For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకరి ఇష్టాలను మరొకరు గౌరివించుకోవడం ఎలా?

|

భార్యాభర్తలబంధమంటే విడదీయ రానిదని, ఒకరికిఒకరుగా, తోడునీడగా, పాలునీళ్ళలా జీవితాంతంకలిసిపోయి ఉండే బంధమని అంటుంటారు. మారుతున్న సమాజం, పెరుగుతున్న మహిళా చైతన్యం, విద్యావంతులు, ఉద్యోగాలు చేస్తున్న మహిళ లు ఎక్కువవుతున్న నేటికాలంలో భార్యాభర్తల బంధం కూడా కొత్త నిర్వచనాన్ని ఇస్తుంది. గతంలో భార్య భర్త అడుగుజాడల్లో నడుస్తూ, భర్తకు సమయానికి అన్నీ సమకూరుస్తూ, దగ్గరుండి భర్త అవసరాలను చూసుకుంటూ ఉండేది. భర్త భార్యమీద సర్వహక్కులు కలిగి ఉండి, ఆమె చేసే ప్రతి చిన్న పనిమీద, ఆవిడ కు సంబంధించిన ప్రతి చిన్న విషయంమీద అజమాయిషీ చేస్తూ యజమానిలా ప్రవర్తించే వారు. మారుతున్న కాల ప్రభావం, పెరుగు తున్న ఆర్థికావసరాల దృష్ట్యా భార్యలు కూడా తప్పనిసరిగా ఉద్యోగాలు చేయవలసిన అవసరం వచ్చింది.

ఆధునిక యువతులు చదువుతో పాటు తమకంటూ సొంత ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటున్నారు. చదువు, ఉద్యో గం, కెరీర్‌, ఆ తర్వాతే పెళ్లి. జీవిత ప్రాము ఖ్యతల్లో మొదటి స్థానంలో ఉండే పెళ్లి నాల్గవ స్థానానికి వెళ్లింది. అలాగే భార్య స్థానం కూడా భర్త వెనుకఉంటూ, భర్త అవసరా లను చూస్తూ వెంటవెంట తిరిగేస్థాయి నుండి తనకేం కావాలో, తానేం చేయదల్చుకుందో తెలుసుకునేస్థాయికి ఎదిగింది. చదువు, ఉద్యోగం, కెరీర్‌, పెళ్లి ఇలా ఆలోచించే నేటి మహిళలు వారి వైవాహిక జీవితం లో కూడా జీవితభాగస్వామి నుండి తమకంటూ కొంత సమయాన్ని కోరుకుంటున్నారు. రాజేష్‌, శిరీష ఇద్దరూ కంప్యూటర్‌ ఇంజనీర్లు. ఇద్దరూ చదువుకున్నవారు.

ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ఇద్దరికి వారి వారి అభిరుచులు, ఇష్టాలు వేరువేరుగా ఉంటాయి. ఎవరో ఒకరి ఇష్టం మీద నడ వడం ఇద్దరికీ ఇష్టంలేదు. అందుకే వీకెండ్స్‌ ఎవరి ఫ్రెండ్స్‌తో వాళ్లు సరదాగా గడుపు తుంటారు. కుటుంబ సంబంధ పార్టీలకు, ఫంక్షన్‌లకు ఒకరికి తెలియకుండా మరొకరు గానీ వస్తామని హామీలివ్వరు. సిద్ధార్థకు తన స్నేహితులతో కలసి క్రికెట్‌ చూడటమంటే ఇష్టం. రాగిణికి సినిమాలు చూడటమంటే ఇష్టం. తమతమ ఇష్టాలను ఒకరికొకరు ఒకరు త్యాగం చేసుకోకుండా వీకెండ్స్‌లో సిద్ధార్థ్‌ తన స్నేహితులతో క్రికెట్‌ చూడటానికి వెళితే రాగిణి సినిమాలు చూడటానికి వెళుతుంది. నేటికాలపు ఆదర్శ దాంపత్యం అలాగే ఉంటుంద నిపిస్తుంది వీరిని చూస్తుంటే.

వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య స్పేస్‌ను పాటిస్తూనే, సంతోషంగా తమ కష్టాలను, వ్యక్తిత్వాలను నిలుపుకోవడానికి చిన్నచిన్న సూచనలు పాటిస్తే సరి.

1. ఆఫీసు నుండి వచ్చిన మీ భర్త/భార్య రాగానే అనవసరమైన ప్రశ్నలతో వేధించక కాసేపు వారిని ఒంటరిగా, ప్రశాంతంగా వదిలేయండి.

2. మీ భర్త/భార్య ఆసక్తి చూపని మీ ఆఫీసు పార్టీలకు, ఫంక్షన్లకు రమ్మని బల వంతపెట్టకండి.

3. మీ జీవిత భాగస్వామి వారి స్నేహితు లతో బయటకెళ్లడానికి ప్రోత్సహించండి.

4. టి.వి.రిమోట్‌ మీ చేతిలో పెట్టుకుని, మీకిష్టమైన ప్రోగ్రామ్స్‌ను మాత్రమే చూడకండి. మీ జీవిత భాగస్వామికి కూడా ఇష్టమైన ప్రోగ్రామ్‌లు చూడటానికి అవకాశ మివ్వండి.

5. మీరు ఆఫీసు పనితో అలసిపోయి ఇంటికి రాగానే అల్లరిచేయకుండా ఉండేలా మీపిల్లలను ట్రైన్‌ చేయండి.

6. మీ పుస్తకాలు, క్యాసెట్లు, సి.డి.లు సాధ్యమైనంతవరకు వేరేగా పెట్టుకోవ డానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఇద్దరి వస్తువులు వేరువేరుగా ఉండి వెతుక్కునే అవసరం, శ్రమ తప్పుతాయి. సమయం ఆదా అవుతుంది. ఒకరి అభిప్రా యాలు, ఇష్టాలు ఇంకొకరు గౌరవించి నట్టవుతుంది.

7 మీ జీవిత భాగస్వామి కోరుకునే ప్రైవసీనివారికి అందించండి. వారు ఒంటరిగా ఆలోచనలోనో, ప్రశాం తంగా ఉన్నప్పుడు కదిలించకండి. ఏదైనా చెప్పా లనుకుంటే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలను కున్నాను. కానీ మీరు ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి అది రేపటికి వాయిదా వేస్తున్నానని చెప్పండి. దీనివల్ల మీరు, మీ జీవిత భాగ స్వామి ఇష్టాన్ని గౌరవించినట్టవు తుంది. ఇది వారికి ఎంతోసంతోషాన్ని కలిగిస్తుంది.

English summary

Respect Each Other for A Happy Marriage

Respect is keenly tied to the feeling of safety. An attitude of respect builds a bridge of trust, where I know you value me, and this attitude must be prevalent in any relationship for it to exist. If I don’t feel respected by you, I certainly won’t risk getting close to you.
Story first published: Saturday, March 15, 2014, 15:00 [IST]