Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అతనితో మాట్లాడకూడని కొన్ని విషయాలు
మీరు ఇద్దరూ అన్ని విధాల మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే భావన మీకు ఉండవచ్చు. మీ బాంధవ్యంలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురవ్వవని మీరు అనుకోవచ్చు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరనుకున్నట్టే మీ బాంధవ్యం కలకలం పదిలంగా ఉంటుంది. కొన్ని రకాల సంభాషణలు ఇద్దరి మధ్య చోటు చేసుకోకపోతే ఇరువురి బంధం కలకలం సంతోషంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు రావు. ఏ విధమైన సంభాషణలను అవాయిడ్ చేస్తే బాంధవ్యం కలకలం పదిలంగా ఉంటుందో ఇప్పడు చూద్దాం.

అతని తల్లి గురించి కామెంట్స్ చేయడం:
అబ్బాయి తల్లితో కలిసిపోవడమనేది అమ్మాయికి కొంచెం కష్టమైన విషయమే. మీకెటువంటి అభిప్రాయమున్నా ఆవిడా మీద కామెంట్స్ చేయకపోవడం మంచిది. ఈ విషయం అతనిని బాగా హర్ట్ చేస్తుంది.

అతని స్నేహితులు :
అతని స్నేహితులలో ఎవరైనా మిమ్మల్ని ఏ విధంగా ఇంప్రెస్ చేసినా అతని ముందు అతని స్నేహితులకు కాంప్లిమెంట్స్ ఇవ్వకూడదు. మీరు క్యాజువల్ గా కాంప్లిమెంట్ ఇచ్చినా అతను మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది.

అతని కలలపై :
జీవితంపై అతనికంటూ కొన్ని డ్రీమ్స్ ఉండుంటాయి. మీరు ఆ డ్రీమ్స్ చేరుకోవడానికి సపోర్ట్ ఇవ్వలేకపోయినా వాటిపై కామెంట్ చేసి అతని ఆగ్రహానికి బలి కావద్దు.

విడిపోతానని బెదిరించడం :
చిన్న చిన్న గొడవలు భార్యాభర్తల బంధంలో సహజం. వాటినే పట్టుకు కూర్చుని వదిలి వెళ్ళిపోతానని అతనిని బెదిరించడం మంచిది కాదు. అలా చేస్తే విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నట్టు కనిపిస్తుంది. మీ ఉద్దేశ్యం అదే కాకపోయినా అతనికి ఇలా అర్థమవుతుంది.

జీతం :
భార్యాభర్తల మధ్య ఎక్కువగా చోటు చేసుకునే తగాదాలు జీతానికి సంబంధించినవే. శాలరీ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి తూచి మాట్లాడడం మంచిది.



Click it and Unblock the Notifications