Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
ప్రేమికుల రోజున మీ ప్రేయసికి ఇచ్చే బహుమతులు...
ప్రేమికుల రోజున ఇచ్చే చిన్న కానుకలైనా ..ప్రేమబంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి. వాలెంటైన్ డే రోజున ప్రేమికులు ఒకరికొరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని తమలోని ప్రేమ బంధాన్ని తెలుపుతుంటారు. తమ హావ, భావాలను వ్యక్తీకరించే విధానాన్ని జీవితంలో ఎన్నడూ మరిచిపోలేరు. అలాంటి ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించే ప్రేమికుల రోజున మీ ప్రేయసి లేదా ప్రియుడికి మంచి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా..
వాలెంటైన్ డే దగ్గిర పడుతున్నకొద్ది జంటలు తమ ప్రియుడికి ఏ రకమైన బహుమతులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలా అనే ఆలోచిస్తూంటారు. పురుషులకు, తమ మహిళలు తమనుండి ఏ రకమైన బహుమతులు కోరతారు, మహిళలు తమ పురుషులు ఏ బహుమతులు కోరతారు అనేది వారికి తెలిసిపోతూనే వుంటుంది.
మీ ప్రేయసికి ప్రేమికుల రోజు జీవితమంతా గుర్తుండిపోయేలా చేయాలనుకుంటున్నారా? మేమిచ్చే ఆకర్షణీయమైన కొన్ని ప్రేమ బహుమానాలు పరిశీలించండి. ప్రతి బహుమానం వెనుకా మీ ప్రేయసిపై మీ కెంత ప్రేమ వుందో తెలుపండి. సూచించే ప్రేమికుల రోజు బహుమానాలు వ్యయం తక్కువే కనుక మీరు వాటిని చక్కగా ఆచరించేయవచ్చు.

రింగ్: బడ్జెట్ ఎక్కువుగా ఉంటే ఏదైనా లవ్ సింబల్ ఉండేటట్లు నగలను కొనివ్వడం లేదా ప్రేమికుల ఇద్దరి పేర్లు ఉండేటట్లు ఒక రింగ్‌ను ఇచ్చి ఐ లవ్ యూ చెప్పండి. ఈ నగలు లేదా ఉంగరాలు నిన్ను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా నిన్ను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉంటాను అని చెప్పండి. ఇవిధంగా మీ ప్రేమను వ్యక్తపరచండి.

డ్రింక్: పురుషులకు డ్రింక్ చేయటం ఇష్టం. కనుక ఒక బాటిల్ బీర్ లేదా మరొకటి బహుమతిగా ఇవ్వండి.

రొమాంటిక్ డిన్నర్: మీరు ఏ బహుమానం ఇచ్చినప్పటికి ఒకచక్కటి కేండిల్ లైట్ డిన్నర్ ఆమెకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఇచ్చేయండి. డిన్నర్ సమయంలో వుండే చక్కటి బ్యాక్ గ్రౌండ్ వీనుల విందు సంగీతం ఆమెకు మరింత ఆహ్లాదాన్నిస్తుంది.

మొబైల్: ప్రస్తుత జనరేషన్ లో యువతి యువకులని ఎక్కువగా ఆకర్షింపబడుతున్నవి మొబైల్ ఫోన్స్. ఆమెకు /అతనికి నచ్చిన మొబైల్ ఫోన్ తెలియకుండా కొని, గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరచండి. మహిళలు ఇష్టపడేవి పూవులైతే, పురుషులకు కొన్ని వస్తువులు ఇష్టంగా వుంటాయి. వీరికి అవసరమయ్యే వీడియో గేములు లేదా మంచి మ్యూజిక్ పరికరాలు, ఐ పాడ్ లు వంటివి ఇష్టంగా వుంటాయి. కనుక ఐ పాడ్ వంటిది ఒకటి కొని ఇచ్చేయండి.

పెర్ఫ్యూమ్: సువాసనల సెంట్లు అంటే పురుషులకు చాలా ఇష్టం. కొన్ని పేరొందిన సువాసన బాటిల్స్ కొని ఇవ్వండి. అతనికిష్టమైన బ్రాండ్ ఏదో తెలుసుకొని ఇవ్వండి.

