Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సంబంధాల సరిగమలు....పోట్లాటల పదనిసలు!
ఎవరితోనైనా సంబంధం పూర్తిగా ఏర్పడాలంటే, అది ఎన్నో రకాల దశలను దాటాలి. అపుడే అది పూర్తి పరిపక్వత పొందుతుంది. మనం ప్రేమలో పడినపుడు, బ్యాలన్స్ కోల్పోతాము. అసలు ఏం చేస్తున్నామనేది కూడా తెలియదు. ఒక సంబంధం అనేది ప్రేమ, అనుభూతి, ఆనందం మొదలైన వాటికి మించినది. సంబంధం అనేది ఒక మొక్క వంటిది. ఒక సారి విత్తనం వేస్తే, దానికి నీరు పోయాలి, సూర్యరశ్మి తగిలేలా చేసి అది పెరిగేలా చేయాలి. లేకుంటే అది అకాలంగా చనిపోతుంది. అదేవిధంగా ఒక సంబంధం కూడా బలపడాలంటే, పూర్తి పక్వానికి రావాలంటే, కొంత సమయం, దానితోపాటు మన శ్రమ పడుతుంది. అపుడే అది బలమైన సంబంధంగా ఎదుగుతుంది.

ఒక రిలేషన్ షిప్ లో అయిదు దశలుంటాయి. మీరు కనుక ఈ దశలన్నీ దాటకపోతే, బహుశ మీరు త్వరిత నిర్ణయాలు తీసుకుంటున్నట్లే భావించాలి.
1. ప్రారంభంలో - ప్రారంభంలో ప్రతి సంబంధం కూడా చాలా చిన్నదిగా ఉండి, ఎపుడు పోతుందో కూడా తెలియకుండా ఉంటుంది. మనం సరిగా ఉండాలి లేకుంటే సంబంధం పోతుంది అనుకుంటూ ఆందోళనలో ఉంటాము. వారిని సంతోష పెట్టటానికి చూస్తాము. వారి కొరకు ఎంతో శ్రమిస్తాము. కాని ఇదంతా ఎన్నో రోజులు చేయలేము. వాస్తవానికి, మీ సంబంధం కనుక మొదటి దశ దాటాలంటే, ఈ రకమైన ప్రత్యేక చర్యలు వదిలేయాలి. మరి ఈ దశ దాటాలంటే, ఒకరినొకరు బాగా అర్ధం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న అంశాలు మీ మధ్య జరగాలి. రెస్టరెంట్ లో ఆనందంగా తినేటపుడు త్రేన్పులు లేదా మీ పేంట్ జిప్ ఊడి ఆమె కంటపడటం వంటివి మీ మధ్య సంబంధం మరింత ముందుకు జరిగేలా చేస్తాయి.
2. పరిచయాలు - మీరు మీ స్నేహితులకు ఒకరినొకరు అతనను నా బాయ్ ఫ్రెండ్ లేదా ఆమె నా గాళ్ ఫ్రెండ్ అంటూ పరిచయాలు చేసుకోవాలి. అపుడే మీరు మరింత దగ్గర కాగలుగుతారు. ఎంత బాహాటంగా మీరు చెప్పుకోగలిగితే అంత బాగా మీరు దగ్గరై భధ్రత ఒకరంటే మరొకరికి అనుబంధం ఏర్పడతాయి.
3. వివాదాలు - మీ ఇద్దరి మధ్య కనీసం ఒక తగాదా అయినా సరే జరిగి విడిపోదాం అనే పరిస్ధితి రావాలి. మరల కలుసుకోవాలి. అపుడే మీ బంధం మరింత బలపడుతుంది. మీ పార్టనర్ తో మీరు ఎల్లపుడూ మంచిగానే ఉండలేరు. ఒకరినొకరు అవమానించుకొనే క్షణాలు ఎన్నో ఉంటాయి. మళ్ళీ నీముఖం చూడను డార్లింగ్ ...అంటే వెళ్ళిపోతారు. మరల వచ్చేస్తారు. ఇక్కడ ఒకరినొకరు ఎంత మిస్ అయ్యారో తెలుస్తుంది. మరో సారి కలిసినపుడు బంధం మరింత గట్టిపడుతుంది.
4. కుటుంబంలోకి స్వాగతం - మీరు ఇరువురు కుటుంబాల సభ్యులకు తెలియటం అనేది చాలా కష్టతరమైన దశ. నేడు మనం నివసిస్తున్న కాస్మోపాలిటన్ కల్చర్ లో మీవి రెడు మతాలు, రెండు కల్చర్లు బహుశ రెండు భాషలు కూడా కావచ్చు. కాని దీనికి మీ కుటుంబ సభ్యులు అంగీకారం చూపరు. అందుకుగానను తెగువచూపటం మీ వంతు అవుతుంది. కుటుంబ సభ్యులను కలిసినపుడు మీకు మీరుగా పరిచయం అవ్వండి. అతిగా పోకండి. వాస్తవాలను బయటపెట్టుకోండి. అపుడే వారిమధ్య రాణించగలుగుతారు.
5. సంబంధం సమస్యలు - ఏ సంబంధం కూడా శాశ్వతంకాదు. జీవితంలో సమస్యలు, కష్టాలు ఎన్నో వస్తాయి. మీ సంబంధంలో సంక్షోభం వచ్చినపుడే మీరు సన్నిహితులవుతారు. మీ లవర్ అంటే ఏమిటో మీకు అర్ధం అవుతుంది. ఆ సంక్షోభం ఏదేని కావచ్చు. అది మీ కుటుంబ సభ్యుల మరణం కావచ్చు, మీ ఉద్యోగం పోవటం కావచ్చు లేదా ఒక సీరియస్ జబ్బు కావచ్చు.
మీరు కనుక మీ సంబంధంలో ఈ దశలన్ని దటితే, అపుడు ఇక మీరు వివాహానికి ప్రతిపాదన చేసుకోండి.



Click it and Unblock the Notifications