For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే రోజు మీ తల్లికి ఇవ్వరాని బహుమతులు!

By Super Admin
|
The 10 Worst Mother's Day Gifts Ever!
మదర్స్ డే రోజున మాతృమూర్తి చేసిన సేవలను ప్రశంసిస్తూ ఎన్నో బహుమానాలను ఆమెకు కృతజ్ఞతగా అందిస్తారు. అయితే, కొంతమంది అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, తమ ప్రేమను ఎలా తెలుపాలోకూడా తెలియక తమకు తెలిసో తెలియకో కొన్ని బహుమతులు అందిస్తారు. వాటిలో ఆమెకు కొన్ని ఇవ్వకూడనివి వుంటాయి. అవేమిటో పరిశీలించండి. మీరు ఇచ్చే బహుమతులు ఆమెకు చిరునవ్వులు చిందించేవిగా వుండాలే గాని ఆమెకు బాధ కలిగించేవిగా వుండరాదు.

వంటకు సంబంధించిన పరికరం - మీ తల్లి సంవత్సరాల తరబడి వంటగదిలో మీకు రక రకాల ఆహారాలు తయారు చేసిపెట్టింది. మరి మీరిచ్చే వంటగది పరికరం ఒకవైపు ఆమెకు ధ్యాంక్యూ చెపుతూనే మారోవైపు ఏదైనా వంట చేసి పెట్టమని అడిగినట్లవుతుంది.

బాత్ రూమ్ పరికరాలు - ఆమె పెద్దదైపోయి, బాత్ రూమ్ పనిలో ఎంత కష్టపడుతున్నప్పటికి ఆమెకు అందమైన టాయ్ లెట్ బ్రష్ లేదా అందమైన సోప్ డిష్ వంటివి ఇచ్చి కించపరచకండి.

లోదుస్తులు - మీ మమ్మీతో మీకు ప్రత్యక అనుబంధం వుంటే తప్ప, ఆమెకవసరమైనప్పటికి ఇవి బహుమానంగా ఇవ్వకండి.

బహుమతి సర్టిఫికేట్ - డియర్ మామ్, నేను నీకు బహుమతిగా ఏది ఇవ్వాలనేది కూడా ఆలోచించలేకపోతున్నాను. కనుక ఈ సర్టిఫికేట్ వుంచుకో అంటూ ఆమె సేవలకు ఏ రకమైన సర్టిఫికేట్ కూడా ఇవ్వకండి.

ఒక పెంపుడు జంతువు - అనేక సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మీ మాతృమూర్తి ఇక విశ్రాంతి కోరుకునే దశలో వుంది. అయినప్పటికి చివరిగా మీ సంరక్షణ చేస్తోంది. కనుక పెంపుడు జంతువును పెంచడమనే నిస్సహాయ పనిని ఆమెకు అప్పగించకండి.

ఫ్యాషన్ గా వుండే వాక్యూమ్ క్లీనర్ - మీ తల్లి ఇక జీవితం తేలికగా గడపాలి. అమ్మా దీనిని ఉపయోగించు అంటూ పెద్ద ధ్వని చేసే ఆధునిక వాక్యూమ్ క్లీనర్ ఆమెకు అందించకండి. ఆమె ఇప్పటికే తన జీవితంలో సగభాగం శుభ్రం చేయటంతోనే గడిపేసింది.

రెస్టరెంట్ లో లంచ్ ఇప్పించకండి. - ఆమె తన చేతివంటకు, ఇంటి ఆహారానికి పూర్తిగా అలవాటు పడిపోయి వుంటుంది. ఇపుడు కొత్తగా ఆమెను ఆధునిక రెస్టరెంట్లకు తీసుకు వెళ్ళి అక్కడి మెనూలతో ఆమెను విసిగించి తినిపించకండి.

జిమ్ సభ్యత్వం - మీ తల్లి ఇప్పటికే అనేక ఆరోగ్య కేంద్రాలవంటివి సందర్శించి వుంటుంది. కనుక ఇకపై ఆమెకు జిమ్ వంటి కఠిన వ్యాయామాలు లేని నడక లేదా లాఫింగ్ క్లబ్ ల వంటివి కావాలికాని, మీరు ఇప్పించే జిమ్ సభ్యత్వం కాదని గుర్తించండి.

English summary

The 10 Worst Mother's Day Gifts Ever! | బహుమతి ఇస్తే...చిరునవ్వులు చిందించాలి!

A gym membership: Your mother passes as many health clubs as you do every day. So if she hasn't signed up for anything yet, she's not looking for a reminder from you that she needs to get in shape. Stick with chocolates on her special day. You can tell her she's fat tomorrow.
Desktop Bottom Promotion