Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తండ్రీ - కుమార్తెల అనుబంధం!... ‘ ఫాదర్స్ డే ' ప్రత్యేకం....!

1. మొదటి నిబంధన స్నేహం - మీ కుమార్తెను ఒక ఫ్రెండ్ గా భావించండి. మీ ఆలోచనలు పంచుకోండి. ఆమె అభిప్రాయాలు అడగండి.
2. మీ కుమార్తెను మీకు సమానంగా చూడండి - ఆమెకు ఏమీ తెలియదు అనే భావన వదలండి. పిల్లలు నేటి రోజులలో ఎంతో తెలివైనవారుగా వుంటున్నారు. వారు ఏం చేస్తున్నారనేది వారికి బాగా తెలుసు.
3. మధ్య వర్తిగా ప్రవర్తించండి - మీ కుమార్తెకు, మీ భార్యకు మధ్య సమస్యలు ఉంటే, మీరొక మధ్యవర్తిగా వ్యవహరించండి ఒక పురుషుడు ఇద్దరు మహిళల మధ్య జోక్యం చేసుకుంటే, కొన్ని సమస్యలు తేలికగా పరిష్కరించబడతాయి.
4. ఆమెతో సంభాషించండి - మీ కుమార్తెతో వీలైనంత సమయం గడపండి. ఆమె చదువునుగురించి లేదా ఆమె షాపింగ్ గురించిన అంశాలు తెలుసుకుంటూ ఆమెతో చనువుగా సంభాషించండి. అపుడపుడు రెస్టరెంట్లలో ఆమెకిష్టమైన తిండితినిపించండి.
5. నమ్మండి - ఆమె టీన్స్ కు వచ్చిందంటే, అధిక రక్షణ కల్పిస్తారు. అలాకాక ఆమెను విశ్వసించండి. ఆమె కదలికలను అతిగా అనుమానించకండి.
6. స్వతంత్రంగా - మీ కుమార్తె చిన్నది కాదు. ఆమెకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ఆమె తీసుకోగలదు. కనుక ఆమె తప్పులనుండి ఆమెను నేర్చుకోనీయండి. ఆమె తప్పులు చేస్తుందని భయపడకండి. ప్రతిదానికి ఆమెకు బోధించకండి.
7. ఏ షరతులు లేని ప్రేమనివ్వండి - ఆమె మీ స్వంత కుమార్తె. ఆమెను ఏ షరతులు లేకుండా మీరు ప్రేమనందించాలి. మీ ప్రేమ ఆమెను తన జీవితంలో సరైన ఎంపికలు చేసుకునేలా చేస్తుంది.
8. ఆమె స్నేహితులను అంగీకరించండి - ఆమెకుగల సోషల్ సర్కిల్ మీరు ఆమోదించటం కష్టమైనప్పటికి పూర్తిగా కాకపోయినా, కొంతమేరకు భాధ్యతాయుతంగా మీరు ఆమె స్నేహితులను అంగీకరించాలి.
9. సహనంగా వుండండి - ఆమెలో హార్మోన్లు అధికంగా వుండి కోపతాపాలు, ఆవేశాలు వుంటాయి. కనుక ఆమె కొన్ని అంశాలలో ఆవేశంగా ఎంతో సంభాషిస్తుంది. మీరు సహనంగా వుండాలి. అపుడు ఆమె కూడా మీకు ఎదురు చెప్పకుండా తగ్గి వుంటుంది.
10. కలసి సమయం గడపండి - సమయం కలసి గడిపితే, అనుబంధం పెరుగుతుంది. ఆమెకిష్టమైన రీతిలో ఆమెతో మీరు సమయం గడిపి వ్యత్యాసం గమనించండి. మీ పట్ల వారు తప్పక ప్రేమానురాగాలు కలిగి వుంటారు. తండ్రి - కుమార్తెల బంధం గురించిన మరిన్ని చిట్కాలు మీకు తెలిసినట్లయితే వాటిని మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications