Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
సారీ చెప్పు.....స్టోరీ ముగించు!

మరి మీ గౌరవం కాపాడుకోడానికి, మీ సంబంధం సవ్యంగా సాగేలా చూసుకోడానికి కొన్ని పరిస్ధితులలో సారీ చెప్పేయడం అవసరం. అటువంటి పరిస్ధితులేమిటో పరిశీలించండి.
మీరు టికెట్లు బుక్ చేసిన సినిమా 7 గంటలకు. కాని మీరు ఇంటికి వచ్చింది 8 గంటలకు. బ్యాడ్ లక్ అంటే....టికెట్లు కూడా మీ వద్దే ఉన్నాయి. మీ డార్లింగ్ ఫైర్ కాకూడదనుకుంటే, సంబంధం మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే.... కోపంతో దహించుకుపోయే మీ ప్రేయసికి మీ మొదటి మాట ....సారీ డార్లింగ్...అనాల్సిందే. ఆపై తర్వాతి షో కి టికెట్లు కొనటం మీ అజాగ్రత్తకు పశ్చాత్తాప పడటం చేయాలి.
ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ మ్యాచ్ చూశారు. ఇంటికి వచ్చి ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉందని ఆఫీస్ లో ఉన్నానని చెప్పారు. కాని మీ భార్య మిమ్మల్ని మీరు గ్రౌండ్లో క్రికెట్ చూడటం చూసింది. తప్పదు. సారీ చెప్పేయండి. వెంటనే దీనంగా ముఖం పెట్టేయండి. సంబంధం మరోమారు సేవ్ అయినట్లే.
ఇంటిలో ఆమె రుచికరమైన అన్ని వంటకాలు చేసింది. మీరు ఫ్రెండ్స్ తో బయట తినేశారు. కాని అసలు విషయం ఆమె రాత్రికి సర్ ప్రైజ్ డిన్నర్ హబ్బీ అని చెప్పినప్పటికి మీరు దానిని మరచిపోయారు. మరి ఖచ్చితంగా ఆమెకు మీరు సారీ చెప్పేసి ఆ సంఘటన నుండి బయటపడాల్సిందే. మరి మీ పార్టనర్ కనుక దగ్గరుండి మరీ నోటిలోకి ఆహారాన్ని తోసేస్తే....మీ పొట్టకు సైతం సారీ చెపుతూ తినేయండి. ఎందుకంటే, మీ పొట్ట తర్వాత గడ బిడ అనుభవించాల్సిందే.
మీ పార్టనర్...డార్లింగ్ నా కారు తీయవద్దు అంటూ ఎన్నో సార్లు చెప్పాడు. కాని తీశారు. టాప్ గా వేరే కారుని గుద్దేసి అతని కారు పెయింటంతా పాడు చేశారు. మరి తగవు పెరగకుండా, అతను అడగకుండానే అతనికి సారీ చెప్పేయండి. ఎంతోకొంత అతనిని మురిపించేయండి.
ఎయిర్ పోర్టులో అతడిని పికప్ చేయటం మరిచారా? ఆ విషయం మరచి నిద్రపోయారా? అతను అక్కడ టాక్సీ దొరకక ఇబ్బందులు పడి ఇంటికి చేరాడా? ఈ సమయంలో....ఏం చేయాలి? అతను డోర్ బెల్ కొట్టగానే ...సారీ డార్లింగ్ అంటూ ఒక కార్డు పూలగుత్తికి పెట్టి అతను ఇంటిలో అడుగు పెట్టగానే ఇచ్చేయండి.
సారీ చెప్పటం మీ అహాన్ని అడ్డగించదు. ఎందుకంటే, ఎవరు ఓడినా? ఎవరు గెలిచినా, ఒక జంటగా లేదా భార్యా భర్తలుగా గెలిచేది ‘మీరే'.



Click it and Unblock the Notifications