సాధరణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీల మద్య లవ్ ఎఫెయిర్స్ మరియు డేటింగ్, మ్యారేజ్ ఇవన్నీ సాధరణం. ఇలా విషయాలు అటువంటి సెలబ్రెటీలకు మరింత పబ్లిసిటిని తెచ్చిపెడుతుంది. అలా పాపులర్ అయిన సెలబ్రెటీలు కూడా టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. వారు వారి కో స్టార్స్ తో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తూ పబ్లిక్ లో బాగా పాపులర్ అయినారు. మరికొందరు రిలేషన్ షిప్ ను మరింత బలపరచుకోవడం కోసం పెళ్ళిళ్ళు కూడా చేసుకొన్నారు. అలా లవ్ ఎఫెయిర్ మరియు మ్యారేజ్ లైఫ్ ను అనుభవిస్తున్న కొందరు స్టార్ టాలీవుడ్ సెలబ్రెటీలు ఈ క్రింది స్లైడ్ లో మీకోసం పరిచయం చేస్తున్నాం....
అమల-నాగార్జున
తనతో పాటు పలు చిత్రాల్లో నటించిన అమలతో నాగార్జున ప్రేమలో పడ్డారు. ఇద్దరూ 1992లో వివాహం చేసుకున్నారు.
నయనతార-శింబు ఎఫెయిర్:
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయనతారు కోస్టార్ శింబుతో ప్రేమాయణం నడిపింది. అయితే 2006లో నయనతార వారి ప్రేమకు బ్రేక్ అప్ వేసినట్లు ఒక స్టేట్ మెంట్ ఇచ్చింది.
అమలా పాల్ -విజయ్ మ్యారేజ్:
ఇక్కడ కనబడుతున్న ఒక కొత్త జంట టాలీవుడ్ లో ఈ మద్య బాగా పాపులర్ అయ్యారు. అమలా పాల్ డైరెక్టర్ తో ప్రేమలో పడి రీసెంట్ గా మ్యారేజ్ చేసుకొన్నది.
హన్సిక-శింబు:
టాలీవుడ్ యాక్టర్స్ హన్సిక తమిళ్ యాక్టర్ శింబుతో ప్రేమలో పడిందనే వార్తలు పలు వెబ్ సైట్స్ లో హల్ చల్ చేశాయి. అయితే వారు కూడా విడిపోయినట్లు ఈ మద్య ఒక స్టేట్ మెంట్.
కాజల్ అగర్వాల్ బాయ్ ఫ్రెండ్:
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన ఇండస్ట్రియలిస్ట్ తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల అతనితో కలిసి హాలిడే ఎంజాయ్ చేసిన ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి.
నయనతార-ప్రభుదేవ:
కొరియోగ్రాఫర్ ప్రభుదేవ డైరెక్టర్ గా మారారు. అటువంటి సమయంలో ప్రభుదేవాతో నయనతార డేటింగ్ చేస్తోందని బాగా పబ్లిసిటి అయ్యింది. 2012లో వీరి ప్రేమ కూడా బ్రేక్ అప్ అయ్యింది.
నమ్రత-మహేష్
‘వంశీ' సినిమా సమయంలో ప్రేమలో పడ్డ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్.....ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు.
రేణు దేశాయ్-పవన్
టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ‘బద్రి' సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోకుండానే కొంతకాలం సహజీవనం చేసి ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. ఆ తర్వాత 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
వరుణ్ సందేష్, శ్రద్ధా దాస్
వరుణ్ సందేశ్, శ్రద్ధా దాస్ మధ్య ఎఫైర్ నడిచింది. ఇద్దరూ కలిసి కొంతకాలం డేటింగ్ చేసారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.
సమంత-సిద్ధార్థ్
హీరోయిన్ సమంత, సిద్ధార్థ మధ్య ఎఫైర్ ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు.
రానా, త్రిష
తెలుగు నటుడు రానా, హీరోయిన్ త్రిష మధ్య ఎఫైర్ ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య స్నేహ బంధమే తప్ప అలాంటిదేమీ లేదంటున్నారు ఈ స్టార్స్.