రిస్ట్ వాచ్: బ్రాండెడ్ వాచ్ అంటే వీరికి ఇష్టంగా వుంటుంది. కంటికి ఘనంగా కనపడే వాచ్ కొని ఇవ్వండి. ఎన్ని వున్నప్పటికి వాచ్ తప్పక ధరిస్తాడు. అతనికి లెదర్ బెల్ట్ వున్న వాచ్ కావాలా లేక స్టీల్ ఛైన్ వుండే వాచ్ కావాలా అనేది తెలుసుకొని దానిని బహుమతిగా అందించండి.

పూలు, చాక్లెట్లతో స్వాగతం చెప్పండి: సాధారణంగా మహిళలు, పూలు, చాక్లెట్లు ఇష్టపడతారు. చాక్లెట్లు కామోద్దీపన పదార్ధాలుగా పని చేసి జరుగబోయే హాట్ హాట్ రాత్రికి కూల్ కూల్ గా వుంచుతాయి.

మ్యాన్ కుక్కింగ్: ప్రియాతి ప్రియమైన మీ భార్య లేదా ప్రేయసి కొరకై కొంత సమయం వెచ్చించి ఆమె కిష్టమైన వంటకం స్వయంగా చేయండి. దీనిని ఆమెకు బహుమతిగా అందిస్తే ఆమె మనసును మీరు దోచుకున్నట్లే.

రెడ్ డ్రెస్స్: ఎర్రటి దుస్తులను ఆమెకు బహుమతిగా ఇవ్వండి. సందర్భానికి తగిన ఎరుపు ఆమెకు మంచి కిక్ ఇస్తుంది. మీ ప్రేయసి మిమ్మల్నే కాదు. పార్టీలోని అందరిని ఆకర్షిస్తుంది. సాధారణంగా ప్రేమికుల రోజును ప్రేమకు గుర్తుగా ఎరుపు, పచ్చరంగులను ధరిస్తారు. ఇలా కాకుండా మరే డ్రెస్ ధరించినా మంచి కాంతివంతమైన రంగులు ఉన్నవి, లేత రంగులు ఇష్టపడేవారైతే అందులోనే బ్రైట్ షేడ్స్ ఉన్నవి ఎంపిక చేసుకోవాలి.

జిమ్ ఓచర్/గిప్ట్ ఓచర్: ప్రేయసికి జిమ్ అంటే లేదా స్పా అంటే ఇష్టమైతే జిమ్ గిఫ్ట్ ఓచర్ లేదా ఆమెకు ఒక గిఫ్ట్ ఓచర్ బహుమానంగా ఇచ్చేయండి. వేలంటైన్ రోజుకు మీ భార్య లేదా భాగస్వామి ఎంతో రిలాక్స్డ్ గా వుంటారు.

గులాబీ పువ్వుల గుచ్చు: ఈ ప్రేమికుల రోజు నాడు మీరు ఇచ్చే బహుమతి సింపుల్‌గా ఉండాలంటే ఒక గులాబీ పువ్వుల బోకే ఇచ్చి ఐలవ్ యూ చెప్పండి. గులాబీ ప్రేమకు చిహ్నం అని, గులాబీ ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో అలాగే మన ప్రేమను కూడా అంత అందంగా తీర్చుదిద్దుకుందాం అని ఒక్క మాట చెప్పండి. దానితో మీ సింపుల్‌సిటి ఆమెకు నచ్చుతుంది.

లవ్ లెటర్: మీ చెతిలో డబ్బులు లేవా...ఈ ప్రేమికుల రోజుకు గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నానే అని బాధ పడుతున్నారా...? ఎటువంటి బాధ పడకుండా ఒక ప్రేమ లేఖ రాయండి. అందులో మీ తొలి పరిచయం, మీ ఇద్దరు తిరిగిన ప్రదేశాలు, మరిచిపోలేని సంఘటనలు గురించి రాయండి. తద్వారా మీకు ఆమె ఎంత ప్రత్యేకమో తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని గుర్తించుకుని చెప్పడం ద్వారా ఆమెపై మీకున్న శ్రద్ద అర్థమౌతుంది.
పై విధాలలో మీరు ఏదో ఒక పద్ధతిని ఎంచుకుని ఈ ప్రేమకుల రోజున మీ ప్రియురాలి ప్రేమను పొందండి.



Click it and Unblock the Notifications