Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒకరికొకరు సూట్ కాకుంటే.....?

ఇక నేటి రోజులలో ఒక పురుషుడిని ప్రేమించాలంటే, అతని ఉద్యోగానికి నా ఉద్యోగానికి సరిపోతుందా? అనేది పరిశీలిస్తున్నారు. పెళ్ళాడిన తర్వాత ఇద్దరికి ఉద్యోగాలు చేసుకోవడంలో కూడా సరిపోతుందా? కెరీర్లు సమంగా ఉంటాయా లేక తగవులు వస్తాయా వంటివి పెళ్ళికి ముందే మాట్లాడుకుంటున్నారు.
జంటల ఉద్యోగాల అనుకూలత ఎలా?
1. డాక్టర్లు , డాక్టర్లనే పెళ్ళి చేసుకోవాలని, లాయర్లు తమకు తగ్గ లాయర్లనే పెళ్ళాడాలని అనుకుంటారు. దానికి కారణం, ఒకరి వృత్తి లోని కష్ట నష్టాలు మరొకరికి బాగా తెలుస్తాయని భావించేవారు. డాక్టర్ భర్త అయితే, అత్యవసర ఆపరేషన్ కారణంగా హనీమూన్ రద్దయితే, మరో డాక్టర్ భార్య మాత్రమే దానిని అర్ధం చేసుకోగలదు. మరొక వృత్తి వారైతే అర్ధం చేసుకోలేక సమస్యలు కొని తెచ్చుకుంటారు.
2. ఎపుడూ కేంపులంటూ తిరగటం - భర్తకు ఎపుడూ కేంపులేనా? మార్కెటింగ్ లేదా మరొక ఆర్టిస్ట్ కావచ్చు. వీరు ఎపుడూ కొత్త ప్రదేశాలు తిరుగుతూంటారు. ఇక భార్య గృహిణి ఉద్యోగంలో స్ధిరపడాలి లేదా ఆమె కూడా అతని కెరీర్ లో నే సహకరిస్తూ ప్రతి ఊరూ తిరగాలి.
3. ఒక లాయర్ ని పెళ్ళాడాలంటే...? సాధారణంగా ఒక లాయర్ ను పెళ్ళాడటానికి జంకుతారు. పిల్ల తల్లితండ్రులు లాయర్ కు త్వరగా పిల్లనివ్వరు. ఎపుడూ కోర్టులు, పార్టీలు అంటూ ఇంటి వద్ద కూడా ఫైల్ మెయిన్టెయిన్ చేస్తూ తమ పిల్ల బాగోగులు పట్టించుకోడని భావిస్తారు. అంతేకాక, లాయర్ గా అనవసర కేసులు కూడా తమపై పెట్టేస్తారన్న భావన కూడా ఉంటుంది. కనుక లాయర్ అయిన వారు, చట్ట సహాయం కూడా తమ పెళ్ళికి తీసుకుంటారు.
4. జర్నలిస్టులు - మీడియా వ్యక్తి మీకు జంట అనుకుంటున్నారా? అసలు పెళ్ళికి పనికి వస్తాడా అనేది ముందు అడగండి. ఎందుకంటే, వీరు ఇరవై నాల్గు గంటలూ ఉద్యోగంలో పని చేస్తూ, సమాజాన్ని, ప్రభుత్వాన్ని నిరంతరం కనిపెడుతూ వారి వార్తలన్ని ఎత్తి చూపాలి. వారి ఉద్యోగం చాలా కష్టతరం. అందునా క్రైమ్ న్యూస్ వ్రాసే వారైతే మరింత కష్టం. వీరికి తగినంత రక్షణకూడా కావాలి. ఎల్లపుడూ నేరస్తులతో వ్యవహరిస్తారు. టవున్ లో ఎక్కడపడితే అక్కడ చెడు ప్రదేశాలలో కూడా తిరుగుతారు. వార్తలంటూ తిరిగి తిరిగి అర్ధ రాత్రి అపరాత్రి ఇంటికి వచ్చి పెళ్ళాం తిన్నదో లేదో అని కూడా చూడకుండా పడకేస్తారు. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి సమస్యలు కూడా కొని తెచ్చుకొంటారు. కొన్ని మార్లు తమ జీవితాలను సైతం రిస్కులో పడేస్తారు. కనుక మీడియా భర్త లేదా భార్య అయ్యేట్లయితే కొంత బాగా ఆలోచించండి.
5. లైట్స్, కెమేరా, యాక్షన్ - నటీ నటులు...ఒక నటుడు భర్త కావాలనుకుంటే, ఇక ఎప్పటికి అతని నీడన మీరు జీవించాల్సిందే. మీకు ఎట్టి వ్యక్తిత్వం ఉండదు. అదే భార్య ఒక సెలబ్రిటీ అయితే, ప్రపంచంలో లక్షలాది ప్రజలు ఆమె గురించి కలలు కంటారు. మీరేమో ఒక 9 గంటలనుండి 5 గంటలవరకు ఆఫీస్ లో పని చేసే వారు కావచ్చు. మరి ఇద్దరికి పొంతన కుదురుతుందా?
కనుక జంటలు తాము వివాహం చేసుకోవాలంటే, ఒకరి వృత్తి లేదా ఉద్యోగంతో మరి ఒకరిది సరిపడుతుందా? అనే అంశం తప్పక పరిశీలించాలి. వారి మధ్య అవగాహన లేదంటే, ఆ వివాహ జీవితం సమస్యల సుడిగుండంలో పడి జంటలు దిక్కు తోచక సంబందం వదులుకోవలసి కూడా వస్తుంది.



Click it and Unblock the Notifications