Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అతడు నాకు తగిన వాడేనా?
డేటింగ్ మొదలు పెట్టినప్పటినుండి ఆలోచిస్తూనే వుంటారు...ఏది తప్పు ఏది ఒప్పు, అది మంచి సంబంధంగానే ఉంటుందా? విఫలమైపోతుందా వంటివి ఎన్నో మనసులోకి వస్తూంటాయి. మీరు కనుక ప్రస్తుతంలో ఆనందించేస్తే చాలు, పార్టనర్ ని ఒక పట్టు పడితే చాలు అనుకునేవారైతే, భవిష్యత్తు గురించి ఆలోచించకండి. కాని, మీరు కనుక ఒక సీరియస్ వ్యక్తితో సరాగాలు మొదలెడితే, అతడు పెళ్ళికి పనికి వచ్చే వాడేనా? ఆమె లేదా అతనితో నేను జీవితాంతం సర్దుకుపోగలనా వంటి అంశాలు ఆలోచించాలి. మహిళకు పురుషుడి మైండ్ తెలుసుకోవటం కష్టం. కనుక, అతను సరైన ఎంపికేనా? కాదా అనేది తెలుసుకోవటానికి కొన్ని మార్గాలు పరిశీలించండి.

అతను కనుక మీరున్న పొజిషన్ లో మిమ్మల్ని అంగీకరించేట్లయితే, అతనిని మీరు ఎంతవరకు సర్దుబాటు చేసుకోగలరు? అనేది ఆలోచించండి. చాలామంది పార్టనర్లు వారి భాగస్వాములను వారి అభిరుచులకు, ఇష్టాలకు అనుగుణంగా నడచుకునేలా చేస్తారు. కాని మార్పు తీసుకురావటం సాధ్యం కూడా కాదు. మీరు ఒకటి ఇష్టపడతారు. మీ పురుషుడు సాధారణంగా ఇష్టపడడు. అతను స్పందించి మీరు మార్పు కు ఇష్టపడేలా చేస్తాడు. అయినప్పటికి, మిమ్మల్ని వున్నవారిని ఉన్నట్లుగా అంగీకరించేవారు కొద్ది మంది మాత్రమే ఉంటారు. మీ పురుషుడికి మీ జీవనశైలిలో ఏ సమస్యలు లేకుంటే, ఏ అంశాలపై అతనికి భిన్నాభిప్రాయాలు లేకుంటే, అతను మీకు సరైన ఎంపిక.
ఒక సంబంధంలో పురుషుడి అహంకారం అతి పెద్ద సమస్యగా వుంటుంది. పురుషుల మేరకు, వంటగది మహిళకు చెందినది. వారు ఇంటిపని విషయంలో మహిళకు ఏ మాత్రం సహాయపడరు. అయినప్పటికి, కొంతమంది మహిళలను తమకు సమానులుగా భావించే పురుషులు కూడా లేకపోలేదు. వంటగదిలో ఆహారం వండేటపుడు లేదా మీరు ఇంటిపనిలో చాలా బిజీగా వున్నపుడు మీకు సహాయం చేసేవారైతే, అతను తప్పక మీకు వివాహభాగస్వామిగా పనికి వస్తాడు. మిమ్మల్నిప్రేమిస్తాడు.
అతను మీకు సపోర్టు ఇస్తుంటే....తరచుగా మీకు అతని సహాయంకావలసి వస్తుంది. ప్రత్యేకించి మీరు ఏదేని సమస్యలు ఎదుర్కొంటున్నపుడు అవసరమవుతుంది. అతను కనుక నిజమైన ప్రేమికుడైతే, అతను తప్పక మీకు అక్కరకు వస్తాడు. కష్టాలను ఆదుకుంటాడు. మీరు కూడా అతనికి సహాయపడటం మరియు అతని జీవితంలో ప్రతి దశలో చేయి అందించటం చేస్తార. కాని, పురుషులకు అసలు పరీక్ష మీకు ఏదేని అవసరంతో అతని సపోర్ట్ కావలసి వచ్చినపుడు. అతను మీ పక్కన వుండి మిమ్మల్నిసపోర్టు చేస్తాడా? అలాగయితే అతను మీకు సరైన ఎంపికే.
అతను వంట చేసే విధానం - సాధారణంగా పురుషులు వంటలుచేయరు. కాని, నేటి రోజులలో పురుషులు వారి కుటుంబాలనుండి దూరంగా వుంటూ బాచిలర్ గా వున్నపుడే, వంటలు నేర్చుకుంటున్నారు. మరి మీరు ఎంపిక చేసుకునే పురుషుడు, మంచి వంటగాడు అయితే, అతను మీకు వివాహానికి పనికివస్తాడని చెప్పవచ్చు. అయితే, వంట బాగా రాకపోతే, అతను మీకు తగినవాడు కాదని కూడా భావించకండి. అతని వంట ప్రయత్నాలు సరిగా వున్నాయని భావిస్తే చాలు మీరు అంగీకరించవచ్చు. అతను చేసిన వంటకాల రుచి ఏమైనప్పటికి అతను మీకై ప్రేమతో ఆ వంటకాలు చేశాడని గ్రహించండి.
ఒక పురుషుడు మీకు తగిన వాడా? కాదా? అనేది తెలుసుకోవడానికి ఈ మార్గాలు ఆచరించవచ్చు. అధికారంచలాయించాలనుకునేవారు, అవగాహన చేసికోలేనివారు మరియు మిమ్మల్నినమ్మనివారితో వ్యవహరించడం కొంతకాలం తర్వాత కష్టం అవుతుందని గ్రహించండి.



Click it and Unblock the Notifications