For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాటలతో చెప్పలేని వాటిని చిన్న కౌగిలితో చెప్పొచ్చు...!

|

సాధారణంగా ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలిసినప్పుడు చేసేపని ఒకరినొకరు ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం. నిద్ర నుంచి మేల్కొన్న బిడ్డ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. భర్త తనకు గల అపార ప్రేమను భార్యను దగ్గరకు తీసుకుని వ్యక్తం చేస్తాడు. ప్రేమాభిమానాలు, కరుణ, వాత్సల్యం, ఆప్యాయతలకు విశ్వజనీన వ్యక్తీకరణ కౌగిలింత, మృదువుగా దగ్గరుకు తీసుకోవడం నుంచి గాఢంగా హత్తుకోవడం దాకా అనేక రకాలు, పద్దతులు, సరైన మార్గాలు ఉంటాయి. వివిధ సంబంధ బాంధవ్యాలలో ఆ యాకౌగిలింతల పద్ధతలుల ద్వారా అభిమానాన్ని తెలియజెప్పాలి.

ప్రేమ ఆప్యాయత, సంతోషం, దు:ఖం, క్షమార్పణ అన్నింటినీ ఒక్క కౌగిలింత వ్యక్తం చేస్తుంది. కౌగిలించుకున్నాక 20సెకన్లకు మహిళల మెదడు సహజంగానే సంతోషాన్ని ఇచ్చే‘ఆక్సిటోసిన్' హార్యోన్ ను విడుదల చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు హత్తుకున్నప్పుడు మెదడులోని విశ్వజనీన సర్క్యూట్లను నొక్కి వదులుతాయి. భార్యాభర్తలు లేదా సౌకర్యవంతమైన హగ్ కాకపోతే కనుక కొన్ని రకాల కౌగిలింతలకు బ్రెయిన్ ట్రస్ట్ సర్క్యూట్లను ఉద్దీప్త చేయడానికి కొంత మమయం పడుతుంది. అన్ని సందర్భాల్లో, అన్ని రకాల వ్యక్తుల నడుమ ఎన్నో రకాల కౌగిలింతలుంటాయి అవి...

Tpes of Hugs and What they Mean...!

సైడ్ టు సైడ్ హగ్: ఇద్దరు వ్యక్తులు ఒకరిపక్కన ఒకరు నిలబడి నడుం చుట్టూ లేదా భుజాల చుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకుంటారు. ఈ రకం కౌగిలింత సహజంగా స్నేహితులు లేదా ప్రేమికుల నడుమ ఉంటుంది.

హోల్ హగ్: ఇది సాధారణంగా కొంత కాలం పాటు కనిపించని ఫ్రెండ్స్ కు ఇచ్చే కౌగిలింత, ముందస్తుగా తెలపని అత్యతం సాధారణ, స్టాండర్డ్ కౌగిలింత, సాధారణంగా కొద్దిసెకన్లు మాత్రమే సాగుతుంది. ఒక ముంజేయి లేదా రెండు చేతులూ వాడి కౌగిలించుకుంటారు. కొద్దిసేపు, కొద్దిపాటు ఆప్యాయతనిచ్చే ఆలింగనం.

రివర్స్ హగ్: ఈ రకం కౌగిలింతలో కౌగిలించుకున్న వ్యక్తి వెనుకనుంచి తన ముంజేతిని కౌగిలిలో ఇమిడిన వారి నడుము చుట్టూచుడతారు. రొమాంటికి బాంధవ్యం గలవారి నడుమ ఈ కౌగిలింత రిజర్వ్ అయ్యివుంటుంది. ముఖ్యంగా రెండు శరీరాల నడుమ పూర్తి సన్నిహిత కాంటాక్ట్ ఉన్నవారి నడుము ఉంటుంది. ైతే తల్లిదండ్రలు, పిల్లల మధ్య కూడా ఈ రకం కౌగిలింతలుంటాయి.

కంఫర్టర్ హగ్(ఓదార్పు): సన్నిహిత వ్యక్తిని ఓదార్చుతూ దగ్గరకు తీసుకునే కౌగిలింత ఇది. స్టాండర్డ్ హగ్ ను పోలివుంటుంది. ఇది సాధారణంగా తల్లిదండ్రలు, సన్నిహితమిత్రలు నడుమ ఒకరికొకరు ఓదార్చుకుంటూ జరుగుతుంది. కౌగిలిలో వున్న వ్యక్తి కౌగిలించుకున్న వ్యక్తి భుజంపై లేదా ఛాతిపై సానుభూతి వాంచిస్తూ తల ఆనిస్తారు.

