Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్ళికి పనికి రాడనేందుకు లక్షణాలు?
ఎల్లపుడూ సరసాలాడుతూ నవ్వుతూ ఉండే అతని లక్షణమే మిమ్మల్ని అతనిని ప్రేమించేలా చేసింది. మిమ్మల్ని వల్లో వేసుకోవడమే కాదు. ఇతర మహిళలపై కూడా కన్నేసి సరసాలాడేస్తున్నాడు. పైగా తాను ఏ మాత్రం కీడు చేయనంటూ హామీలిచ్చేస్తున్నాడు. ఈ తరహా వ్యక్తులతో ఏదో ఒకరోజు మీరు శారీరకంగా సంబంధం ఏర్పరుచుకోవడం లేదా సన్నిహితంగా ఉండిపోవటం జరుగుతాయి. అంతే కదా మరి, అయితే కాకపోవచ్చు కూడాను. అతను ఆ పని చేస్తాడా? చేయడా?చేస్తే సరైనదేనా, కాదా? ఒక పురుషుడు పెళ్ళికి పనికి వస్తాడా లేదా అనేందుకు కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి.

అతనికి మీరంటే ఒక పరికరం - మిమ్మల్ని ఎపుడూ విమర్శిస్తూంటే, లేదా మీ అందాన్ని నిరంతరం పొగడుతూంటే, అతను మీ అందానికే ప్రాధాన్యత ఇస్తాడు. మీరు అతనికెపుడు మతిపోయేటంత అందంగా కనపడాలి. మీరు నిద్రించినా, రోజంతా అలసి పనిచేసినా...ఏం చేసినప్పటికి అతనికి మీరు అందంగా కనపడుతూ ఒక కప్పు కాఫీ అందించాలి. ఇటువంటి వారితో పెళ్ళి పనికిరాదు.
ఎపుడూ సరసాలే - అతను ఎపుడూ సరసాలాడే వాడు కనుకనే మిమ్మల్ని ఆకర్షించాడు. కాని అతను ఇంకా ఇతర మహిళలతో అలానే కొనసాగిస్తూంటే, మరేం పరవాలేదని మీకు చెపుతూంటే, అతనిని మీరైనా వదిలేయాలి. లేదా అతను మిమ్మల్ని అయినా వదిలేయాలి.
ఆకర్షణ - ముందుగా ఇద్దరిని దగ్గరకు చేర్చేది శారీరక ఆకర్షణ మాత్రమే. మీరు నిజంగానే అతనికి ఆకర్షించబడ్డారా? లేక ఒంటరిగా ఉండబట్టి ఆకర్షణ కలిగిందా? బోర్ కొట్టేసి అతనితో సెక్స్ కావాలనుకున్నారా? బోర్ కొట్టేసి సెక్స్ కావాలనుకుంటే మీరను అతనికి ఆకర్షించబడలేదు. ఇక ఆకర్షించరు కూడాను. మరి ఆకర్షణ కలిగించే వారితో మీరు సెక్స్ చేసి అతడిని వదిలేయటమే.
సెక్స్ అంశాలు - మీ సంబంధం సెక్స్ వరకే లేదా శారీరకం అయితే, అతను పెళ్ళికి పనికిరానట్లే. ఇక మీరు ఇద్దరు ఎంత బాగా సెక్స్ సంబంధం కలిగి ఉన్నా అది మిమ్మల్ని కలిపి ఉంచలేదు. ఇక పెళ్ళికి ముందే మీరిద్దరు సెక్స్ చేయాలనుకుంటే ఆ సెక్స్ మీ శరీర వేడిని మాత్రమే తెలియజేస్తుంది.
డబ్బు అంశాలు - అతనికి ఖచ్చితమైన ఉద్యోగం లేదు. ఉద్యోగాలు ఎన్నో మారాడు. ఎందులోను స్ధిరంగా లేడు. ఖర్చు బాగా చేస్తాడు. కొనేవి అన్ని బ్రాండెడ్ వస్తువులే, తాగుడు, పేకాటలకు ఖర్చు. పెట్టుబడి అనేది లేదు. ఉద్యోగం లేదు. జాబ్ కొరకు ప్రయత్నించడు. వీటిలో ఏ ఒకటి ఉన్నా, ఇంకా మీరు అతడిని ఇష్టపడుతూంటే, మీ సంబంధాన్ని అందరి ముందు ఒప్పుకుంటూ పెళ్ళాడాలి. లేదా అతడిని వదిలేయాలి.
అతడికి పెళ్ళి పట్ల ప్రణాళిక లేదు - అతను ఇంకా చదువు, ఉద్యోగాన్వేషణలలో ఉంటే, పెళ్ళికి రెడీ కాకుంటే అతను మీకు పెళ్ళికి పనికిరాడనే చెప్పాలి.
చిన్న పిల్లాడిలా - పెళ్ళి అంటే, సిగ్గుపడి అవతలకు పోవటం, పసి పిల్లాడిలా ప్రవర్తించటం, వంటివి చేసి ఏ మాత్రం పెళ్ళి భాధ్యత తెలియకుండా ఉంటే, అతను పెళ్ళికి పనికిరాడు.
తల్లిచాటు పిల్లాడి ప్రవర్తనా? - 20 ఏళ్ళు వచ్చేశాయి. ఇంకా తల్లి చాటు ప్రవర్తనే. అమ్మ ఎలా చెపితే అలా? ఏదడిగినా మా అమ్మకు చెప్పి చేస్తానంటాడు. అటువంటి వాడు మీతో పెళ్ళికి పనికిరాడు.
చవకబారు కుటుంబం - అతని కుటుంబ సభ్యులను మీరు కలిశారు. అంతా అదో రకంగా మీ హోదాకు తక్కువగా ప్రవర్తస్తున్నారు. నాటకీయంగా ఉన్నారను. మీ పైన అధికారం చెలాయించాలని చూస్తున్నారు. అతను అన్నిటికి తాళం వేస్తున్నాడు. అటువంటపుడు అతడు మీకు పెళ్ళికి పనికి రాడనే తీర్మానించుకోండి.
వాగ్దానాలు భంగం - సమయానికి రాడు. చేసిన వాగ్దానాలు నిలుపుకోలేడు. ఎంత చిన్నవైనా సరే దాట వేస్తాడు. ఇచ్చిన మాటలు చాలా తేలికగా తీసుకుంటాడు. మీరంటే లెక్క లేనట్లు ఉంటాడు. మరి ఇటువంటి పురుషులు మీకు పెళ్ళికి పనికిరారని గ్రహించండి.
పై అంశాలన్నిటికి పరీక్షిస్తే నెగెటివ్ వచ్చి అప్పటికి మీ అంతరాత్మ కనుక అతను వద్దు...అంటూ ఉంటే అతడు మీతో పెళ్ళికి పనికి రాడని పక్కన పెట్టేయండి.



Click it and Unblock the Notifications