సారీ....ఎందుకు? క్షమించేస్తే పోలా....?

Why should say Sorry for Everything...!?
ప్రతి చిన్నపొరపాటుకీ ఎదుటి వారిని సారీతో సర్థేయమంటాం. సింపుల్ గా క్షమించేయండి అని అడిగేస్తుంటాం. క్షమించమని అడగడం తేలికే... కానీ ఎదుటి వారు మనల్ని క్షమించడం అంత తేలికైన విషయం కాదు. ఎదుటివారిని క్షమించడానికి చాలా పెద్ద మనస్సు కావాలని పెద్దలు అంటుంటారు. అది నూటికి నూరు పాళ్ళు నిజమే.. ఎంతో పెద్ద మనస్సుతో ఎదుటివారిని క్షమించేయడం వలన వోలెడన్ని లాభాలు దాగి ఉన్నాయి. అయితే చాలా సందర్బాల్లో ఎదుటి వారిని క్షమించేయడమన్నది చాలా కష్టమవుతుంటుంది. కొన్ని పద్దతుల ద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుటివారిని క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఎదుటి వారిని ఎలా క్షమించాలి?అన్న విషయంలో తెలుసుకోవాల్సిన కొన్ని చిట్కాలు.......

1. ఎదుటి వారిని క్షమించడం అన్నది ఒక్క రోజో లేదా రెండు మూడు రోజుల్లో అలవర్చుకొనే గుణం కాదని గుర్తించుకోవాలి. కాబట్టి క్షమించడమన్నది మీ కుంటుంబ సభ్యుల నుంచే మొదలు పెట్టాలి.
2. కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ శాంతంగా సహనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. రోజూ పది సార్లన్నా పేపర్ మీద ఎదుటి వారిని క్షమించాలి అని రాయడం మొదలు పెట్టాలి. ఇలా రాయండం వల్ల ఆ పదం మీ మనస్పులో బలంగా నాటుకుపోతుంది.
3. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలు పెట్టండి. అలా అర్థం చేసుకుంటే పెద్ద తప్పులు కూడా చిన్నచిన్న తప్పులుగా కనబడుతాయి.
4. క్షమించే గుణాన్ని ఒక్క రోజుకో లేదా కొన్ని రోజులకో పరిమితం చేసుకోకుండా నిరంతరం కొనసాగించడం అలవాటు చేసుకుంటే మంచిది.
5. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎదుటివారు మిమ్మల్ని ఎందుకు బాధించారో అర్థం చేసుకోగలిగితే వారిని క్షమించడం మరింత తేలిక అవుతుంది. తొందర అన్నది అస్సలు పనికిరాదు. నిదానమే ప్రధానం అన్న సూత్రం ఇక్కడ నూటికి నూరుపాళ్ళు వర్తిస్తుంది.
6. ఎప్పుడూ ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి శారీరక, మానసిక పరిస్థితి గురించి ఆలోచించాలి. అలా ఆలోచించగలిగితే వారు ఎంత పెద్ద తప్పు చేసినా తేలికగా క్షమించగలుగుతారు..
7. ఇతరుల తప్పులను మనం క్షమించగలిగితే మన తప్పులను భగవంతుడు కూడా క్షమించేస్తాడు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
8. లాభనష్టాలను అంచనా వేసుకొని ఎదుటివారిని క్షమించడం మంచిది కాదు. ఎదుటి వారిని క్షమించే ముందు ఇలాంటి ఆలోచనలు తలెత్తితే ప్రారంభంలోనే వాటిని తుంచేయాలి. అలాంటి ఆలోచనలు మనస్సునే కాదు సామాజికగ సంబంధాలను కూడా దెబ్బతీస్తాయి.
9. ఎదుటి వారిని క్షమించడం మొదలు పెట్టిన తర్వాత కోపం అదులో ఉంటుంది. దీని వలన రక్తపోటు అన్న సమస్య ఉండదు. దీని కారణంగా గుండె పనితీరు మెరుగుపడి, ఆరోగ్యంగా ఉంటుంది.
10. ఎదైనా తప్ప జరిగినప్పుడు ఎదుటి వారిని క్షమించేసి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతే అనవసరమైన ఆలోచనలు లేకుండా మనస్సు, మెదడు ప్రశాంతంగా ఉంటాయి. తద్వారా గాఢనిద్ర పడుతుంది. ఆరేడు గంటలు గాఢ నిద్ర వలన కలిగే లాభాల గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు...

Story first published: Monday, May 7, 2012, 16:25 [IST]
Desktop Bottom Promotion