Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మత్తు కలిగించేది శరీర సహజ వాసన మాత్రమే!

ఒక వైపు సువాసన ద్రవ్యాల కంపెనీలు వివిధ రకాల సెంట్ల తయారీతో కోట్లాది రూపాయలు వ్యయం చేస్తుంటే, మరోవైపు రీసెర్చర్లు, అన్ని సువాసనలకంటే కూడా సహజమైన శరీర వాసన ఎవరినైనా ఆకర్షించాలంటే అత్యుత్తమమైన మత్తెక్కించే సువాసన అంటూ తమ పరిశోధనా ఫలితాలు వెల్లడించారు. మహిళలు, తమ అండం విడుదల అయ్యే సమయంలో అధికంగా ధైర్య సాహసాలుకల పురుషుడి శరీర వాసన అంటే బాగా ఆకర్షింపబడతారట. ఈ పరిశోధన ఇంగ్లాండ్ దేశంలోని స్టిర్లింగ్ యూనివర్శిటీ లోని క్రెయిగ్ రాబర్ట్స్ మరియు జెక్ రిపబ్లిక్ లోని ప్రాగ్ నగరంలోని ఛార్లెస్ యూనివర్శిటీ కి చెందిన జాన్ హావలిక్ లు కలిసి చేశారు.
పురుషులకు మహిళలు అండోత్సర్గ సమయంలో అధిక ఆకర్షణతోను, పిరీయడ్ సమయంలో తక్కువ ఆకర్షణతోను కూడా కనపడతారని రీసెర్చర్లు తెలిపినట్లు డెయిలీ మెయిల్ పేర్కొంది. వాసనలలో వచ్చే మార్పులు ఎప్పటికపుడు మారిపోతూ వుంటాయని హావ్ లిక్ తెలిపారు. అయితే, శరీర వాసన పైన ఆధారపడటం సరికాదని ప్రతివారిని ఆకర్షించే అవకాశం వుండదని వారు అభిప్రాయపడ్డారు.
పరిశోధనలో వీరు ముందుగా శరీర వాసనలు చూపటం తర్వాతి దశలో సువాసన సెంట్లు వాడి వాసనలు చూపటం చేశారు. కొన్ని రకాల వాసనలు కొంతమందికి ఎంతో బాగుండగా మరి కొందరికి అవి చాలా చెడుగా వున్నట్లు కనుగొన్నారు. కనుక శరీరాలు అందరికి అన్నీ సరిపడవని పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications