Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
జంటలు సొమ్ము విషయంలో ఒకటిగా లేకుంటే?

డేటింగ్ చేసుకోవడం మరియు వివాహం చేసుకోవడంల మధ్య ఒకే వ్యత్యాసమేమంటే అది మనీ మాత్రమే. వివాహం చేసుకుంటే, మీరు ఇంటిని పార్టనర్ జీవితాన్ని మరియు ఆర్ధిక అంశాలను కూడా పంచుకుంటారు. గతంలో అయితే, మహిళ ఇంటిపట్టున ఉండటం, పురుషుడు బయటకు వెళ్ళి సంపాదించి తీసుకురావటంగా ఉండేది. అతనే అన్ని ఆర్ధిక అంశాలు చక్కపెట్టేవాడు. కాని నేటి ఆధునిక కుటుంబాలలో జంటలోని ఇరువురూ కూడా సొమ్ము పట్ల అవగాహన కలిగి ఒకేమాటపై ఉండాలి. అలా లేకుంటే, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.
మరి జంటలు సొమ్ము విషయంలో అవగాహన లేకుంటే ...
1. మీరు కలలు కన్న హాలీడే ట్రిప్ కు మీరు సొమ్ము కూడపెట్టుకుంటే, అతను తనకు ఇష్టమైన ల్యాప్ టాప్ కొరకు దానిని ఖర్చు చేసేస్తాడు. మీ దృష్టిలో ల్యాప్ టాప్ అవసరం లేదు. అవి ఎప్పటికపుడు మారిపోతూంటాయి. టెక్నాలజీ మారిపోతూంటుంది. అనవసరమైన ఖర్చు. అదే హాలీడే ట్రిప్ అయితే, మీ జ్ఞాపకాలలో భధ్రంగా మిగిలిపోతుంది. జీవితాంతం తలుచుకుంటూ ఉండవచ్చునని మీరు భావిస్తారు. ఇక్కడ ఇద్దరూ సరిగానే ఉన్నారు. కాని చర్చ ఇద్దరి మధ్యా కొనసాగుతూనే ఉంటుంది.
2. ఆమె ఖరీదైన రిస్ట్ వాచ్ కొనేస్తుంది. ఇక నెలంతా డబ్బు లేక ఇబ్బంది పడుతుంది. అంటే మీ వద్దనుండి ఆమె అప్పు తీసుకోవాలి. అపుడు మీరు డబ్బు ఇచ్చి ఇల్లు గడపమనాలి. ఆమె కూడా తన క్రెడిట్ కార్డ్ పై ఖర్చు చేయాలి. మీరు పొదుపు చేసేవారైతే, ఇది ఒక భాధ్యతలేని చర్యగా భావిస్తారు. ఈ రకంగా మీ పార్టనర్ మీ మనీ అంతా ఖర్చు చేస్తూ పోతే, ఆర్ధిక అంశాల పట్ల మీకు తగాదాలే.
3. మీరు పొదుపు అంటూ డబ్బు కూడపెడతారు. మీ పార్టనర్ ఒక కారు కొనేస్తాడు. మీరు దానిని అనవసరంగా భావిస్తారు. అయిష్టంగానే మీ పొదుపు సొమ్ము అతనికిచ్చేస్తారు. ఇక అతను కారుకు నెలసరి చెల్లింపులు చేస్తూ ఇబ్బందులు పడతారు. ఇక ఇద్దరి మధ్యా రోజూ తగవులుగానే ఉంటాయి.
4. మీరు మంచి విద్య కల అమ్మాయిని తన ఉద్యోగం తాను చేసుకునే దానిని పెళ్ళాడారు. పెఠ్ళి తర్వాత ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి హౌస్ వైఫ్ అయిపోయింది. ఆమె తనకు గతంలోల సొమ్మును తన ఇష్టం మేరకు ఖర్చు చేయాలనుకుంటుంది. ఇద్దరికి సంబంధించిన ఖర్చులకు ఖర్చు చేయనంటుంది. ఇక మీ ఇద్దరి మధ్యా ఆర్ధిక సంబంధ తగవులే చోటు చేసుకుంటాయి.
మీ పార్టనర్ తో మీరు ఏ విషయంలో అయినా సరే వ్యతిరేకించండి. కాని సొమ్ము విషయంలో ఒకటిగా ఉంటే, మీ మధ్య విభేధించే అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి సొమ్ము విషయంలో కనుక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటే, ఇక ఆ వివాహ జీవితం విఫలతలకు లేదా తగవులు పెరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లే.



Click it and Unblock the Notifications