Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ప్రేమ వివాహాల ప్రయోజనాలు !

ప్రేమ వివాహం ప్రయోజనాలు
మీరు ఒకరికొకరు తెలుసు - ఒకరంటే ఒకరికి ప్రేమ కనుక మీ పార్టనర్ సంగతి మీకు బాగా తెలుసు. పెళ్ళికి సిద్ధ పడేటపటికి, మీ ఇష్టాలు, అయిష్టాలు, ఆశింపులు, పార్టనర్ అవసరాలు అన్ని తెలుస్తాయి. కాని పెద్దల ఏర్పాటు వివాహంలో మీరు జీవితమంతా ఎటువంటి పార్టనర్ తో గడపబోతున్నారనేది మీకు తెలియదు.
ఎంపిక మీదే - ప్రేమ వివాహంలో, మీ కిష్టమైన వారిని ఎంపిక చేసుకుంటారు. పెద్దల ఒత్తిడి వుండదు. ప్రేమ వివాహంలో ఇదే పెద్ద లాభం. మీ కిష్టమైన రీతిలో మీరు మీ జీవిత భాగస్వామిని కోరుకోగలరు.
ముందుగానే అవగాహన - ప్రేమించుకునేటపుడు ఒక అవగాహనకు వస్తారు. ఈ అనుబంధం మీ పార్టనర్ అంటే ఏమిటో మీకు తెలుపుతుంది. వివాహం అయిన తర్వాత ఎంతవరకు సర్దుకుపోవాలనేది తెలుస్తుంది. పార్టనర్ ముందే తెలుసుకనుక మానసికంగా సిద్ధ పడతారు.
కుటుంబ బంధాలు - పెద్దల ఏర్పాటు వివాహంలో మీ భాగస్వామి పెళ్ళికి ముందు తెలియదు. ఈ సామాజిక కార్యక్రమం చేసే వరకు కుటుంబాల సభ్యులకు సైతం ఒకరి కొకరు ఏ మాత్రం తెలియదు. అయితే, ప్రేమ వివాహంలో ఒకరికొకరు ముందునుంచే తెలుస్తారు. ముందునుండే పరిచయాలు ఏర్పడి వారి సామాజిక హోదాలు, ఇష్టాలు, అయిష్టాల వంటివి తెలుస్తాయి. దానిని బట్టి ప్రేమ వివాహం నిర్ణయించుకోవచ్చు కూడాను.
ఇవి ప్రేమ వివాహ ప్రయోజనాలు. అయితే, దీని వలన కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు, ప్రేమ వివాహంలో ఆమె లేదా అతను అధికారాలు చెలాయించవచ్చు. అయితే, ఆనందకర వివాహజీవితం కొరకు కొద్దిపాటి రాజీలు, అవగాహనలు ఒకరి కొకరు చేసుకుంటూ విలువలనిచ్చుకోవాలి.



Click it and Unblock the Notifications