Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పురుషుడంటే...కండలు తిరిగిన సాహసే?
కండలు తిరిగిన వీరుడిగా....? ధైర్య సాహసాలు ప్రదర్శించటం పురుషులకు ఎంతో గర్వంగా ఉంటుంది. గత దశాబ్దాలలో కండలు తిరిగిన పురుషులు ధైర్య సాహసాలు ప్రదర్శించి వీరులుగా, శూరులుగా పేరుపడేవారు. రోడ్లపై వారు నడుస్తుంటూ, మహిళలు ప్రశంసాపూర్వకంగా వెనక్కు తిరిగి మరీ చూసేవారు. నేటికి మహిళలు కండలు తిరిగి ధైర్య సాహసాలు ప్రదర్శించే పురుషులంటే సర్వం అర్పించుకుంటానికి సిద్ధపడతారు. వారు మెచ్చే పురుషులలో అట్టివారే అధికంగా ఉంటారు. మహిళ తాను కోరే పురుషుడికి కండలు తిరిగిన శరీరం, ధైర్య సాహసాలు అన్నీ ఉండాలని కోరుకుంటుంది. అయితే, ఈ లక్షణాలు అందరి మగవారికి ఉండవు. కొంతమందికి ఎంత ప్రయత్నించినా అవి వంటపట్టవు కూడాను.

మరి మీరు కండలు తిరిగిన వీర పురుషుడిగా ఉండాలనుకుంటున్నారా? అలాగయితే, దిగువ అంశాలు పరిశీలించండి.
అలంకరణ ప్రధానం - పురుషులు తమ ధైర్యసాహసాలు, కండలు తిరిగిన శరీరాన్ని ప్రదర్శనకు పెట్టాలి. అంటే దాని అర్ధం వారు రోజంతా తమ అలంకరణలలో మునిగి తేలాలని కాదు. ప్రధానంగా షేవింగ్, మంచి సువాసనలు రావటం, శుభ్రత, ఆరోగ్యం, మొదలైనవి మెయిన్టెయిన్ చేయాలి. చక్కటి హెయిర్ కట్ ఉండాలి. వారి పర్సనాలిటీకి తగ్గ అలంకరణ ఉండాలి.
గర్వం కాదు, వారి తీరు బాగుండాలి - మహిళలు సరైన తీరు కల పురుషులను ప్రేమిస్తారు. కనుక మీ తీరు బాగుండాలి కాని గర్వపోతులై ఉండరాదు. ఆకర్షణీయమైన పురుషుని తీరు ఎంత తెలివిలేని మహిలనైనా సరే ఆకర్షిస్తుంది.
శారీరక సౌష్టవం...ఈ కండల వీరులను సాధారణంగా వారి శరీరం చూసే ప్రేమిస్తారు. శరీరం కండలు తిరిగి వుంటే, వారు ధైర్యవంతులనబడతారు. కనుక జిమ్ కు రెగ్యులర్ గా వెళ్ళి సిక్స్ ప్యాక్ పొట్ట సంపాదించండి. చక్కటి శరీరం అంటే మహిళలు ఇష్టపడతారు.
మర్యాద మన్ననలు - ప్రతి మహిళా వీటిని కోరుకుంటుంది. మహిళలను గౌరవించే పురుషులంటే మహిళలు ఎంతో ఇష్టపడతారు. పురుషులు తమ ప్రవర్తనలో మహిళలను అధికంగా ఆకట్టుకోగలరు.
హాబీలు - పురుషుడిగా ధైర్యంగా ఉండండి. అపుడే మీరు మీ వీరత్వాన్ని ప్రదర్శించగలరు. పురుషుల హాబీలైన వేటాడటం, పోలో, సాసర్, బ్లాక్ జాక్ వంటివి ఆచరించండి. ఈ హాబీలు మహిళలను మీ వైపుకు ఆకర్షిస్తాయి. మీ హాబీలు చూపి ఆమెను ఆకట్టుకోవచ్చు.
మహిళ మీ ధీరత్వం, శారీరక రూపం, మర్యాద మన్ననల అలవాట్లు మొదలైనవి చూసి మీ వద్దకు వచ్చిందా? మీరు ఏ మాత్రం తగ్గకండి. ముందుకు దూసుకు పోండి. ఆమెను కనీసం హోటల్ బిల్లు కూడా చెల్లించకుండా చూడండి. అటువంటి లక్షణాలు మీలో ఉంటే మీరు తప్పక ఆమె ప్రశంసలు పొందగలరు. మహిళలకు ఇష్టమైన దుస్తులు ధరించండి. గంభీరంగా, విశ్వాసంతో ఆమె వెంట సాగండి. అన్ని అంశాలలోను ఆమె పురుషుడి సహకారానికి, బాసటకు చూస్తుందన్నది గ్రహించండి. ఆమె మిమ్మల్ని అనుకరించేలా చేసుకోండి. అపుడే మీరు ఆమెకు ఒక వీర పురుషుడిగా కనపడతారు. ఆమె ప్రశంసలు పొందుతారు.



Click it and Unblock the Notifications