Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కలసి మెలిగితే కలదు ఆనందం...!
కుటుంబ సభ్యుల కలయికల ప్రాధాన్యత చెప్పనలవికాదు. మన భారతీయ సాంప్రదాయంలో పండుగలు ఎన్నో వస్తూంటాయి. సాధారణంగా ఈ పండుగల సమయంలో కుటుంబంలోని సభ్యులు, ఏ ఏ ఊళ్ళలో ఉన్నా సరే, తల్లి తండ్రి ఉన్న ఇంటికి వచ్చి అందరితో కలసి మెలసి ఆనందిస్తూంటారు. ఈ రకమైన కుటుంబ కలయికలు ఎంతో ప్రాచీనకాలం నుండి మన సంప్రదాయంలో వస్తూనే ఉన్నాయి. ఈ రకమైన కలయికలను మనం ఎంతో అపురూపంగా భావిస్తాం.

ఒకరి కష్టాలు, సుఖాలు మరి ఒకరికి తెలుస్తూంటాయి. ఈ రకంగా కలుసుకున్నపుడు ఒకరి కొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ప్రతిరోజూ ఉత్సాహంగా వివిధ ప్రోగ్రాములు పెట్టుకుంటారు. ఇక పిల్లలకైతే, ప్రతి సంవత్సరం ఎంతో సందడిగా ఉండి వివిధ రీతులలో ఆనందిస్తారు. ఈ సమయంలో వారి మధ్య ఏ రకమైన విభేధాలు ఉన్నా అవి మరచిపోతారు. అంతా కలసి పండుగ వాతావరణాన్ని ఆనందిస్తారు. నానాటికి పెరుగుతున్న నాగరికత, పాశ్చాత్య విధానాలు కల ఈ రోజులలో అటువంటి కుటుంబ కలయికలు, కుటుంబ విలువలను అధికం చేస్తాయి.
కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి?
కుటుంబంలోని వివిధ సంబంధాలు ఒక్కసారి ప్రేమానురాగాలు సంతరించుకుంటాయి. ప్రతిరోజూ అనుభవిస్తున్న జీవితాలలోని ఒత్తిడి మాయం అవుతుంది. ఈ కలయికలలో చివరకు ప్రతిరోజూ చూడటానికి అలవాటు పడిన టెలివిజన్ వంటి కార్యక్రమాలను కూడా రద్దు చేసుకొని ఆనందిస్తారు.
ఇటువంటి కలయికలలో కుటుంబ సభ్యుల అనుబంధం బాగా గట్టిపడుతుంది. సభ్యులు ఎంతో కాలంగా వారిలో వున్న సంబంధాలను మరోమారు పైకి తీసి ఆనందిస్తారు. మనసులు విప్పి కబుర్లు చెప్పుకుంటారు. పిల్లలు, ఇతర సభ్యుల పిల్లలతో కలసి మెలసి, ఇతర బంధువులతో కలసి ఆనందిస్తారు. సమాజపరంగా వీరు కొంతమేరకు నేర్చుకున్నవారవుతారు.
నేటి రోజులలో అంతటా చిన్న చిన్న కుటుంబాలే కనపడుతున్నాయి. కనుక వీరు ఒకసారి ఈ రకంగా నలుగురి మధ్యా కలసిపోతే వచ్చే ఆనందాలు వారికి గొప్ప మార్పుగా ఉంటున్నాయి. మన దేశంలో పండుగలకు కొదవ లేదు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండుగలే కాక, ఉగాది, వినాయక చవితి వంటి చిన్న పండుగలు కూడా ఎంతో ప్రాశస్త్యం కలిగి అందరిని ఆకర్షిస్తాయి. మరి అతి త్వరలో రానున్న పండుగల సీజన్ లో ప్రతి పండుగకు అందరూ కలసి ఆనందించి మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి.



Click it and Unblock the Notifications