Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
‘మామ్....వంట భలే రుచిగా చేశావ్’!

అమాయకం - మంచి బాలుడుగా వారిముందు ప్రవర్తించండి. లేదంటే కనీసం అమాయకపు ముఖాన్ని పెట్టుకు తిరగండి. మీ వయసుకు తగిన ఆలోచన రాలేదన్నట్లుండండి. ఇక వారు ప్రపంచం తమ పిల్లాడిని ఏమీ చేయలేదని వాడు చాలా అమాయకుడని భావిస్తూంటారు. అంతేకాదు, ఇతర పిల్లలకంటే మీరు ఎంతో మెరుగని భావిస్తారు.
చిన్న చిన్న పనులు - మీ తల్లి తండ్రులకు మీరు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కాని మీరు చేయగలిగిన చిన్న చిన్న పనులు చేయండి. ఉదాహరణకు మీ డ్యాడీ షర్టు లేదా టై వంటివి అతను ఆఫీస్ కు వెళ్ళే సమయంలో చేదికి అందించటం లేదా మీ తల్లికి ఆహారం తయారీ లేదా డైనింగ్ ఏర్పాటు వంటి వాటిలో సహాయ పడటం చేయండి. ఈ విధంగా మీరు మీ తల్లితండ్రులకు మీరంటే మెచ్చుకునేలా చేయవచ్చు.
క్రమశిక్షణ - ప్రతి తల్లి, తండ్రి కూడా తమ పిల్లాడు అందరికంటే బెస్ట్ గా ఉండాలని కలలు కంటారు. దీనికి ముందుగా కావలసింది క్రమశిక్షణ. ఈ వయసులో చాలామంది దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. తల్లితండ్రులు పెట్టే ఆంక్షలు వారికి నచ్చవు. మరి మీరో మంచి బాలుడు అని మీ తల్లితండ్రులు భావించాలంటే, తినటం, నిద్రించటం, స్టడీ చేయటం వంటివి సరైన సమయానికి ఆచరించండి.
చదువులు - చదువులలో బాగా రాణించండి. మీ తల్లి తండ్రులు మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు. మ్యూజిక్, క్రీడలు, లేదా మీ తల్లితండ్రులకు ఆసక్తి కల ఇతర రంగాలలో మీరు శ్రమించండి. దీనితో వారు మా పిల్లవాడు అన్నింటా బెస్ట్ అని భావిస్తారు. ఇక మీ జీవితం అంతే చాలా స్వేచ్ఛగా, హాయిగా ఉంటుంది.
పొగడండి - వయసు ఏదైనప్పటికి ప్రతి వ్యక్తికి పొగడ్త కావాలి. ఇది ఒక మానవ బలహీనత. మరి మీ తల్లితండ్రులు అందుకు మినహాయింపు ఏమీ కాదు. కనుక ‘మామ్....వంట భలే రుచిగా చేశావ్ ' ‘డ్యాడ్ మీరు ఎంతో కూల్....ఏం కోపం ఉండదు' వంటి ప్రశంసలను వారికి అందించేందుకు ప్రయత్నించండి.
మరి మంచి బిడ్డ అనిపించుకోవాలంటే, మీ తల్లితండ్రులు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే, ఈ పై చిట్కాలు పాటించి వాటి ప్రయోజనాలను తప్పక పొందండి.



Click it and Unblock the Notifications