Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తళుకుల తారలు - వదలని బంధాలు!

సినీ ప్రపంచంలో గల సంబంధాలు తక్కువకాలంలోనే వేరు పడుతూంటాయి. కాని కొద్దిమంది నటులు మాత్రం తమ సంబంధాలను ఏళ్ళ తరబడి కొనసాగిస్తూ అందరికి ఆదర్శంగా కూడా వుంటున్నారు. ఈ రకమైన ఆనందకర సంబంధాలు సాగించే జంటలు ఎవరు? వారిలో ప్రధానంగా వున్న మొదటి పది జంటలు ఎవరనేది పరిశీలించండి.
అవంతిక - ఇమ్రాన్ ఖాన్ (10 సంవత్సరాలు) : ఈ జంట గత సంవత్సరమే వివాహం చేసుకున్నప్పటికి పది సంవత్సరాలుగా కలసి మెలసి వుంటున్నారు. చిన్నతనం నుండీ వీరు స్నేహితులే. వివాదాలకు దూరంగా వారి సంబంధాన్ని కాపాడుకుంటున్నారు. చిన్న జంట అయినా...అందరికి ఆదర్శం.
ట్వింకిల్ మరియు అక్షయ్ కుమార్ (11 సం.లు)
అక్షయ్ కు రవీనా టాండన్ నుండి శిల్పా శెట్టి వరకు అందరితోనూ సంబంధం రూమర్లు వచ్చాయి. కాని అతను చివరకు ట్వింకిల్ తో స్ధిరపడ్డాడు. ట్వింకిల్ తో వేరు పడతాడని ఎన్ని పుకార్లు వచ్చినా ఆమెకు వచ్చిన రెండోప్రెగ్నెన్సీ వారి సంబంధాన్ని మరోమారు స్ధిర పరిచింది.
సుజానే మరియు హృతిక్ రోషన్ (12 సం.లు)
వీరిది తొలి చూపు ప్రేమ. వీరి సంబంధం విడివడుతుందని ఎన్ని పుకార్లు వచ్చినప్పటికి కలిసే వుంటున్నారు.
కాజోల్ మరియు అజయ్ దేవ్ గన్
వ్యతిరేక స్వభావాలు ఎపుడూ ఆకర్షించుకుంటాయి. కాజోల్ అల్లరిపిల్ల, అజయ్ సీరియస్ అయినా సరే ఈ జంట తమ వివాహ జీవితాన్ని ఇద్దరు పిల్లలతో కూడా కొనసాగిస్తున్నారు.
మలైకా మరియు అర్బజ్ ఖాన్ ( 14 సం.లు)
మలైకా ఒక మోడల్. ఐటం డ్యాన్సర్. సల్మాన్ సోదరుడు అర్బజ్. వీరిద్దరూ ఆధునిక యువతీ యువకులకు ఆదర్శం గా వున్నారు. వీరికి ఒక కుమారుడు కూడాను.
గౌరి మరియు షారూఖ్ ఖాన్ ( 21 సం.లు)
షారూఖ్ ఖాన్ , గౌరితో సంబంధానికి ఎంతో శ్రమించాడు. ఆమె తల్లితండ్రులతో ఎంతో నమ్మించవలసి వచ్చింది. ఇది మతాంతర వివాహం. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇంతవరకు షారూఖ్ పేరు మరెవ్వరితోను ముడిపెట్టి పుకార్లు రాలేదు. అయితే ఇటీవలే ప్రియాంక చోప్రాతో కలసి సాగుతున్నాడని వార్తలు వచ్చినా షారూఖ్, గౌరిల వివాహ సంబంధం ఎంతో బలంగా సాగిపోతోంది.
నీతు మరియు రిషి కపూర్ ( 32 సంవత్సరాలు)
నీతు తన 22 వ ఏట రిషి కపూర్ ను వివాహమాడింది. ఇద్దరూ కూడా పేరొందిన నటులే. రిషి తాగుడు అధికం కారణంగా వివాహ జీవితంలో విభేధం ఏర్పడినప్పటికి మరోసారి అది బలపడింది.
జయ బాధురి మరియు అమితాబ్ బచ్చన్ (39 సంవత్సరాలు)
ఈ ఇద్దరు నటులు కూడా వారి ఉన్నత కెరీర్ లో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళితో అమితాబ్ కు బాగా కలసివచ్చిందని సూపర్ స్టార్ అయ్యాడని చెపుతారు. రేఖ తో అమితాబ్ ఎఫైర్ పుకార్లు వచ్చినప్పటికి జయ ఒక మంచి భార్యగా తన భర్తను నిలబెట్టుకొని కుటుంబానని, పిల్లలను సంరక్షించుకొంది.
సైరాబాను మరియు దిలీప్ కుమార్ ( 46 సం.లు)
సైరాబాను దిలీప్ కుమార్ కంటే 22 సంవత్సరాలు చిన్నది. అయినా వారి మధ్య ఎటువంటి భేధాభిప్రాయాలు లేవు. ఆ నాటికి ఈ నాటికి వారి మధ్య ప్రేమ ఒకే స్ధాయిలో మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతూనే వుంది.
ఎన్ని ఆటు పోట్లు వచ్చినా వీరు జంటలుగా నిలదొక్కుకొని తమ వైవాహిక జీవితాలను కొనసాగిస్తూ అందరికి ఆదర్శంగా వున్నారు. వీరి వివాహ జీవితాలు చిరకాలం కొనసాగాలని ఆశిద్దాం.



Click it and Unblock the Notifications