Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మగవారు అందంగా అబద్దాలాడుటకు స్త్రీలే కారణమా
అబద్ధం... ఒక్కోసారి ఆడాల్సి వస్తుంది. అందంగా అబద్ధాలు చెప్పడంలో మగాళ్లు కూడా ఆడవారికి ఏమాత్రం తీసిపోరు. ఇంకా చెప్పాలంటే... మగాళ్లు అబద్ధం ఆడటానికి కారణం కూడా చాలాసార్లు ఆడవారే!
ప్రేమికుడి కథలు!
ప్రియురాలి రూపంలోనో, భార్య అవతారంలోనో ఒక అమ్మాయి ఒక అబ్బాయి జీవితంలోకి ప్రవేశిస్తుంది. దాంతో, అబద్ధాలు ఆడాల్సిన తరుణం వచ్చేసినట్టే. అంటే, ‘ప్రేమలో మునిగి ఉన్నవారూ పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు మగ మహారాజులందరూ అసత్య హరిశ్చంద్రులేనా' అనే పాయింట్ లేవదీయొచ్చు. అందరూ అన్ని సందర్భల్లోనూ అబద్ధాలు ఆడతారన్నది ఇక్కడ చర్చ కాదు. కొన్ని సందర్భాల్లోనైనా మగాడు అబద్ధం చెప్పాల్సి వస్తుందన్నది పాయింట్.
ఎలా అంటారా... నెలలోని నాలుగో ఆదివారం నాడు ‘డియర్... మనం ఐమ్యాక్స్‌లోని ‘స్పైడర్‌మ్యాన్-2' త్రీడీలో చూద్దామా' అని ప్రియురాలు ఓ కోరిక కోరిందే అనుకోండి! గుండెమీద చెయ్యేసుకుని జేబు సత్తువ తెలిసున్న ఓ మగాడు చెప్పే అబద్ధం ఏమై ఉంటుంది... ‘ఆ సినిమా బాలేదట. మా ఫ్రెండ్స్ చూసి బాగా బోర్ ఫీలయ్యారట. నెక్స్‌ట్ వీక్ ఇంకోటి ప్లాన్ చేద్దాం' అని! అనుకోకుండా ఫ్రెండ్స్‌తో టూర్‌కి వెళ్లాల్సి వస్తే... ‘నాన్న అర్జెంట్‌గా ఊరికి రమ్మని ఫోన్ చేశారు.
తిరిగొచ్చాక నీకు కాల్ చేస్తా' అని ప్రియురాలితో ప్రియుడు చెప్పాల్సి వస్తుంది. ఫ్రెండ్స్‌తో పార్టీ... రోజంతా లవర్‌కి ఫోన్ చేయడం కుదర్లేదు. మర్నాడు మగాడు చెప్పే నిజం లాంటి అబద్ధం... ‘సారీరా... నిన్న నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.' ఈ తరహా సందర్భోచితంగా అబద్ధాలు ఆడటం అనే కళలో మగాడు పట్టు సాధిస్తాడు. ఇక, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చెప్పే అబద్ధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది!
భర్త కథలు!
భర్తగా మారిన మగాడికైతే అబద్ధాలు ఆడాల్సిన సందర్భాలు ఎన్నో! మగాడి మైండ్‌లో ఏవో ఆలోచనలు గిర్రుమంటుంటాయి. సరిగ్గా ఆ సమయంలో ఓ కొత్త చీరకట్టుకుని భార్య ఎదురుగా వస్తుంది. ‘ఏమండీ... ఎలా ఉంది?' అంటుంది. మనకి ఎలా ఉంటుంది? మూడ్ ఎలా ఉన్నా సరే... ‘చాలా బాగుంది. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు' అని చెప్పక తప్పని పరిస్థితి. అద్దం ముందు భార్య నిలబడి ఉంటుంది. ‘ఏమండీ... ఈ మధ్య నేను లావైనట్టున్నాను కదా' అని అడుగుతుంది. ‘అలాంటిదేం లేదు. నీకంటే లావుగా ఎంతమంది లేరు! మనం ఎలా ఊహించుకుంటే అలానే ఉంటాం' అంటాడు మగాడు. ఆరోజు భార్య బర్త్‌డే.

సాయంత్రం పార్క్‌కి తీసుకెళ్తానని పతిదేవుడు వరమిచ్చేసి ఉంటాడు. కానీ, మరచిపోయి ఉంటాడు! సాయంత్రం ఆవిడ ఫోన్ చేసింది. ‘సారీ... డియర్. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. తొందరగానే బయల్దేరాను, కానీ...'- ఇదీ మగాడి మాట. అనుకోకుండా మిత్రులతో సినిమాకి వెళ్లాల్సి వచ్చింది. థియేటర్‌లో ఉండగా భార్య ఫోన్ చేసింది. ‘అయామ్ ఇన్ మీటింగ్. కాల్ యు లేటర్' అనే సందేశం మగాడు పంపాల్సిన సందర్భం ఇది. ప్రేమతో భార్యకి బహుమతి కొంటాడు. మురిసిపోయిన భార్య ‘దీని ఖరీదు ఎంత?' అని అడుగుతుంది. రేటు తగ్గించి చెప్పాల్సిన తరుణం ఇది.
‘ఇవాళ తలనొప్పిగా ఉంది', ‘ఇంకోసారి ఆలోచిద్దాం', ‘వచ్చే ఏడాది గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం', ‘మీ అమ్మావాళ్లింటి దగ్గర పదిరోజులు ఉండిరా! నా గురించి ఆలోచించకు. పాపం, వాళ్లకీ మా అమ్మాయి నాలుగు రోజులు ఉండాలనే కోరిక ఉంటుది కదా'.. ఇలా అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితులు నిత్య జీవితంలో మగాడికి ఎదురవుతూనే ఉంటాయి. అబద్ధం ఒక్కోసారి మగాడికి అవసరం. చాలాసార్లు అదే ఆయుధం. కొన్నిసార్లు అదే వరం. అతి కొద్ది సందర్భాల్లో మాత్రం శాపం!



Click it and Unblock the Notifications