Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
మిమ్మల్ని ప్రేమించని వారిని మీరు ప్రేమించకుండా ఉండడానికి 7 చిట్కాలు
మీరు ఒక సంబంధాన్ని కోల్పోయి మనసు విరిగి ఉంటే, మిమ్మల్ని ప్రేమించని వారిని మీరు ప్రేమించకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుంటే అవి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి సహాయపడతాయి. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడటం లేదు అని చెప్పడం జీవితంలో అత్యంత బాధాకరమైన ఒక సమయం. ఈ కఠినమైన విషయం మిమ్మల్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది లేదా అతను మిమ్మల్ని ఇష్టపడటం లేదని ఎంతోకాలంగా గ్రహించి ఉండవచ్చు. అతని నిర్ణయాన్ని మీరు అంగీకరించి మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తిని మీరు ఇష్టపడకుండా ఉండడం ఎలాగో కొన్ని చిట్కాలను తెలుసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్ళడం మంచిది.

కొంత సమయం పడుతుంది
ఈ సమయంలో, మీ హృదయం, మీ మనసు ఒకదానితో ఒకటి పూర్తిగా యుద్ధం చేసుకుంటాయి. ఇప్పటికీ మీరు అతనిని ప్రేమిస్తూ ఉంటే, మీ హృదయం తిరిగి ఆ దారిలో వెళ్లి అతనిని ఒప్పించడానికి ప్రయత్నించి ఆ బంధంలోని సంతోషకర సంఘటనలను గుర్తుచేసుకుంటారు. మరోవైపు, మీ మనసు అతని భావాలూ మారాయి అని గ్రహించడానికి ప్రయత్నించినపుడు మీరు ఏమీ చేయలేరు. మీ హృదయం, మీ మనసు ఈ నిజాన్నిఅంగీకరించి, ఒక నిర్ధారణకు రావడానికి కొంత సమయం పడుతుంది. మిమ్మల్ని ప్రేమించని వ్యక్తిని మీరు ప్రేమించకుండా ఉండడానికి మీకైమీరు కొంత సమయాన్ని ఇవ్వడం ఉత్తమమైన చిట్కాలలో ఒకటి.

మీకు జరిగిన నష్టానికి బాధపడటం
మీకు జరిగిన నష్టానికి బాధపడదానికి కొంత సమయం ఇవ్వండి. విడిపోయిన తరువాత, సాధారణంగా కోపం, గందరగోళం, మోసం, బాధ వంటి అనుభూతులను పొందుతారు. ఈ కష్టతరమైన భావోద్వేగాల విధానంలో, ఎవరైనా మీ ప్రేమ కోసం తాపత్రయ పడడానికి మీరు అర్హులే అని గుర్తించాలి.

నలుగురిలో కలవడానికి మీకైమీరు ప్రయత్నించండి
మీరు కోల్పోయిన సంబంధ౦ నుండి ఒదార్పుకు మీకోసం మీరు కొంత సమయం కేటాయించండి, నలుగురితో కలవడానికి ప్రయత్నించండి. మీరు ఇంట్లోనే ఉండి, మీ ఆలోచనలతో వంటరిగా ఉండాలి అనుకుంటున్నారా. మీరు ఒంటరిగా ఎంత ఎక్కువసేపు గడిపితే, మీ ఎక్స్ గురించి నేను చాలా కోల్పోయానని అంత ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు నలుగురితో కలిసి, సరదాగా గడపడం అనేది మిమ్మల్ని ఒత్తిడి భావన నుండి బైటికి తీసుకు వచ్చే సరైన మార్గం.

మీకై మీరు కొన్ని లక్ష్యాలను పెట్టుకోండి
మీ జీవితాన్ని ప్రభావితం చేయడానికి, కొన్ని లక్ష్యాలను పెట్టుకోండి. కొత్త భాష నేర్చుకోవడం, కొత్త కారు కొనడం, పనిలో ఎదుగుదల, ఇతర దేశాలకు వెళ్ళడం, లేదా పూర్తిగా కొత్త జీవితం వైపు అడుగులు వేయడం వంటి లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఆ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నా, మీరు కోరుకున్న జీవితాన్ని సృష్టించుకోవడానికి చాలా సమయం ఉంటుంది.

ఎటువంటి సంబంధాలూ పెట్టుకోవద్దు
మీ ఎక్స్ తో అన్ని సంబంధాలను వదిలేయండి. సోషల్ నెట్వర్క్ సైట్ నుండి అతనిని తొలగించండి, కాబట్టి అతని జీవితపు తాజా విషయాల గురించి మీరు నిరంతరం గుర్తించారు. అతను ఎవరితో ఉంటున్నాడు అనే విషయాలను తెలుసుకోవడానికి ఆశక్తికరంగా ఉన్నప్పటికీ, మీ భావోద్వేగ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ సెల్ నుండి, ఇ-మెయిల్ నుండి అతనికి సంబంధించిని సమాచారాన్ని తొలగించండి, దానివల్ల మీరు అతనితో కలవకుండా ఉంటారు.

భావోద్వేగ విషయాలను వదిలేయండి
మీ ఎక్స్ కు సంబంధించిన గుర్తుచేసే విషయాలను వదిలేయండి. అందువల్ల మీరు పాత ఇ-మెయిల్స్, మీ ఇద్దరి బొమ్మలు, వాయిస్ మెయిల్స్ లేదా టెక్స్ట్ మెసేజ్ ల పై డిలీట్ బటన్ నొక్కండి. మీరు ప్రేమలో ఉన్నపుడు సంతోషకర సమయాలను గుర్తుచేసుకోవడం వంటివి మిమ్మల్ని మీరు హింసించుకోవడమే. ఇది మీరు మెరుగుపరుచు కోవడంలో ప్రధాన ఎదురుదెబ్బలను సృష్టిస్తుంది కూడా.

తిరిగి డేటింగ్ ప్రారంభించండి
మీరు మీ ఎక్స్ ను పూర్తిగా వదిలేయనప్పటికీ, తిరిగి డేటింగ్ కి ప్రయత్నించండి. మీ ఎక్స్ స్థానంలో ఇంకొకరిని గుర్తించడానికి మిమ్మల్ని మీరు ఒత్తిడి పెట్టుకోవద్దు. ఇతరులతో మాట్లాడడం, ఇతరులను కలవడం, సరదాగా ఉండడం వంటి లక్ష్యాలను పెట్టుకోండి. ఈ బాధ నుండి మీ మనసు కుదుటపడినపుడు, మీకు సరైన వ్యక్తీ కనిపించే వరకు కొంతమంది అద్భుతమైన వ్యక్తులను కలవండి. ఈ సంబంధాన్ని పరిష్కరించే విషయంలో మీరు ఒంటరిగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తించ వచ్చు.



Click it and Unblock the Notifications