Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
మాటలెక్కువ.....స్నేహం తక్కువ?

దూరం జరగండి - మీ స్నేహితుడు నాన్ స్టాప్ గా వాయించేస్తూంటే, మీ మొబైల్ సాకు చూపి లేదా టివీ లో వార్తల వంటివి చూపి పక్కకు తప్పుకోండి. అంత ఎనర్జీ కల మీ స్నేహితుడు మెల్లగా అర్ధం చేసుకొని మీరు వినే అంశాలే చెపుతూంటాడు.
వదిలించుకోండి - మీ ఫ్రెండ్ మీ వ్యతిరేక భావనలు పట్టించుకోకుండా తన సంభాషణతో కొనసాగిపోతున్నాడా? అతని సాంగత్యం వదిలేయటం మంచిది. వదిలేయటమంటే తాత్కాలికంగా తప్పించుకొని వెళ్ళిపొండి. మీరు కనుక నిలబడి వినటం మొదలు పెడితే, అతను మరింత మాట్లాడతాడు. కనుక జవాబివ్వకండి మార్పు క్రమేణా మీరే గమనిస్తారు.
నిలిపేయండి - కొన్ని సార్లు బాగా వాగుతూండే మీ స్నేహితుడి మాటలను మధ్యలో తుంచేయాల్సి కూడా వుంటుంది. మీరు మెత్తగా వింటూవుంటే అతని తప్పు అతను గ్రహించలేడు. నేరుగా తెలిపి ఆపించండి. లేదా మీ మరో స్నేహితుడిని మధ్యలో పెట్టి అడ్డుకట్ట వేయండి. అతనికి అతని వాగుడు ఏ రకంగా ఇబ్బందిపెడుతోందో తెలుపండి. మెల్లగా సున్నితంగా తెలుపండి. అతని స్నేహం పోకుండా కూడా వుంటుంది.
టాపిక్ మార్చండి - మీ స్నేహితుడు మరీ అనవసరమైన సోది, లేదా చెత్త మాట్లాడుతూంటే, మీరు టాపిక్ మార్చండి. మీ స్నేహితుడు వినే అంశాన్ని మీరు మాట్లాడటం మొదలుపెట్టండి. ఈ విధంగా అతని సంభాషణలకు బ్రేక్ వేయవచ్చు.
మీ పనిలో మీరుండండి - ల్యాప్ టాప్ చూస్తున్నారా? లేక మొబైల్ మాట్లాడుతున్నారా? లేక టి.వి. చూస్తున్నారా? మీ స్నేహితుడు మాట్లాడుతున్నపుడు మీరు ఏ పని చేస్తుంటే ఆ పనిలో నిమగ్నమైపోండి. అతని విషయం పట్టించుకోకండి. జవాబివ్వటం వంటివి చేస్తే మరింత కొనసాగిస్తాడు.
పైన తెలిపిన చిట్కాలు ఏవీ మీ వాగుడుకాయ స్నేహితుడినుండి మిమ్మల్ని తప్పించలేకపోతున్నాయా? చివరి మార్గంగా, మీ స్నేహితుడు మీ వద్దకు వచ్చేసరికి చెవులలో కాటన్ బడ్స్ పెట్టేయండి. మరో మార్గంగా అతనికి ఒక చాక్లెట్ ఇచ్చి దానిని తినమనండి. అతను స్వీట్ ఆరగిస్తూంటే, మీరు ప్రశాంతత భావించవచ్చు. ఎవరు ఎంత వాగుడు కాయలైనా, స్నేహితులు ప్రధానమే.



Click it and Unblock the Notifications
