Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ పెళ్ళి రోజును ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు...!
ప్రతి ఒక్కరి జీవితంలో వార్షికోత్సవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవి పెళ్లిరోజు వార్షికోత్సవం కావచ్చు, డేటింగ్ వార్షికోత్సవం కావచ్చు లేదా మరేదైనా ప్రముఖమైన సందర్భాన్ని పురస్కరించుకుని చేసుకునే వార్షికోత్సవాలు కావచ్చు. బయటికి వెళ్ళి డబ్బులు వృధా చేసుకునేకంటే ఇంట్లోనే వీటిని ఏంతో మధురమైన అనుభూతిని మిగిల్చేలా సంబరాలు చేసుకోవచ్చు.
వార్షికోత్సవాన్ని మధురమైన అనుభూతిగా ఎలా మిగుల్చుకోవాలో తెలుసుకుందామా..
1. మీ భాగస్వామి తో కలిసి ఈ ప్రత్యేక సందర్భాన్ని ఎంత మధురంగా, ఆనందంగా గడపవచ్చో చర్చించండి. కాండెల్ లైట్ డిన్నెర్ లేదా మరేదైనా సరే మీరిద్దరూ కలిసి ప్రణాళికని రూపుదిద్దుకోండి.
2. ఇద్దరూ కలిసి ఆనందంగా పాల్గొనే ఆక్టివిటీస్ ని తయారుచేసుకోండి. మీకు గత సంవత్సరం యోక్క మధురానుభూతులు గుర్తుకువచ్చేలా ఆక్టివిటీస్ ని ప్లాన్ చేసుకోండి. డేటింగ్ మొదలు పెట్టినప్పుడు ఆడిన ఆటలని ఆ తీయని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మరలా ఆడండి. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోండి.
3. ఇంట్లో భోజనం తయారు చేసే సమయంలో మీ భాగస్వామి కి ఇష్టమైన పదార్ధానికి ప్రాధాన్యత నివ్వండి. ఏదైనా ప్రత్యేక సందర్భంలో మీరు బయటకి భోజనానికి వెళ్ళినప్పుడు మీ భాగస్వామి తరచూ ఇష్టంగా ఆర్డర్ చేసే వంటకాన్ని తయారు చెయ్యండి.
4. మీ ఇద్దరూ కలిసి ఈ వేడుకని సంతోషంగా జరుపుకోండి. ప్రతి రోజు మిరిద్దరే కలిసి గడుపుతున్నా ఈ రోజు ప్రత్యేకమైన రోజని గుర్తుంచుకుని ఒకరితో ఒకరు ఆనందంగా గడపండి.
5. కొన్ని కొవ్వొత్తులని వెలిగించండి. ఒక వైన్ బాటిల్ ని ఓపెన్ చెయ్యండి. ఒక వేళ మీరు వైన్ త్రాగకపోతే, ఏదైనా పళ్ళ రసాన్ని తీసుకోండి.

చిట్కాలు
ఇద్దరూ కలిసి ప్రత్యేకమైన సందర్భాలను ఆనందంగా జరుపుకోవడం వల్ల ఎంతో సంతోషాన్ని పొందుతారు.
ఈ సందర్భాల్ని ఆనందంగా జరిగేలా జాగ్రత్తపడండి. ఇది ఆనందోత్సాహాలతో నిండవలసిన రోజు కాని ఒత్తిడి తో నిండవలసిన రోజు కాదని గుర్తుంచుకోండి.
బయటికి వెళ్లి డబ్బులు వృధా చేసుకుంటే, ఆ డబ్బులతో మీ భాగస్వామి ఎప్పటి నుండో కావాలనుకుంటున్న వస్తువుని కొని బహుమతిగా ఇవ్వండి.
ఒక వేళ మీ భాగస్వామి కి ఆశ్చర్యం కలిగించేలా ఇంట్లో వార్షికోత్సవాన్నిమీరు ప్లాన్ చేసినట్టయితే, మీ భాగస్వామి యొక్క షెడ్యుల్ ని తెలుసుకోండి.
మీరిద్దరూ ఏకాంతంగా సమయం గడిపేటప్పుడు మీ ఫోన్స్ నుండి మీకు డిస్టర్బెన్స్ కలుగకుండా వాటిని స్విచ్ ఆఫ్ లో ఉంచండి.
జాగ్రత్తలు
ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయాలనుకుంటే మాత్రం ఇంట్లో వార్షికోత్సవం జరుపుకోవడాన్ని ప్లాన్ చేయకండి.



Click it and Unblock the Notifications