Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్ళి తర్వాత స్నేహ సంబంధం కొనసాగుతోందా?
సాధారణంగా ఏ సంబంధానికైనా సరే ప్రారంభంలో స్నేహం ఉంటుంది. స్నేహంతో మొదలై అది వివిధసంబంధాలకు దోవతీస్తుంది. మరి అటువంటపుడు మొదటిలో ఏర్పడిన ఈ స్నేహ సంబంధాన్ని మనం చివరిదాకా ఎందుకు కొనసాగించరాదు? ఒక యువతి మరియు యువకుడు కలుస్తారు. స్నేహంమాత్రమే అనుకునిసాగుతారు. మెల్లగా ఆ స్నేహ సంబంధం మరింత ముందుకు వెళ్ళి ఒక ప్రేమ సంబంధంగా చోటు చేసుకుంటుంది. చివరకు ఆ జంట వాగ్దానాలు చేసుకుంటారు. అంతే భార్యా భర్తలైపోతారు. చాలామంది తమ వివాహానికి ముందు స్నేహితులుగా వుంటారు. అయినప్పటికి, జీవితపు ఒత్తిడిలు వారి స్నేహాన్ని పెండ్లి తర్వాత హరించివేస్తాయి.

వివాహం తర్వాత కూడా జంటలు స్నేహితులుగా కొనసాగటం చాలా ప్రధానం. మీ వివాహ సమస్యలన్నిటికి అది పరిష్కారంగా ఉంటుంది. మరి వివాహం తర్వాత మీ జీవితంలో కోల్పోతున్న నఆ స్నేహ సంబంధాన్ని పునరుద్ధరించేందుకు ఈ ట్రిక్కులు ప్రయత్నించండి.
1. ప్రతిదానిని విమర్శించకండి - పెండ్లి తర్వాత మీరు ప్రతిది భాగస్వామిని ప్రశ్నిస్తూంటే, మీరు ఎప్పటికి స్నేహితులు కాలేరు. అదే విధంగా, నిరంకుశ భర్తగా లేదా అనుమానపు పక్షిగా ప్రవర్తిస్తే మీ భార్య ఎప్పటికి మీతో స్నేహం చేయలేదు. పెండ్లి తర్వాత కూడా స్నేహితులుగా వుండాలంటే, నేను భర్త...నీవు భార్య అనే భావనలు తొలగిపోవాలి.
2. మీ హాస్య ధోరణి అంతా ఏమైంది? చాలామంది జంటలు పెండ్లి తర్వాత జీవితాన్ని అనవసరంగా సీరియస్ గా తీసుకుంటారు. వారు ఎపుడు చర్చించుకున్నా అది ఉద్యోగ మార్పు లేదా ఇల్లు అద్దెకు తీసుకోవటం లేదా ఎక్కడైన పెట్టుబడి పెట్టటం వంటివిగా ఉంటాయి. అదొకన బిజినెస్ సమావేశంలా ఉంటుంది. ఏదో ఒకటి అనవసరమైన హాస్యాలు కూడా మాట్లాడి మీ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి తెచ్చుకోండి. ఈ రకమైనవే మనం మన స్నేహితులతో కూడా మాట్లాడతాం.
3. అధికంగా ఆశించకండి - మీ సంబంధంలో అధికంగా మీ భాగస్వామి అది చేయాలని, లేదాఇది చేయాలని ఆశించకండి. మీ స్నేహితుడు మీకు ఏదీ చేయకపోయినా సరే మీరు ఏమీ అనుకోరు అదే రకంగా భాగస్వామి ఏదేని వ్యతిరేకం చెప్పినా, మనసు కష్టపెట్టుకోక, దానిని తేలికగా తీసుకోండి. ఆమెకు ఉన్న కష్టం గ్రహించండి.
4. కలసి పనులు చేయండి - వివాహం తర్వాత జంటలు చాలావరకు ఎవరి పనులు వారు చేసుకోవటంలో నిమగ్నమైపోతారు. ఇక బెడ్ రూమ్ లో మాత్రమే వారు కలుసుకోవడం జరుగుతూ వుంటుంది. ఈ చర్య వారిని మరింత విడదీస్తూ వుంటుంది. సమస్యలలో వారు మరింత వెడం అయిపోతారు. కనుక కలసి మెలసి పని చేసుకోండి. మీరు బ్యాచిలర్లుగా వున్నపుడు, తోటివారితో హాస్టళ్ళలో కలసి మెలసి ఎలా వుంటారో, పనులు చేసుకుంటారో అదే విధంగా పనులు చేసుకుంటూ ఉండండి.
5. ఇతరుల గురించిన గుస గుసలు - స్నేహంలో ఎల్లపుడూ మూడో మనిషి గురించి చెప్పుకుంటూనే వుంటారు. గుస గుసలాడతారు. అదే విధంగా ఇపుడు మీ భార్య లేదా భర్తతో ఇతరుల గురించి ఊసుపోని కబుర్లు చెప్పండి. అవి మీ మధ్య స్నేహాన్ని పునరుద్ధరిస్తాయి. మీ మధ్య గల అడ్డంకులను తొలగిస్తాయి.
వివాహమై మీరు ఏ దశలో ఉన్నప్పటికి, మీరు వివాహ జీవితం అంతా స్నేహితులుగా ఉండటంలో తప్పు లేదు. ఉండాలి కూడాను.



Click it and Unblock the Notifications