For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్ట్ టైమ్ డేటింగా ? ఐతే ఈజాగ్రత్తలు మీకోసమే!

By Super
|

మొదటి డేట్ మనందరినీ ఉత్సాహ పరచకుండా ఉంటుందా? కొత్త వ్యక్తిని కలుసుకోవడం, కొత్త ప్రేమకు, అనుబంధానికి అవకాశం వుండడం ఏ అమ్మాయినైనా ఉత్సాహ పరుస్తుంది. కానీ నేరాల పెరుగుదల వల్లా, ఆన్లయిన్ డేటింగ్ మోసాల వల్లా మీరు మీ మొదటి డేట్ లో ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనే దాని పట్ల చాలా జాగ్రత్తగా వుండాలి. మొదటి డేట్ లో జాగ్రత్తగా వుండడం ఎలాగో తెలిపే 10 మార్గాల మీద ఒకసారి దృష్టి సారించండి.

మొదటి డేట్ లో జాగ్రత్తగా వుండడం ఎలా ?

అసంబద్ధమైన సందేశాలు

అసంబద్ధమైన సందేశాలు

ఆ వ్యక్తి మీతో అతి చనువుగా ప్రవర్తిస్తున్నాడని అనిపించినా, అతను మీకు అసంబద్ధమైన సందేశాలు ఇస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఉండకండి. మీ మొదటి డేట్ అప్పుడు మీ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే మీ వ్యక్తిగత స్వేచ్చ కోల్పోకుండా వుండాలి. అసంబద్ధమైన సందేశాలు ఆ వ్యక్తి అసలు ఉద్దేశాలను బయట పెడతాయి, అది మీ శ్రేయస్సుకు చాలా అవసరం.

అతన్ని గురించి ఇంటర్నెట్ లో వెతకండి

అతన్ని గురించి ఇంటర్నెట్ లో వెతకండి

ఈ రోజుల్లో ఇంటర్నెట్ మీద ఎవరినైనా చాలా తేలిగ్గా కనుక్కోవచ్చు. మీరు ఫేస్ బుక్ లో అతన్ని ‘ఫ్రెండ్' గా తీసుకునే ముందే అతన్ని గురించి కొంత పరిశోధన చేయండి. మీ ఇద్దరికీ ఉమ్మడి స్నేహితులు, అతన్ని గురించి తెలిసిన వారెవరైనా వున్నారా అనే కోణంలో ఈ పని చేయండి.

మీ మొదటి డేట్ ఒక పబ్లిక్ ప్రదేశంలో ఉండేలా నిర్ధారించుకోండి

మీ మొదటి డేట్ ఒక పబ్లిక్ ప్రదేశంలో ఉండేలా నిర్ధారించుకోండి

మీ మొదటి డేట్ కు ఏదైనా దూర ప్రాంతం లేదా ఏకాంత ప్రదేశం వెళ్ళకుండా ఉండేలా చూసుకోవడం అవసరం. మీ పరిసరాలను సదా గమనిస్తూ అవతలి మనిషి ఉద్దేశ్యాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వుండండి. మొదటి డేట్ లోనే మీరతన్ని నమ్మలేక పోవచ్చు గనుక అది పబ్లిక్ ప్రదేశం అయి వుంటే మంచిది.

మీ స్నేహితులకు తెలియచేయండి.

మీ స్నేహితులకు తెలియచేయండి.

మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా మరో ఫ్రెండ్ కు మీరు ఎక్కడకు వెళ్తున్నదీ, ఎక్కడ ఉన్నదీ తెలియ చేస్తూ వుండండి. గంటకోసారి మీరు ఎక్కడ ఉన్నదీ, ఎలా ఉన్నదీ తెలిపే సందేశం పంపండి. దీని వల్ల ఆమె ఒక పక్క మిమ్మల్ని గమనిస్తూ వుంటుంది; సందేశం సమయానికి రాకపోతే సరైన చర్య తీసుకుంటుంది.

పల్చటి దుస్తులు వేసుకోకండి

పల్చటి దుస్తులు వేసుకోకండి

మొదటి డేట్ రోజు అందరం అందంగా, సెక్సీ గా కనపడాలనే అనుకుంటాం. కానీ అలాగని పల్చటి దుస్తులు వేసుకుంటే సరిపోతుందా? అందుకనే చక్కగా సరిపోయే నల్లటి డ్రస్ లాంటి డీసెంట్ గా, వుండే సరైన దుస్తులు వేసుకోమని చెప్తున్నాం. క్లీవేజ్ ఎక్కువగా కనపడేవి, కురచ దుస్తులు వేసుకుంటే అబ్బాయికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టే.

పరిస్థితి చేయిదాటుతుంటే అక్కడే వుండకండి!

పరిస్థితి చేయిదాటుతుంటే అక్కడే వుండకండి!

కొన్నిసార్లు, మీరు మొదటి సారి కలిసిన వ్యక్తితో మీరు సౌకర్యంగా లేరని మీకు అనిపించవచ్చు. పరిస్థితులు చేయి దాటుతున్నాయని మీకు అనిపిస్తే, వాష్ రూమ్ కి వెళ్లి మీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి వచ్చి మిమ్మల్ని కలవమని చెప్పండి. అలాగే, అతను మీ పక్కన వుంటే అభద్రతగా అనిపిస్తే అప్రమత్తంగా వుండి తప్పించుకోవడానికి ఉపాయాలు ఆలోచించండి.

మీ బిల్ మీరే చెల్లించండి

మీ బిల్ మీరే చెల్లించండి

మరో వ్యక్తి మన భోజనం బిల్ చెల్లిస్తే బాగుంటుంది, కానీ మీ మొదటి డేట్ రోజు మాత్రం దీన్ని నివారించండి. బిల్లును ఇద్దరూ పంచుకుని అతనికి మీరు పడిపోయారనే భావన లేదా అతను మీ మీద పై చేయి సాధించాడన్న భావన అతనికి కలుగకుండా చూసుకోండి. దీని వల్ల మీ వ్యక్తిత్వం బయట పడి, మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోగలరని తెలుస్తుంది.

భవిష్యత్తు గురించి మాట్లాడకండి

భవిష్యత్తు గురించి మాట్లాడకండి

మీరు మీ పరిమితులలో వుండడం చాలా అవసరం, మీ భవిష్యత్తు గురించి అతనితో మాట్లాడకండి. మీ శేష జీవితాన్ని అతనితో గడపాలని నిర్ణయించుకునే ముందు అతన్ని గురించి బాగా తెలుసుకోండి. అందువల్ల భవిష్యత్తు గురించి మాట్లాడకండి, కనీసం మీ మొదటి డేట్ నాడు అసలు వద్దు.

అతని ఇంటికి వెళ్ళకండి

అతని ఇంటికి వెళ్ళకండి

అతని ఇంటికి గానీ, లేదా మీరు ఇద్దరూ ఏకాంతంగా వుండే ఏ ప్రదేశానికి వెళ్ళడం ప్రయత్నించి మానివేయండి. మీ ఇద్దరూ కాసిని డ్రింక్స్ తాగవచ్చు, దాని తరువాత ఏమి జరుగుతుందో తెలియకపోవచ్చు. మీరు అతని పడక గదిలో తేలకుండా ఉండేలా చూసుకోండి !

Desktop Bottom Promotion