Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
వివాహిత స్త్రీలు అంగీకరించని అయిదు విషయాలు?
వివాహం అయిందంటే, ఎన్నో రహాస్యాలు దాచుకోవలసిందే. వివాహిత స్త్రీలకు చాలా రహస్యాలుంటాయి. కొన్ని చాలా చిన్నగా వుండగా, మరికొన్ని విచారం కలిగించేవిగాను, ఇంకా మరికొన్ని, ఛండాలంగా చెప్పుకోదగినవిగాను కూడా వుంటాయి. మహిళకు, మహిళకు మధ్య ఇవి మారుతూంటాయి. అయితే, అందరికి ఉమ్మడిగా వుండే వాస్తవాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి వారు పెళ్ళి చేసుకున్నారంటే చాలు, ఇవి సహజంగా వచ్చేవే. వివాహ జీవితం, ఆమె భర్త మొదలైనవాటి గురించే కొన్ని వుంటాయి.

మహిళ వివాహం అయిన తర్వాత అంగీకరించని విషయాలేమిటి?
1. నలభై సంవత్సరాల వరకు నేను సింగల్ గా వుండకుండా, 28 సంవత్సరాలకే పెళ్ళి అవటం నాకు బాగుంది. పెళ్ళికాని వారితో పోల్చి చూసుకుంటూ చాలామంది మహిళలు ఎంతో తృప్తి పడతారు. వారి స్నేహితులు ఇంకా సింగల్ గా కష్టాలతోనే వుండి వారు కుటుంబంతో ఎంతో సంతోషంగా వున్నామని భావిస్తూంటారు.
2. నా భర్త ఆమె భర్తకంటే ఎంతో మెరుగు. తిట్టటం, లేదా కొట్టటం వంటి వాటిలో ఈ పోలిక తెచ్చుకుంటారు. భర్త ఎంత బాధించినప్పటికి తాము ఎంతో బెటర్ అని భావిస్తారు.
3. నా భర్తకంటే కూడా నాకు అధిక ఆర్ధిక స్వేచ్ఛవుంది అని భావిస్తారు. నేటి ఆధునిక ఉద్యోగాలలో వున్న స్త్రీలకు బహుశ ఇది సరి కావచ్చు. వారు తమ భర్తలకంటే కూడా అధికంగా సంపాదన చేస్తూ వుండి వుండవచ్చు. వారు బాగా ఆర్ధికపరంగా సంపాదనలు, ఖర్చులూ చేస్తూ వుండవచ్చు. కాని వీరికి కొన్ని రుణ బాధలు కూడా వుంటాయని ఒప్పుకోవాలి.
4. నేను సరైన జతగాడిని ఎంచుకొన్నాను. నిజమే కావచ్చు. ఈవిధంగా అనుకోవటంలో తప్పులేదు. కాని లో లోపలి లోతులలో ఎన్నో చెప్పుకోలేని అంశాలు మహిళల వివాహ జీవితంలో వుంటాయి. ఆర్ధికంగా బహుశ బాగా స్ధిరత్వంలో వున్న పురుషుడిని కూడా ఆమె వివాహం చేసుకొని వుండవచ్చు. డబ్బు లేని వారిని ఎవరూ పెళ్ళాడరు కనుక అది నిజం అయి కూడా వుండవచ్చు.
5. నా భర్త నాకంటే కూడా చిన్నవాడుగా కనపడతాడు. నేటి రోజులలో యువతీ యువకులు సాధారణంగా అతి తక్కువ వయసు వ్యత్యాసం లేదా అసలు వ్యత్యాసం లేకుండాను పెళ్ళి చేసుకుంటున్నారు. మహిళలు పురుషులకంటే కూడా వేగంగా వయసు సంతరించుకున్నట్లు కనిపిస్తారు. ఈ వ్యత్యాసం వివాహం అయిన 5 లేదా 6 సంవత్సరాలకుగాను తెలియదు. అంతేకాదు, పురుషులు తెల్లజుట్టుతో కూడా అందంగా ఉంటారనేది మహిళలు అంగీకరించరు.
మరి మహిళలకు అసలు కావలసినదేమిటి అనేది ఎపుడూ ఒక ప్రశ్న. ఆమె అట్టడుగు మదిలో ఏం ఉందనేది ఎవరూ కనుగొనలేరు. ఆమె బయట పెట్టదు. ఎందుకంటే, రహస్యంగా ఉండటం ఆడవారి సొత్తు. మరి వివాహం అయిన మహిళలు పంచుకోని రహస్యాలు మీకేమైనా తెలిస్తే, వాటిని మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications