For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొడుకైనా... కూతురైనా...నాకు ఒక్కటే...!

ఈ కధ మా ఒన్ ఇండియా రీడర్లలో ఒకరు వ్రాసినది. మదర్స్ డే సందర్భంగా, ఆమె తన తల్లి ఒక ప్రత్యేకం అంటూ తనజీవితంలోని ఒక వాస్తవ కధను అందించింది. మరి ఈ ప్రత్యేక సందర్భంలోఆమె మాతో ఏమి షేర్ చేసుకుందో పరిశీలిద్దాం

By Super Admin
|

My Love For Mom! Mother's Day Special!
ఈ కధ మా ఒన్ ఇండియా రీడర్లలో ఒకరు వ్రాసినది. మదర్స్ డే సందర్భంగా, ఆమె తన తల్లి ఒక ప్రత్యేకం అంటూ తనజీవితంలోని ఒక వాస్తవ కధను అందించింది. మరి ఈ ప్రత్యేక సందర్భంలో ఆమె మాతో ఏమి షేర్ చేసుకుందో పరిశీలిద్దాం!

''అమ్మ’’
అక్షరాలు రెండే...ఆమెగురించి ఏం చెప్పాలన్నా తక్కువే! వ్రాయటం లేదా చెపటం వంటివి చాలవు. అమ్మ అన్నిటికంటేఉన్నతం. ఆమె ప్రతి ఒక్కరికి భగవంతుని బహుమతి. భగవంతుడు ఇచ్చిన ఒక ఖజానా వంటిది. అమ్మను ప్రతి వారూ వారి వారి ఎంపికలతో, మామా, మామ్, మమ్మీ, అమ్మి, అమ్మ లేదా మా అంటూ ప్రేమతో పిలుస్తారు. పిలుపు ఏదైనప్పటికి అందులోని మాధుర్యం ఎంతో విలువైనది. ఈ మదర్స్ డే రోజున నా జ్ఞాపకాలను కొన్నింటిని మీకు వివరిస్తాను. పిల్లలంగా వున్నపుడు ప్రతిరోజూ ఎక్కడెక్కడ తిరిగి ఇంటికి వచ్చినా కడుపునిండా తన చేతులతో తయారు చేసిన రుచికరమైన తిండ్లు మాకు పెట్టేది. బాల్యంలో మా పట్ల ఎంతో శ్రద్ధ వహించింది. మేము అంటే నేను మా సోదరుడు అంటే ఆమెకు ఎనలేని ప్రీతి. మమ్మల్ని పువ్వులలా పెంచింది. మేము పెద్దవారమయ్యేసరికి, ఆమె మాకు స్నే
హితురాలైంది. ఇపుడు మేమంతా ఒక్కటిగానే వుంటాము.

మా చివరి శ్వాస వరకు ఆమె మా శ్రేయోభిలాషి, మా స్నేహితురాలు. మేమిద్దరం ఆమెకు రెండు కళ్ళు. మా మామ్ ఎల్లపుడూ మాతోనే వుండాలి. ఏదైనా కారణం చేత మేము బాధపడితే, ఆమె బాధపడుతుంది. మేము నవ్వితే, ఆమె నవ్వుతుంది. తల్లితప్ప మరెవ్వరు ఇలా వుండగలరు? మాణిక్యం లాంటి మమ్మీ యే అలా వుండగలదు. మామ్ ...నీ గురించి ఎంత చెప్పినా తక్కువే!
నేను ఉద్యోగిని, కనుక ఆమె ఇల్లంతా ఒక్క చేత్తో నిర్వహించేస్తుంది. మానుండి ఏ ఫిర్యాదుకు అవకాశమివ్వదు. ఆమె వండే ఆహారం లేదా వంటకాలు, చెపితే మీరు నమ్మరు, ఎంతో రుచి. వాస్తవానికి చివరి మెతుకువరకు చేయి నాకాల్సిందే. ఆమె దేనికీ వద్దు అని చెప్పదు. ఏది కోరినా మరుసటి రోజే సిద్ధం. అదే మా మమ్మీ ప్రేమ.

నేటి రోజులలో కూడా చాలామంది యువతులకు స్వేచ్ఛ నివ్వరాదని, వారిని నియంత్రణలో వుంచాలని చెపుతారు. కాని మా మమ్మీ అలా ఎపుడూ భావించలేదు. తరాల అంతరం ఉన్నప్పటికి, ఆమె కొత్త తరం భావాలే ఆచరించింది. నేనడిగినవన్ని ఇచ్చింది. క్రీడలలో చేరాలనుకున్నాను. అందుకు ఒప్పుకుండి. ఇపుడు నేనొక మంచి క్రీడాకారిణి. ఉన్నత చదువులు చదవాలనుకున్నా. నాకు మంచి విద్యనిప్పించి ఇంత దాన్నిచేసింది. నేటి నా ఉన్నత స్ధితి ఆమె కారణంగానే. నేను ఎన్నో ప్రదేశాలు నా స్నేహితులతో, టీచర్లతో వెళ్ళటానికి అననుమతించింది. చాలామంది తల్లితండ్రులు ఈ విధంగా తమ కుమార్తెను ఇలా పంపి వుండరు. ఆమె నా ఆదర్శం. ఆమే నాకు ఒక హీరో. మామ్ నా ఈ ఉన్నత స్ధితికి కృతజ్ఞతలు. అవును నాకు ఎపుడూ వెన్నంటే వుంటావు. నీ విశ్వాసం నేను ఎన్నడూ వమ్ము చేయను.

నాకు విసుగనిపిస్తే, ఆమెపై కేకలు వేశాను. కాని ఆమె ప్రశాంతంగా నన్ను ప్రేమించింది. నాతో వ్యవహరించేందుకు ఎంత సహనం చూపింది అనేది నేను తర్వాత గ్రహించాను. తప్పు గ్రహించి క్షమించమన్నానను. ఈ మంచి గుణమే మా స్నేహితులను కూడా ఆమె అంటే ప్రేమించేలా చేసింది. ఆమె జోక్ లు వేస్తుంది. ఎవరైనా సరే ఆమెను కలవటానికి ఇష్టపడాల్సిందే. కొన్నిసార్లు, ఆమె నా సోదరునిపై పక్షపాతం చూపుతోందని, ఆమెను విసిగిస్తాను. అయితే ఈ విషయం నీకు మామ్, ఇపుడే చెపుతున్నాను. నీవు ఎవరి పక్షమూ కాదు. అందుకే నేను నిన్ను అన్నిటికంటే మిన్నగా ప్రేమిస్తున్నాను. మామ్, నేను వ్రాసే ఈ చిన్ని ప్రశంసలను నీకు అంకితమిస్తున్నాను. మరో జన్మనేది వుంటే, మరోమారు నీకు కుమార్తెగానే పుట్టాలని ఆశిస్తున్నాను అమ్మా....!

ఇది మా పాఠకులలో ఒకరు తమ తల్లికి అంకితం చేసిన ప్రశంసా పత్రం. మరి మీ అనుభవాలు కూడా తప్పనిసరిగా మాకు వ్రాయండి. మాతో పాలు పంచుకోండి.

English summary

My Love For Mom! Mother's Day Special! | అమ్మ అంటే ప్రేమకు ప్రతిరూపం!

She let me tour many places along with my friends and faculty, and I am damn sure that many parents would not let ‘A Girl’ travel so far for days. She is my inspiration, she is my HERO. “Mom thanks for being with me and I know that you are always there for me. I promise that I will never break your trust.”
Desktop Bottom Promotion