Latest Updates
-
మష్రూమ్ చికెన్ మసాలా..కిర్రాక్ టేస్ట్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె లేకుండా 'దహీ భల్లా'.. రుచికి రాజీ లేదు, ఆరోగ్యానికి డోకా లేదు! -
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
ఈరోజు రాశి ఫలాలు (20.03.26): శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు!
మీ బాయ్‌ఫ్రెండ్‌ను భర్తగా మార్చేందుకు శిక్షణ ఇవ్వండి..!
సాధారణంగా బాయ్ ఫ్రెండ్ నుండి భర్తగా మారడం అనేది అంత సులవైన పనేం కాదు. ఎందుకంటే అప్పుడప్పుడే యవ్వనంలోనికి అడిగిడుతూ అపరిపక్వంగా ఉన్నవారు కొత్త బాధ్యతలను స్వీకరించడానికి కొంచె కష్టంగా ఫీలవుతారు. కాబట్టి మీ బాయ్ ఫ్రెండ్ కు కొంత శిక్షణ ఇవ్వాల్సి బాధ్యత మీకు ఉంటుంది. భర్తగా పొందడానికి ముందే కొన్ని బాధ్యతలను అప్పగించాలి. మీ బాయ్ ఫ్రెండ్ మీకు మ్యారేజ్ మెటీరియల్ కావచ్చు , అయితే భర్త అయిన తర్వాత మీకు కావల్సిన లక్షణాలు లేదా బాధ్యతలు అతనిలో కలిగి ఉండకపోవచ్చు. దానికి మీరు చింతించాల్సిన పనిలేదు. అందుకు కొన్ని శిక్షణా పద్దతులున్నాయి.
భర్తకు ఉండవల్సిన లక్షణాలు మీ బాయ్ ఫ్రెండ్ లో ఏదో ఒక మూల దాగి ఉండవచ్చు. దాని నైపుణ్యం లేకుండా ఉండవచ్చు. అందుకు మీ బాయ్ ఫ్రెండ్ కు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల ‘భర్త లక్షణాలు' మెరుగుపరుచుకోవచ్చు. మీరు ఒక వ్యక్తిని కలిసినప్పుడు, అతను ఒక ముద్దపప్పులా కనిపించాడనుకోండి.. అతనితో మీరు సెటిల్ అవ్వాలనుకుంటే..మీ ముఖ్యమైన పని అతన్ని మీకు తగ్గ భర్తగా ఉండాల్సిన లక్షణాలతో డెవలప్ చేయడమే..మీ బాయ్ ఫ్రెండ్ కు మంచి శిక్షణ ఇవ్వడానికి మీరు ప్రయత్నించినట్లైతే...అతనే మీ ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్'మ్యారేజ్ తర్వాత కూడా..
ఇటీవలే విడుదలైన 'బాయ్‌ఫ్రెండ్ ట్రైనర్' అనే మొబైల్ అప్లికేషన్ పట్ల భారీ ఎత్తున క్రేజ్ నెలకొంది. ఏదేమైనప్పటికీ, శిక్షణ అనేది ఎంతో ఉపయోగకరమైనది, దీనిని మీరు తక్కువగా అంచనా వేయకూడదు. అతనిలో మీరు ఓ మంచి భర్తకు ఉండాల్సిన లక్షణాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు అతని పట్ల నిర్లక్ష్యంగా వ్యవరించకుండా ఉండేలా చూసుకోండి.

మీ బిల్స్ ను అతన్నికట్టనివ్వండి: పెళ్ళి చేసుకొన్న తర్వాత, మీ భర్తే మీ ఏటిఎం. కాబట్టి ఇప్పటి నుండి అతన్ని మీ బిల్స్ కట్టనిస్తే, ఫైనాన్షియల్ బాధ్యతలు పెరుగుతాయి. వాటి గురించి తెలుసుకుంటాడు.

