంగా మాట్లాడండి. లేదా పూర్తిగా పక్కన పెట్టి మెసేజ్ వంటివి మాత్రమే అందుకోండి.
చిరుతిండ్ల సమయం -సాధారణంగా పని మధ్యలో బ్రేక్ కావాలంటూ సహచరులు చెపుతారు. ఇక ఆ సమయంలో ఏదో ఒకటి తినడం కూడా మొదలుపెడతారు. ఆ సమయం మీ లంచ్ బ్రేక్ ను కూడా మించిపోతుంది. దానికితోడుగా తాగే నీరు, కాఫీ అంటూ లేచి ఆ ప్రదేశాలకు కూడా తరచుగా వెడుతూంటే మరింత సమయం వృధా అయిపోతుంది. కనుక ఈ సమయం అతితక్కువగాను లేదా అసలు లేకుండాను కూడా ఏర్పాట్లు చేసుకోండి. స్నాక్స్ సమయంలో ఇతర సహ ఉద్యోగులతో మాట్లాడే సమయం కూడా తగ్గించండి.
పై చిట్కాలు పాటిస్తే, మీ పని తేలికగాను, సమయంలోపల పూర్తి చేసి మీరు ఆనందంగా అందరివలే నిర్దేశిత సమయాలకు ఇంటి ముఖం పట్టే అవకాశం వుంటుంది.



Click it and Unblock the Notifications