Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రొమాంటిక్ సినిమాలతో ప్రేమికులు దగ్గరవుతారా?

రొమాంటిక్ సినిమాలు చూసినందువలన వచ్చే ప్రభావాలు -
ప్రేమ ఎప్పటికి ఒకటే - ప్రేమ పేరుతో సినిమాలు పుట్టినప్పటినుండి నేటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా ప్రేమ అమరం అని అది ఎప్పటికి చనిపోదని, పెద్దలు అంగీకరించినా అంగీకరించకపోయినా వారు ఒకటై తీరుతారని తమ శపధాలు నెరవేర్చుకుంటారని, ప్రేమ వివాహాలు అనేకం విజయం పొదినప్పటికి, ఎన్నో విఫలం అయినప్పటికి తమ ప్రేమ ఫలిస్తుందని, జంటలు నమ్ముతారు. యువతులు, తాము చనిపోయేటంతవరకు తాము ప్రేమించిన యువకుడు తమ పక్కనే వుంటాడని కూడా భావిస్తారు.
తార తమ్యాలు - సినిమాలలో ప్రధానంగా చూపబడే మరో అంశం...ధనిక పేద తారతమ్యాలు ప్రేమికులకు లేవని, వయసు వంటి పరిమితులు కూడా వారికి వర్తించవని, ప్రేమకు హద్దులు లేవని భావిస్తారు.
ప్రేమలో మీ ఇష్టాలు కూడా పనిచేయవు - ప్రేమించుకునే వారి మధ్య ప్రేమ పుట్టిందంటే, ఎవరి ఇష్టం వారిదే. వారు వ్యతిరేక ఇష్టాలు కలిగివున్నప్పటికి, ప్రేమికులుగానే వుంటారు. ఈ అంశం అనేక సినిమాలలో చూస్తూనే వుంటాం. వీలైతే, ప్రేమ త్యాగాలు కూడా చేసి ప్రేమికులపై తమ ఇష్టాన్ని చూపే అంశాలు కూడా వుంటాయి.
ప్రేమ భాధ్యత గుర్తింపజేస్తుంది - అప్పటివరకు ఎంతో అల్లరి చిల్లరిగా వున్న యువకుడు లేదా యువతి సైతం ప్రేమలో పడిందంటే, తన తీరు మార్చుకుంటుంది. భావాలు మారతాయి. ఎంతో భాధ్యతగా ప్రవర్తిస్తారు. ప్రేమే వారికి లోకం అవుతుంది. అందుకోసం ఎన్నో త్యాగాలకు సిద్ధ పడతారు. ప్రేమలో పడి వివాహాలు చేసుకొని భాద్యతాయుతంగా కుటుంబాలు నడిపే వారు నేటికీ లేకపోలేదు.
ప్రేమించుకోవటమే ముగింపుకాదు - ప్రేమ వరకే ప్రేమికుల భాధ్యతలు తీరిపోవు. సమాజపరంగా వారు ఆమోదించబడాలి. యువతీ యువకుల కుటుంబ సభ్యుల ఆమోద ముద్రలు పడాలి. ఆ పైన వివాహాలు. వివాహం రెండు వివిధ కులాలు లేదా మతాల మధ్య జరిగితే, మరో మారు వారికి పుట్టే పిల్లలపై వాటి ప్రభావం బాగా వుంటుంది.కనుక ప్రేమికులు, తాము ప్రేమించే ముందరే గుర్తెరిగి భవిష్యత్తులో తమ భాధ్యతలు ఏమిటనేది కూడా నిర్ణయించుకోవాలి. కాని ప్రేమ గుడ్డిది అంటారు. యువతీ యువకులు తమ వయసులో ప్రేమకే ప్రాధాన్యం ఇస్తారు తప్ప, ఇతర అంశాలకు ఎటువంటి ప్రాధాన్యతలను ఇవ్వరు. తర్వాత వచ్చే ఫలితాలకు అనేక కష్టనష్టాలకు గురవుతారు.
ఈ రకంగా సినిమాలు చూపే అంశాలతో ప్రేమికులు ప్రభావించబడి వాటితో తమ వాస్తవ జీవితాలను సైతం పణంగా పెట్టి ఆనందిస్తున్నారు లేదా విఫలమవుతున్నారనే చెప్పాలి. సినిమాల ప్రభావం నేటి యువతపై అత్యధికంగా వుందనటంలో అతిశయోక్తి లేదు.



Click it and Unblock the Notifications