డాక్టర్ దగ్గరకు ఇద్దరూ వెళ్ళండి: బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు మీకేదైనా ఆరోగ్యసమస్య వచ్చినప్పుడు మీతో పాటు మీ బాయ్ ఫ్రెండ్ ను కూడా మీ వెంట డాక్టర్ వద్దకు తీసుకెళ్ళండి. దాంతో మీ పెళ్ళి తర్వాత మీకు ఆరోగ్య సమస్ తలెత్తినప్పుడు అతను మీకు తోడుగా వస్తాడు.

ఇంటి పని: భర్తలు అన్ని పనులూ చేయక్కర్లేదు. అయితే వారికి ఇంటి పని కొంతైనా తెలుసుండాలి. మీరు ఇంట్లో లేనప్పుడు కనీసం శుభ్రత పాటించే విధంగా అతనికి శిక్షణ ఇవ్వాలి. భోజనం తర్వాత గిన్నెలు చక్కబెట్టడం, సండే టైమ్ లో బూజు దులపడం, న్యూస్ పేపర్లు సర్ధడం వంటివి కనీస బాధ్యతలు అప్పగించడం ద్వారా కొంత తెలుసుకుంటారు.

వంటలో నైపుణ్యం: సాధారణంగా చాలా మంది చెబుతుంటారు. మహిళలకంటే పురుషులే పాక శాలలో సిద్దహస్తులని. అది నిజం అవ్వాలంటే మీకు నచ్చిన డిష్ నుల అతనికి నేర్పించండి.

ఆఫీస్ దగ్గర దిగబెట్టాలి: భార్యను ఆఫీస్ దగ్గర వదిలి పెట్టడం, పని ముగిసిన తిరిగి తీసుకెళ్ళడం వంటి పవిత్ర కర్తవ్యంగా భావించేలా శిక్షణ నివ్వాలి. అంటే బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుటి నుంచి ఈ అలవాటును నేర్పాలి.

తల్లిదండ్రులను కలవండి: మీ బాయ్ ప్రెండ్ మీ తల్లిదండ్రులను కలిసి ఉండవచ్చు. అయితే అతను మీ కుటుంబ సభ్యులను కూడా కలిసేలా చేయండి. అందుకు మీ కుటుంబసభ్యులంతా ఉన్న వీకెండ్ లో డిన్నర్ కు పిలవండి.

పార్ట్నర్ తో షాపింగ్: గర్ల్ ఫ్రెండ్స్ తో షాపింగ్ చేయడానికి చెక్ పెట్టి, మీ బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ చేయండి. అందువల్ల మీకు రెండ రకాల ప్రయోజనాలు ఒకటి మీ బిల్లు అతను కడతాడు. రెండవది మ్యారేజ్ తర్వాత మీకు ఏం అవసరమో తెలుసుకొని ఓపిగ్గా షాపింగ్ చేయడానికి ముందుకు వస్తాడు.

బడ్జెట్ మరియు డబ్బు గురించి మాట్లాడుకోండి: మీ బాయ్ ఫ్రెండ్ తో ఫైనాషియల్ వ్యవహారాలు సానుకూలంగా మాట్లాడుకోండి. రెంట్, పెట్టుబడులు, మరియు ఇన్స్యూరెన్స్ వంటివి చర్చించండి.

కొత్త ఇంటికోసం ప్రయత్నించండి: మీ ఇద్దరి కోసం మీకు నచ్చిన అందమైన ఇంటికోసం ఇద్దరూ వెతకండి. దాంతో అతనికి మీ అభిరుచి తెలుస్తుంది.

టాయిలెట్ ట్రైనింగ్: చాలా మంది మగవారి టాయిలెట్ ట్రైనర్లు కారు, కాలేరు. ఎందుకంటే వారు స్నానం చేసిన తర్వాత తడిగా ఉండే టవల్స్ ను అలాగే ఫ్లోర్ మీద వదిలేయడం లేదా టాప్స్ ను అలాగే రన్నింగ్ లో ఉంచడం మరియు బాత్ రూమ్ ను ఎప్పుడూ తడిగా ఉంచడం అధికంగా నీరు ఉలకబోయడం. కాబట్టి టాయిలెట్ ఎంత పొడిగా ఉంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు అంత తక్కువ. కాబట్టి అతనికి అర్ధం అయ్యేలా వివరించండి.



Click it and Unblock the Notifications











