Latest Updates
-
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
మీ రిలేషన్ షిప్ బ్రేకప్ అవ్వడానికి 5 సూచనలు
సంబంధాలు కలుపుకోవటం చాలా సులభం, కానీ వాటిని కలకాలం నిలుపుకోవటం చాలా కష్టం అని చెపుతుంటారు. నేటి కాలంలో, సంబంధం, ముఖ్యంగా దీర్ఘ కాల సంబంధాన్ని నిలుపుకోవటం అంటే అంత సులభం కాదు. దీర్ఘకాలసంబంధ నిలుపుదల కోసం ఇద్దరు జీవిత భాగస్వాముల నుంచి నిరంతర ప్రయత్నాలు మరియు సర్దుబాట్లు చాలా అవసరం.
కాని, ఎంతగా కృషి, ప్రయత్నం చేసినా సంబంధాలు ఫలవంతంగా ఉండకపోవటం అన్నది చాలా అరుదుగా ఉంటుంది మరియు బహుశ ఇద్దరి గమ్యస్థానం చివరి అంచుదాకా వెళ్ళటమే అయిఉంటుంది మరియు ఆ తరువాత ఇక మిగిలేదేమీ ఉండదు. ఇక్కడ ఇద్దరిమధ్య బంధం ఏమి లేదు అని చెప్పటానికి 5 గుర్తులను ఇస్తున్నాము. ఇద్దరు బంధం నిలుపుకోవటానికి ఏమైనా సహకరిస్తాయేమో చూడండి.

పరస్పర గౌరవం లేకపోవటం
పరస్పర గౌరవం అన్నది ఒక ఆరోగ్యకరమైన సంబంధంలో కీలక పాత్ర వహిస్తున్నది. శృంగార, లేదా సాధారణ స్నేహం లేదా అంతకంటే ఎక్కువ సంబంధం ఏదైనా సరే!. మీ జీవితభాగస్వామి, మిమ్మలిని చిన్నచూపుతో చూస్తుంటే, మిమ్మలిని అవమానిస్తుంటే లేదా మిమ్మలిని ఎక్కడైనా సరే,చికాకు పెడుతుంటే మరియు ఆ తరువాత కూడా, వారు జరిగినదానికి పశ్చాత్తాపం చెందకుండా ఉంటే, ఆ సంబంధం ఎక్కువకాలం నిలవదు.. వారు నిరంతరం వారి వ్యక్తిగత సరిహద్దులు ఉల్లంఘిస్తే, అప్పుడు ఒకరంటే ఒకరికి ఏ మాత్రం గౌరవం ఉండదు మరియు వారి బంధం కూడా తెగిపోయిందని భావించవొచ్చు.

ఎల్లప్పుడూ ఆకర్షణ ఉండదు
ఒక ఆరోగ్యకరమైన సంబంధం నిలబడాలంటే అనుకూలంగా ఉన్న భాగస్వాములు అవసరం, అప్పుడే ఇద్దరి మధ్య ఆకర్షణ ఉంటుంది. ఇద్దరి జీవితగమ్యాలు చేరటానికి ముఖ్యమైన మూలసూత్రాలు భిన్నంగా ఉంటే, అప్పుడు ఇద్దరి మధ్య ఆకర్షణ ఎక్కువకాలం నిలువదు, అందువలన ఇద్దరిలో చిరాకు ప్రారంభం కావొచ్చు మరియు మీ సంబంధం బలహీనపడుతుంది.

నిరంతరం వాదనలు
ప్రతి సంబంధంలో కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి మరియు అదేవిధంగా వాదోపవాదాలు ఉంటాయి. రెండు వేర్వేరు వ్యక్తిత్వాలు, మీరు ఎంచుకున్న మార్గాలు మరియు అనేక ఇతర విషయాలు ఉండటం వలన భేదాలు ఎర్పదవొచ్చు మరియు వాదనలు జరగవొచ్చు. మీ వాదనలు చాలా కఠినంగా ఉంటే మరియు మీ ఆలోచనలు సరిహద్దులు దాటి ఉంటే, ఇద్దరిలో నిరాశ, విసుగు, చిరాకు మొదలై, సహజంగానే ఆ సంబంధబాంధవ్యాలు నిలువవు.

ఒకరి కోసం ఒకరు సమయం వెచ్చించకపోవటం
ఇద్దరి మధ్య కనీస సంబంధం నిలబడాలి అనుకుంటే , అప్పుడు ఆ బంధానికి తిరిగి జీవం రావాలనుకుంటే ఏమి చేయలేరు మరియు అదే వేగంతో తెగిపోతుంది ఎప్పుడైతే ఇద్దరిమధ్య సంబంధం నిలబడాలంటే కావలసిన శ్రద్ధ, ప్రేమ, అనురాగం కొరవడుతాయో ఆ బంధం ఇక నిలువదు.

ఆసక్తి కోల్పోవటం
ఇద్దరిలో ఒకరు ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా విషయం చర్చించినప్పుడు, వారు మాట్లాడుతున్నవారి పట్ల ఆసక్తి కనపరచకపోవటం వంటివి ఇద్దరి మధ్య సంబంధం బలహీనపడుతున్నదనటానికి గుర్తు. అందువలన దానికి అంగీకరించి, అదే విషయాన్ని వారికి చెప్పి సంబంధాన్ని తెన్చుకోవటం మంచిది..



Click it and Unblock the Notifications
