Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎవరి ఇష్టం వారిది...కలసిన క్షణాలు ఇద్దరివి?

వివాహ జీవితంలో మీరు ఒక దశకు చేరుకున్న తర్వాత అపుడు బహుశ మీరు మొదటి సారిగా మీ వైవాహిక జీవితం ఆరోగ్యంగా వుందా లేదా అనేది పరీక్షించుకోవచ్చు. ఆరోగ్యకరమైన వివాహ జీవితంలో కొన్ని ప్రత్యేక అంశాలుంటాయి. అవి కొన్ని పరిస్ధితులలో మాత్రమే బయట పడతాయి.
మీ వివాహ జీవితం ఆరోగ్యంగా వుందనేదానికి 5 మార్గాలు
1. మీ భర్త తన మిత్రులతో కలసి కొన్ని ప్రదేశాల టూర్లకు వెళ్ళాడు. కాని మీరు మాత్రం కుటుంబ భాధ్యతలు నిర్వహిస్తూ ఇంటివద్దే వుండిపోయారు. ఈ రకంగా మీరిద్దరూ కలసి ఆనందిస్తూనే ఎవరి వ్యక్తిగత జీవితం వారు గడుపుతున్నారు. ఈ రకంగా ఎవరి ఇష్టం వారికుంటే అది ఆరోగ్య వివాహ జీవితమే.
2. మీ మీ స్నేహితులు డిన్నర్ కు పిలిచినపుడు దానిని తిరస్కరించారు. ఇద్దరూ కలసి సమయం గడపాలని నిర్ణయించుకున్నారు. ఆనందించాలనుకున్నారు. ఈ రకమైన సంఘటనలు కూడా మీ ఆరోగ్యకర జీవితాన్ని సూచిస్తాయి.
3. మీ భర్త తన ఆఫీస్ నుండి అందమైన అమ్మాయితో బయటకు అడుగువేయటాన్ని మీరు చూశారు. కాని మీరు ఆమె ఎవరని అడగలేదు. ఇది మీకు అభధ్రత లేదని సూచిస్తుంది. సాధారణంగా రోజూ ఎంతోమంది అందమైన అమ్మాయిలను పురుషులు కలుస్తారు. అది మన బంధాలను అభధ్రతగా భావించేలా చేయరాదు. మీ సంబంధం ఆరోగ్యకరమైనదైతే, అభధ్రత అనేది ఎపుడూ వుండదు.
4. మీరు మీ భార్యను ఎయిర్ పోర్ట్ నుండి పిక్ అప్ చేయటానికి వెళ్ళారు. ఆమె రావచ్చు. కాని మీరు పిక్ అప్ కు వెళ్ళారు. ఈ చర్య మీ మధ్య తరగని అనురాగం వుందని చూపుతుంది. ఆమె స్వంతంగా రాగలదు. కాని ఇంకా కొద్ది గంటలముందే ఆమెను చూడాలని ఆత్రంగా మీరు వెళ్ళారన్నమాటగా భావించాలి.
5. మీ మీ బ్యాంక్ ఎకౌంట్ల పాస్ వర్డ్ లు ఇతర ఆర్ధిక అంశాలు ఒకరికొకరు పంచుకున్నారు. అంటే ఒకరికొకరిపైన ఎంతో నమ్మకమన్నమాట. వివాహ జీవితం లో ప్రతి ఆర్ధిక అంశం పంచుకుంటే అది వారి మధ్య గల అవగాహన సూచిస్తుంది. నమ్మకం ఎంతో గౌరవించదగినది. సొమ్ము వద్ద ఒకరి కొకరు నమ్మకం పెట్ట గలిగితే, ఇక ఎందులో అయినా సరే ఇద్దరూ నమ్ముకుంటారు.
మరి మీ వైవాహిక జీవనం ఆరోగ్యంగా వుందనేందుకు పై వాటిలో కనీసం అయిదు అంశాలలోని మూడు అంశాలలో మీరు గెలుపొంది వుండాలి. అపుడే మీ వివాహ జీవితం మూడు పూవులు ఆరు కాయలుగా వుందని తెలుపుకోవచ్చు. అయిదు అంశాలలోను మీరు గెలుపొందినట్లయితే, అది ఆరోగ్య కరమే కాదు, అంతులేని ఆనందాలను కూడా మీ వివాహ జీవితం ఇచ్చేస్తోందని భావించండి.



Click it and Unblock the Notifications