Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భార్యాభర్తల మధ్య బంధాన్ని తెంచుతున్న ‘దూరం’

చూడ్డానికి, వినడానికి చాలా సిల్లిగా ఉన్నా బంధాలు, భాందవ్వాలు తెంచుకుంటున్నారు. ఒంటరిగానైనా బతికేందుకు సాహసిస్తున్నారు. కానీ తగాదాలతో బతకాలనుకోవడం లేదు. అందుకు కారణం భార్యభర్త ఇద్దరూ ఎక్కువగా చదువుకొని పట్టణనాగరికతకు అలవాటు పడి ఉండటం లేదా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం వల్ల కూడా ఇద్దరి మధ్య అన్యోన్యత కరువౌ ఒకరినొకరి దూరం చేసుకొని చాలా నష్టపోతున్న జంటలు మన కళ్ళ ముందే మన పరిసరాల్లోనే చాలా మంది జీవిస్తున్నారు.
ఉదాహరణకు భార్యభర్త ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఆఫీసు నుంచి ఇంటకి చేరుకోవడానికి మీకు ఒక గంట కంటే ఎక్కువ సమయం పడుతుందా? ట్రావెలింగ్ లోనే ఎక్కువ సమయం గడిచిపోతోందా? అయితే మీ వైవాహిక బంధం ఇరుకున పడ్డట్టే. కొత్తగా పెళ్లయిన జంటల్లో ఈ సమస్య తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణానికి, వైవాహిక బంధానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోకండి....
పెళ్లయ్యి రెండు మూడేళ్లు అయ్యి... ఇంటికి ఆఫీసుకి మధ్య దూరం ఎక్కువగా ఉండి.. ఇల్లు చేరేందుకు ఎంత లేదన్నా కనీసం ఒక గంట సమయం పడుతుంటే కనుక మీరు జాగ్రత్తపడాల్సిందే.. ఎందుకంటే ఈ ఆలస్యమే కొత్తగా పెళ్ళయిన భార్యా భర్తల మధ్య దూరాన్ని పెంచుతోందట. దూర ప్రయాణాలు గొడవలకి ఫ్లాట్ ఫామ్ గా మారుతున్నాయంటున్నారు లండన్ పరిశోధకులు.
తనను అలుసుగా తీసుకోవడం వల్ల భర్త ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని భార్య అనుకుంటుంది. దాంతో ఇద్దరి మధ్యా అడ్డుగోడలు ఏర్పడడం మొదలవుతుంది. అంతే కాకుండా ఉద్యోగం చేసే భార్యను ఇంటికి దగ్గరగా ఉండాలనే నెపంతో అప్పటికే ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని మాన్పించి తక్కువ జీతం వచ్చేదయినా సరే వేరే ఉద్యోగంలో చేర్పిస్తున్నారు.
దీని వల్ల తక్కువ జీతమే కాకుండా ఇంటి బాధ్యతలన్నీ ఆమెపైనే పడతాయి. ఇంకేముంది ఆమెలో డిప్రెషన్ మొదలవుతుంది. ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. చిన్ని చిన్న గొడవలే గాలివానగా మారి విడాకులకు దారితీస్తున్నాయి. పరిస్థితులు. కాబట్టి అందమైన జీవితాన్ని దూరం పేరుతో ఇంకా దూరం చేసుకోవడమెందుకు ఆఫీసుకి దగ్గరగా ఇల్లు తీసుకుంటే పోలా....



Click it and Unblock the Notifications