నిషా అగర్వాల్
హీరోయిన్ నిషా అగర్వాల్ ముంబైకి చెందిన వ్యాపార వేత్త కరణ్ వాలేచాతో ప్రేమలో పడింది. 2013లో అతన్ని పెళ్లాడింది.
జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్
హీరోయిన్ జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
సూర్య, జ్యోతిక
సూర్య, జ్యోతిక పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
రిచా, సుందర్
హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్...తమిళ నటుడు, ఫోటోగ్రాఫర్ సుందర్ రాముతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అనుష్క శెట్టి
హీరోయిన్ అనుష్క శెట్టికి....నాగార్జునతో పాటు పలువురు స్టార్లతో లింక్ ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.
ఇలియానా ఎఫైర్
నటి ఇలియానాకు ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇలియానా మాత్రం ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయట పెట్టలేదు.
విదేశీయుడితో తాప్సీ
హీరోయిన్ తాప్సీ డానిష్ బ్యాడ్మింటన్ స్టార్ మాథిస్ బోతో ఎఫైర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఓ సారి ఇద్దరూ మైదరాబాద్‌లో కలిసారని, ఆ తర్వాత ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.
శృతి హాసన్, సిద్ధార్థ్
హీరోయిన్ శృతి హాసన్, నటుడు సిద్ధార్థ మధ్య ఎఫైర్ ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా వట్టి పుకార్లే అని తేలిపోయింది.
తమన్నా బాటియ:
శ్రుతి హాసన్ లాగే తమన్నా కూడా కొంత మంది స్టార్లు విరాట్ కొహిలీ మరియు షాజిద్ ఖాన్ వంటి వారితో ప్రేమలో పడిందనే వార్తలు వచ్చాయి. కానీ అవి మాత్ర ఏఒక్కటి రుజువు కాలేదు.
శ్రియా శరన్ జెస్సీ మెట్కాఫ్ తో:
శ్రియ తన కోస్టార్ జెస్ మెట్కాఫ్ తో రిలేషన్ షిప్ లో ఉందని వార్తలు వస్తున్నా, వీరిద్దరు వాటి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
సంజన-విరాట్ కొహ్లీ:
యాక్టర్స్ సంజన బెంగళూర్ రాయల్ చాలెంజెర్స్ బ్యాట్సమన్ విరాట్ కొహ్లీతో రిలేషన్ షిప్ ఉందని వస్తున్న వార్తలను సంజన నిరాకరించింది.
చార్మీ-సోనూసూద్:
చార్మీ -సోనూ సూద్ తో డేటింగ్ చేస్తోందని రూమర్ హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది.
అసిన్-నైల్ నితిన్:
ఆసిన్ -నైల్ నితిన్ మీద చాలా రూమర్స్ ఉన్నాయి. వీరద్దరూ ముంబాయ్ లో చక్కర్లు కొడుతున్నట్లు, రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను వారు చాలా తేలికగా జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని తేల్చేశారు.
ప్రియమణి సీక్రెట్ లవ్ ఎఫెయిర్:
ప్రియమణి కూడా లవ్ లో పడిందని గత రెండు సంవత్సరాలుగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టి, అతని ఈ మద్యనే పెళ్ళి చేసుకుంది.అయితే అతను ఇండస్ట్రీలో వ్యక్తి కాదు..
నమిత సీక్రెట్ లవ్ ఎఫైర్:
నమిత ఒక బిజినెస్ మ్యాన్ తో లవ్ లో పడిందనే వార్తలు వస్తున్నా, ఆమె మాత్రం తన ప్రేమ వ్యవహారాన్ని నిర్ధారించలేదు.
లక్ష్మీ రాయ్:
యాక్టర్స్ లక్ష్మీ రాయ్ దోణితో రిలేషన్ షిప్ ఉందని, ఇద్దరూ చెన్నైలో ఓ డైనింగ్ హోటల్లో పట్టుబడ్డారన్న వార్తలు హాల్ చల్ చేసినా, వీరిద్దరి మద్య అటువంటిదేం లేదని తేలిపోయింది.



Click it and Unblock the Notifications