Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆ పనికి పనికిరాని అయిదుగురు పిచ్చోళ్ళు?

ఆధ్యాత్మిక పిచ్చి - నేటి రోజులలో ఆధ్యాత్మికం అనేది కమ్మర్షియల్ అయిపోయింది. కుర్రాళ్ళకు ఏ మాత్రం చికాకుగా వున్నా, దగ్గరలో ఉండే ఒక ఆధ్యాత్మిక గురువు వద్దకు పోవడం పొద్దస్తమానం కూర్చోటం చేసేస్తున్నారు. మరి ఈ రకమైన ఆధ్యాత్మిక పిచ్చోడితో డేటింగ్ మొదలెడితే, సినిమా ధియేటర్ కి బదులు, స్వామిజీ ప్రసంగాలే మీకు గతి. కనుక అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది? నేను విశ్వ ప్రేమికుడిని అని చెప్పే ప్రసంగాలవారితో జాగ్రత్తగా ఉండండి.
నియంత్రణ పిచ్చి - ఈ రకం వ్యక్తులను ముందుగా కనిపెట్టలేము. ఒకటి లేదా రెండు కలయికలకు కాని వీరు బయటపడరు. అయితే, ఒక వారం రోజుల్లో వారి విషయం తెలిసిపోతుంది. వీరు మీరు వేసే దుస్తుల రంగు కూడా వారికి నచ్చినదిగానే ఉండాలంటారు. మీకు ఆఫీస్ కి ఇంటికి కూడా టాక్సీ ఏర్పాటు చేస్తారు. మిమ్మల్ని బయటకు అడుగుపెట్టనివ్వరు. కనుక మీరు స్వేచ్ఛగా ఉండాలంటే, డేటింగ్ లో వీరిని వదిలేయండి.
రొమాంటిక్ పిచ్చ - కొంతమంది ఎపుడు చూసినా రొమాన్స్ చేయాలంటారు. రొమాన్స్ అధికం అయితే, ఆరోగ్యానికి హాని. అంతేకాదు, బోర్ కొట్టి సిక్ అయిపోతారు. కనుక ప్రియా నీ ముఖం చంద్రబింబంలా ఉందనే వారికి నా గుండె నీ కాళ్ళముందదుంచుతాను అనే వారికి దూరంగా ఉండండి.
ఫిట్ నెస్ పిచ్చి - ఈ మధ్య డేటింగ్ మార్కెట్లలో వీరి తాకిడి అధికంగా ఉంది. వీరికి ఆరోగ్య జీవన విధానాల పిచ్చి. దానిని పాటించని వారికి వీరు సంస్కర్తలుగా తయారవుతారు. మీరు డేటింగ్ కని వెళితే మిమ్మల్ని కూడా జిమ్ లో చేర్పిస్తారు. బర్గర్ లేదా పిజ్జా ఆర్డర్ చేస్తే, ముఖం అదోలా పెట్టేస్తారు. కనుక వీరితో మీరు ఆనందించలేరు కనుక డేటింగ్ చేయకండి.
వెల్ఫేర్ పిచ్చి - వీరెంత సేపూ సంఘ సేవ అంటూ తిరుగుతారు. ఒక పక్క మీరు ఆనందంగా డేటింగ్ చేస్తానంటే, ఆకలితో వున్న పిల్లలకు సేవ చేయాలంటారు. ఎపుడూ ఏదో ఒక సంక్షోభంలో వీరు కొట్టుమిట్టాడుతూంటారు. మీ జీవితంలో ఏ ఆనందం మిగలదు. కనుక వీరు డేటింగ్ కు పనికి రారు.
కనుక, పై లక్షణాలు లేని యువకులను డేటింగ్ చేసి మీ వయసుకు మీరు ఆనందించండి. అతనిని ఆనందింపచేయండి.



Click it and Unblock the Notifications