Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వివాహ జీవితానికి నిబంధనలు ముందుగానే పెట్టండి?

వివాహానికి పవిత్రమైన నిబంధనలు
1. ఎంత లేటైనా సరే రాత్రయ్యే సరికి ఇంటికి రావాలి. చాలామంది పురుషులు వారి రాత్రులు ఇంటిబయట గడుపుతారు. అది వారి స్నేహితుల ఇల్లు కావచ్చు లేదా రాత్రంతా ప్రయాణం చేయనూ వచ్చు. వీరు తమ రాత్రి సమయాన్ని తిరగటంలో గడిపేస్తారు. ఇటువంటివారికి మీరు ఇక ఈ రాత్రి తిరుగుళ్ళు మానేయమని తెలుపాలి.
2. పీకలదాగా తాగి ఇంటికి రావద్దు. స్నేహితులతో కలసి బాగా తాగేయటం ఒక తప్పు, తాగి రాత్రివేళ ఇంటికి రావటం మరో తప్పు. మీ ఇంటి పవిత్రత మీ చేతుల్లో వుంది. మీ వివాహ జీవితం కొంత మర్యాద కలిగి వుండాలి గాని అతను తాగి మీ వాకిట నిలబడటం కాదు.
3. మీ స్నేహితులు ఇంటికి రావచ్చు. కాని అన్ని వేళలా కాదు. మీ బాచిలర్ జీవితంలో రాత్రయినా, పగలైనా స్నేహితులను ఇంటికి పిలిపించుకుంటాం లేదా తీసుకు వస్తాం. ఇక వివాహం అయిన తర్వాత మీ స్నేహితులు ముందస్తు సమాచారంతో ఇంటికి రావాలి. అంతేకాదు, మీరు ఇంటివద్ద లేనపుడు రాకూడదు. ఆమెకు ఎంతో అసౌకర్యంగా వుంటుంది.
4. ఇవి నా ప్రతిరోజూ పనులు. అవినీవి. నేటి రోజులలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగులే. కనుక ఇంటిపని పంచుకోవాలి. మొదటి సంవత్సరంలో ఎంతో ప్రేమ వుండి అన్ని పనులు మీరే చేయవచ్చు. కాని, తర్వాతి దశలో అది మీకు చికాకు కలిగిస్తుంది. కనుక ముందుగానే ఒక నిబంధన మేరకు ఇద్దరూ ఇంటిపని పంచుకోవాలి. లేదంటే ఒకరే పని అంతా చేసి ప్రతిరోజూ గొణగటంగా వుంటుంది.
5. ఇంటిలో ఎక్కడైనా మురికి చేసినా లేదా చెత్త వంటివి వేసినా, మీకై మీరే శుభ్రం చేయాలి. ఎవరి మురికి వారికి బాగానే వుంటుంది గానీ, మరొకరి చెత్త మురికి, ఛండాలం వంటివి వేరొకరు చేయలేరు. కనుక ఈ నిబంధన తప్పక వుండాలి.
6. మనలో ఒక్కొక్కరం ఎంత ఖర్చు పెడుతున్నాం? కొత్తగా పెళ్ళి అయినపుడు, సొమ్ముకు చివరి ప్రాధాన్యతనిస్తాం. కాని, కష్టాలన్నీ తర్వాతి రోజులలో సొమ్ము దగ్గరే వస్తాయని గుర్తించండి. ఖర్చు చేయటం ముందే నిర్ణయించాలని తెలుపండి. మీరు ఇంటి ఇల్లాలయితే, పాకెట్ మనీ ఇవ్వాలని ముందుగానే తెలుపండి.
ఈ నిబంధనలు మరియు ఇతర వివాహ నిబంధనలు పెళ్ళికి ముందే పెట్టేసుకుంటే, మీ వివాహ జీవితం సాఫీగా సాగిపోతుంది. మరి ఏ ఇతర నిబంధనలు మీకు పెట్టాలనిపించినా? వాటిని మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications