Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళను ఆకర్షించాలంటే...ముఖంపై గాటు...!

తల లేదా మెడ విరుపు - మీరు పెట్టే తల యాంగిల్ మీ ఆకర్షణను చెపుతుందంటున్నారు వెబ్ సైట్ నిర్వాహకులు. మహిళ తన తలను వెనక్కి విరిస్తే, ఆమెలో మహిళాతనం తక్కువని తక్కువ ఆకర్షణ కలిగి వుంటుందని, తన గడ్డం క్రిందకు వంచితే మహిళాతనం అధికమని, రతి బాగా చేయగలదని చెపుతున్నారు. అయితే ఈ భంగిమలు పురుషులకు పూర్తిగా వ్యతిరేక ప్రభావం తెలుపుతాయని కనుగొన్నారు. తల కనుక ముందుకు వంచితే, మగతనం తక్కువట. ఆకర్షణ కూడా తక్కువేనట. కనుక మహిళలు తల ముందుకు వంచితే, పురుషులు దానిని వెనక్కు వంచాలి. అపుడే మహిళలో మాధుర్యం, పురుషుడిలో పురుషత్వం వెల్లడవుతూంటాయి.
చిరునవ్వు - మీ ముఖానికి మరో ఆకర్షణ, మీ చిరునవ్వు. చాలామంది చిరునవ్వును అద్దంలో చూసి మరీ సాధన చేస్తారు. ఈ చిరునవ్వు మీ ప్రేయసికి ఆకర్షణగా వుండాలి. ఫొటోలకొరకు నవ్వుతాము. ఎవరినైనా కలిసినపుడు నవ్వుతాము. ఈ రకంగా మీలోని ఆకర్షణను బయటపెట్టుకోవచ్చు. ఇక ఎపుడూ నవ్వుతూండే పురుషులైతే, నవ్వుని ఆపండి. మహిళలకైతే మంచి పలువరస అందాన్నిస్తుంది. మహిళలైనా, పురుషులైనా, చిరునవ్వు వరకు పరవాలేదు. అది వారి ముఖానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
రింగ్ ఫింగర్ - జెనీవా యూనివర్శిటీ రీసెర్చర్ల పరిశోధన మేరకు మన రింగ్ ఫింగర్ మన ముఖ ఆకర్షణను తెలియజెపుతుందట. రింగ్ ఫింగర్ కనుక బాగా పొడవుగా వుంటే మీలో టెస్టోస్టిరోన్ అధికంగా వున్నట్లు తేలింది. రింగ్ ఫింగర్ పొడవుగా వున్న పురుషుల్లో ఆకర్షణీయముఖం కూడా వుంటుందని తెలుస్తోంది.
ముఖంపై గాటు - సాధారణంగా మహిళలు, ముఖంపై పెద్ద గాటు వున్న పురుషులకు ఆకర్షించబడతారట. ఆ రకంగా వున్న ముఖం బాగా ఆకర్షణీయం అని సర్వే చెపుతోంది. దానికి కారణం అతనిలో ధైర్య సాహసాలు బాగా వుంటాయని మహిళను, పిల్లలను ఎట్టి పరిస్ధితులలోనైనా సరే ఇటువంటి పురుషుడు బాగా రక్షిస్తాడని వారు భావిస్తారని వెబ్ సైట్ తెలిపింది.



Click it and Unblock the Notifications