పౌండ్ హగ్: ఈ రకం కౌగిలింత చాలా భాగం ఇద్దరు పురుషుల నడుమ ఉంటుంది. హ్యాండ్ షేక్, ఓ చేత్తో దగ్గరకు తీసుకోవడం కలసి ఉంటాయి. కౌగిలించుకొన్నప్పుడు ఒకరి నొకరు వీపుపై భావోద్రేకంతో తట్టుకుంటారు. వారి పురుష లక్షణాన్ని చాటినట్టు ఈ విధంగా తడతారు. ఈ కౌగిలింత సాధారణంగా ఓ సెకను సాగుతుంది. అంతకంటే ఎక్కువసేపు సాగితే అసౌకర్యంగా ఫీలవుతారు.

బేర్ హగ్: ఇది అత్యంత దృఢంగా ఉండే ఆలింగనం. పూర్తి శరీరాన్ని కౌగిలించుకుంటారు. ఈరకం కౌగిలింత సాధారణంగా కుటుంబ సభ్చుల, సన్నిహిత స్నేమితులు, ప్రేమికలు నడుమ ఉంటుంది. కౌగిలించుకున్న వ్యక్తి, కౌగిట్లో ఇమిడిపోయిన వ్యక్తి వారివారి ముంజేతుల్ని బిగుతుగా ఒకరి చుట్టూ ఒకరు బిగిస్తారు. ఎంత గాఢంగా కౌగిలించుకుంటే అంత ఆప్యాయతను రాగాల్ని వ్యక్తం చేస్తారన్న మాట. స్టాండర్డ్ హగ్ కంటే ఈ కౌగిలింత కొద్దిగా ఎక్కువ సేపు సాగుతుంది.

మి హగ్: పేరులో ఉన్నట్లే ఎవరిని వారు హత్తుకోవడం. రెండు ముంజేతులనూ రెండు భుజాల చుట్టూ గట్టిగా బిగించి స్వయంగా హత్తుకోవడం. వ్యక్తిగత సంతోషం, ఉత్సాహం కలిగినప్పుడు చేసే చర్య ఇది.

ఎ ఫ్రేమ్ హగ్: ఇద్దరు వ్యక్తులు పాదాలు ఒకరికొకరు ఎదురుబొదురగా ఉంచి నడుము కొద్దిగా ఒంచి కౌగిలించుకుంటారు. భుజాలు మాత్రమే కలిసే ఆలింగనం. సాధారణ పరిచయస్తులు లేదా అప్పుడే కలిసినవారు ఈ విధంగా కౌగిలించుకుంటారు. గాఢంగా కౌగిలించుకోవడం పట్ల సంశయం ఉన్న మగవారు కూడా ఈ విధంగా కౌగిలించుకుంటారు. కౌగిలింతలలో వ్యక్తులు పాటించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి అవి...

1. ఇంకొకరి వ్యక్తిగతాన్ని ఎల్లవేళలా గౌరవించాలి.
2. ఎవరినైనా హగ్ చేసే ముందు అంటే ఎదుటి వ్యక్తితో అంత సాన్నిహిత్యం లేనప్పుడు వారి అనుమతిని తీసుకోవాలి.
3. కౌగిలింతను బట్టి తేడా చూపాలి. ఫ్రెండ్లీ కౌగిలింతకు, శృంగారపూరిత కౌగిలింతకు నడుమ వ్యత్యాసం ఉంటుంది. శృంగార జంట నడుమ ఆలింగనం అప్పుడే కలిసిన వ్యక్తుల కౌగిలింతకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
4. ఇంతకు సదరు వ్యక్తిని ఎన్ని సార్లు కౌగిలించుకుని ఉన్నప్పటికీ ఆ వ్యక్తిని తిరిగి కౌగిలించుకోవడం ఫర్వాలేదనుకోవడం సరికాదు.
5. పరిశుభ్రత అవసరం. శరీరం నుంచి దుర్వాసన ఎదుటి వ్యక్తిని చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త అవసరం...

English summary

Tpes of Hugs and What they Mean...! | కొంటె కౌగిలి వెనుక సీక్రెట్ తెల్సా..?

Reading body language: There are many mysteries on this planet that has baffle people and scientists for years and that is understanding or reading the body language when hugging.
Desktop Bottom Promotion